Previous Page Next Page 
పాదాభివందనం పేజి 19

ఆరోజు సాయంకాలం. ఆరుగంటలు నుంచి బాధపడుతున్నాడు, మదన పడుతున్నాడు. 'ఇక లాభం లేదు. ఈ అప్పులు తీరవు! ఒకటా రెండా? పాతిక వేలు? ఈ అప్పు తీర్చటానికి తనకేముంది? ఇల్లావాకిలా? ఆస్తా? ఎట్లా తీర్చాలి అప్పు? ఇక ముందు జీవితం ఎలాగా?

చిన్నారెడ్డి మళ్ళీ పల్లెకి రమ్మన్నాడు. ట్రై చేస్తే ట్రాన్సఫర్ రావచ్చు. కానీ ఏ ముఖం పెట్టుకు వెళ్ళాలి? అక్కడ అందరూ దోషిని చూసినట్టు చూస్తారు. దాన్ని భరించేదెలా?

ఈ బతుకుబాగుపడదు. బ్రాకెట్లో డబ్బు రాదు. అదెప్పుడో తేలిపోయింది. అప్పుడప్పుడు ఆశ కల్పించటానికి వచ్చింది. తను అఆశాకి బందీ అయ్యాడు. నిజంగా డబ్బొచ్చే అంత అదృష్టమే వుంటే ఎప్పుడో వచ్చేది! పేకాటలో డబ్బు అసలే రాదు.

అసలు తనకి అట బాగా వస్తే కదా! వచ్చేదయితే ఎప్పుడో వచ్చేది కాదా! ఏదో వస్తుందనే ఆశతో వేలకి వేలు తగలేశాడు.

కూతుళ్ళ పెళ్ళిల్లెట్లా చెయ్యాలి? కొడుకుల చదువుల మాటేమిటి> తమిద్దరి బ్రతుకు మాటేమిటి?

రోజు యీ వేళ అయ్యేసరికి నంబర్రాయందే మనస్సూరుకోదు. ఆ సమయానికి ఏదో రన్నింగ్--ఎవరో చెప్పిన నంబరు....ఆశ......అది తన దరిద్ర్యమంతా తిరెంత రావాలనే ఆశతో రాయటం. అటునుంచి ఆటే పెకాటకి పొద్దు పోదని ఉరకే మిష.

ఓపెన్ చూసుకునే దాకా పేకాట అంత దాకా క్లబ్బులో పెగ్గు మీద పెగ్గు. ఆ తర్వాత బాటిల్. క్లోజ్ చూసుకునే దాకా తాగుతూ వుండటమే!

ఈ దినచర్యలో మార్పులేదు. రాదు!

తను మారