అలాగే ఉళ్ళోనూ రాముడూ సీతా వెలిశారు. అయిన వాళ్ళు సంబంధం కలుపుకోవలసిన వాళ్ళు కావాల్సినవాళ్ళు కావడంతో పేర్లతో పాటు పెళ్ళి ముచ్చట్లు కలిసిపోయాయి. తండ్రిలేని పెంపకం అని అనిపించుకోకుండా పెంచింది ఆమె.
రాముణ్ణి చూసి ఎన్నేవాళ్ళే కానీ వేలెత్తి చూపే వాళ్ళు ఎవరూ లేకపోవటంతో అతడి సంబంధం అందరికి ఆమోద యోగ్యమే అయ్యింది. ఆ ఆమోదం కళ్యాణ వేదికకు నడిపించి పెళ్ళే జరిపించింది.
పెళ్ళయితే అయ్యింది. కానీ సీతా మహాలక్ష్మి కాపురానికి రాలేదు. అత్తారింటికి గృహ ప్రవేశం అయ్యింది. కాబట్టి రాకపోకలకు ఇబ్బంది లేదు. సూర్యుడు లాగే సూర్యోదయంతో వచ్చి సుర్యాస్తమయంతో పుట్టింటికి వెళ్ళిపోయేది. నేతనేయని పడుగు పేకల్లాగా ఉన్నారిద్దరూ, ఇంతలో వచ్చేసింది అవాంతరం!
అయోధ్యలో సీతాదేవి అంతరంగం తెలుసుకుని మెలిగే సఖీజనం కోసం దేశంలో అన్వేషణ మొదలైంది. అజనభ దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అందం చందం ఉన్న అమ్మాయిల కోసం గాలింపు మొదలైంది.
రాజంతఃపురం వైపు కన్నెత్తి చూసే అదృష్టం ఎవరికి దక్కదు. అసలు జీవితంలో రాజధానికి వెళ్ళి రాజ ప్రాసాదాలని చూసే అర్హత, యోగ్యత అదృష్టం ఎవరికో కాని అందదు.
అలాంటిది ఇష్టసఖిగా అడుగు పెట్టడం అంటే అదెంత అదృష్టం! అందునా రామాయణం అంత కధ నడిపించిన సాక్షాత్తూ లక్ష్మి దేవి అవతారం అయిన సీతాదేవి సేవ లభించడం అంటే మరీ అదృష్టం కాదూ! ఇటివలి కాలంలో యావత్తు ఆ జనాభా దేశఖ్యాతి లభించిన మహారాణి గారాయె!
సీతమహాలక్ష్మికి నిండా పన్నెండేళ్ళు. ఈడేర లేదు. కానీ ఈడేరిన దానిలా షోడశవర్షాలు వసంతం తొంగి చూసిన పూసిన రసాలంలా ఉంటుంది. అత్తారింటికి, పుట్టింటికి తిరుగుతూ నాలుగు వీధుల జనాల దిష్ట కళ్ళకు దీపంలా ఉండే సీతమహాలక్ష్మి గ్రామ పెద్ద దృష్టిలో పడింది.
ఈ పసిడి రెమ్మ కొమ్మ అయ్యేదాకా అయోధ్యలో ఉంటె ఆమెకి పేరూ, తమ ఊరికి ప్రఖ్యాతి అనుకున్నాడా పెద్ద మనిషి వహికర్తల లెక్కల్లో తప్ప పేరుకేక్కని దండ కారణ్య ప్రాంతంలోని తమ గ్రామం అంతఃపురం ద్వారా లేక్కల్లోకి ఎక్కుతుందని ఆశపడ్డాడు. ఆలోచన చేశాడు. అది సీతమహలక్ష్మి తండ్రికి ఆమోదదాయకంగా అనిపించి సరే అనేశాడు.
మమకారం నింపుకున్న రాముడి తల్లి మాత్రమే ఏమి అనలేకపోయింది. అయితే అత్తగారి హొదాలో ఆమె అభ్యంతరం చెప్పలేకపోయింది పెద్దమ్మ. నట్టిల్లులా ఉండే తమ పూరిల్లు రాణివాసం వెళ్ళే సీతామహాలక్ష్మి వల్ల ఆ సీతారాముల దయవల్ల లక్ష్మి నిలయంగా మారిపోతుందని ఊరంతా గోల పెట్టినట్టు క్షోభ పెడితే ఆమెకి పన్నెత్తి మాటాడే అవకాశం లేకపోయింది.
కోడలిని నాలుగేళ్ళ పాటు చూసుకోలేకపోయినా ఆ పై ఆమె కదలి వచ్చే కలిమి తల్లిలా వస్తుందని, తన దైవం రాముడి దయవల్ల తన తనయుడు రామన్న సుఖ పడ్తాడని ఆశించి సరే అందా తల్లి.
సీతామహాలక్ష్మి రాణివాసం వెళ్ళింది. గత నాలుగేళ్ళుగా ఏడాది కోసారి జరిగే రామలీల ఉత్సవాలకు రాజధాని వెళ్ళే సీతామహాలక్ష్మి తండ్రి ద్వారా అక్కడి అయోధ్య విషయాలూ, విశేషాలు, తెలిసేవి కోడలు చెప్పి పంపిన కబుర్లతో ఏటికేడాది గడిపేరిద్దరూ!
ఇప్పుడీసారి రామన్నే వెళ్తూన్నాడయోధ్య!
రామన్న తల్లి ప్రయాణానికి కావలసినవి అన్నీ సర్దేసింది. దారి బత్తెంగా జొన్న రొట్టెలు, ఉల్లికారం, సజ్జ అప్పాలు చేసి పెట్టింది. రామన్న మామ వడిగల గుర్రాన్ని తెప్పించాడు. ఈ దండకారణ్య ప్రాంతం నుండి ఉళ్లు దాటి, ఏళ్ళు దాటి అడవులు దాటి అయోధ్య చేరేందుకైతే మాములుగా పక్షం రోజులు పడుతుంది.
శుద్ధ పంచమి బయలు దేరి వెన్నెల రాత్రుళ్ళు పయనం సాగిస్తే బహుళ పంచమి జ్యోత్స్నకి రాజధానికి చేరుకోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చింది యుద్ద వారువం. తరంగంలా సాగే ఆ తురంగం మూడు పొద్దులు నిండక ముందే అయోధ్య చేరుస్తుంది.
రౌతు గట్టి వాడై కళ్ళాలు బిగించి పట్టగలిగితే పట్టుమని పది లెక్కపెట్టేలోగా అది ఆమడ దూరం వెళ్ళిపోతుంది. ఆ జవనాశం రామన్నకి మచ్చికైంది. అన్నీ అమర్చిందామె.
ఇక బయలుదేరాలి రామన్న, ఆఖర్న ఇచ్చింది రామన్న తల్లి' ఇది చింత చిగురు, దిన్ని తడిగుడ్డ చాటున పొడిగుడ్డ చాటున తడిగుడ్డ, పేర్చి పేర్చి మూట కట్టాను. అందులోనే కాసిన్ని చింతకాయలూ వేశాను. సీతకు చింతాకుపప్పన్నా, చింతకాయ పచ్చడన్నా ఎంతో ఇష్టం. ఇక్కడ ఈ పల్లెల్లో అయితే ఆకులూ, కాయలు తింటాం మనం. అక్కడ అయోధ్యలో ఇవి తింటారో తినరో! పిల్ల వెళ్ళి అయుదేళ్ళు కావస్తోంది. కొత్త రుచి మరిగినా ఈ పాత రుచి మరిచిపోయి ఉండదు. పాతంటే గుర్తు వచ్చింది. కాసింత పాత చింతకాయ పచ్చడి మూటకట్టాను. ఎండు చింతాకు ఎండు మిరపకాయలు కట్టాను.
మిరియాలకారప్పొడి తప్ప ఆ ఉత్తర దేశ వాసులకు చుర్రుమనే మిరపకాయ ఘాటు ఏం తెలుసు? ఎండలకు, ఎండు మిరపకాయలకు మన ఆంధ్రదేశమే ప్రసిద్ధి. నాలిక తుప్పువదిలేలా నాలుగురోజులు తింటుంది నా కోడలు. ఒరే రమన్నా వెళ్ళేటప్పుడు వేగంతో వెళ్ళినా తిరిగొచ్చేప్పుడు తిన్నగా రా! తొందర్లేదు.
తల్లి మాటలకు తలూపాడు రామన్న.
ఇవవలసినవన్ని ఇచ్చి చెప్పవలసిన నాలుగూ చెప్పిందామె. రాముడు పురింటి నుండి బయటికి వచ్చేసరికి సజ్జితాశంతో వచ్చాడు అతని మామ.
గుర్రం రామన్నని చూసి సకిలించింది. గతవారం రోజలు గాదానికి మచ్చికై సారీ చేస్తున్నాడు రామన్న. అధతనికి మచ్చికైంది. గుర్రం వెన్ను తట్టాడు రామన్న. అది మరోసారి సకిలించింది. గుర్రం ఎక్కాడు రామన్న.
అందరి ఆనంద బాష్పాల మధ్యగుర్రం చంగున దూకి వదిలింది. రామన్న కళ్ళెం బిగించి గుర్రం డొక్కలో దొక్కాడు. ఆఘమేఘాల మీద స్వారి ప్రారంభిచింది గుర్రం.
అనుకున్నట్టుగా రెండో నాడు చీకటి పడే వేళకు రాజధాని చేరుకున్నాడు రామన్న. గుర్రం పై వచ్చిన ఆంధ్ర యువకుడిని నగరం పొలిమేరల్లోనే ఆపేశారు భటులు.
కానీ, అతడు తన చహారా తన గ్రామ పుజ్యుడిచ్చిన లేఖ, చూపగానే గుర్రాన్ని గుర్రపుశాలకి పంపించి అతన్ని పరదేశి మందిరానికి పంపారు.
అక్కడ దేశ రాజధానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు, ఉద్యోగులకు, వారివారి యోగ్యతానుసారం వారివారి అభిరుచి మేరకు ఆతిధ్యం లభిస్తుంది.
ఔత్తరాహులు వరి అన్నం లఘువుగా సేకరిస్తారు. దాక్షిణ్యాత్యులు వరి అన్నాన్నే ఎక్కువగా భుజిస్తారు. ఆ తేడా చూసి వారికీ ఆతిధ్యం ఇవబడ్తుంది. దేశ రాజధాని చేరిన వారేవరేవరైనా అసంతృప్తితో తిరిగి వెళ్ళరాదనేది దశరధుడి కాలంలో సుమంత్రుల వారు చేసిన శాసనం. అది అక్షరాల ఆచరణలో ఉంది.
రామన్న విడిదిచేరి, మరీనా వాతావరణంలోనూ అలవాటుగా స్నానం చేసి తిరిగి దుస్తులు ధరించే సరికల్లా అతనికి వర్తమానం అందింది.
సరయూ తిరోద్యానవనంలో వాళ్ళు కలుసుకోవచ్చు.
రామన్న సహజంగానే అందగాడు.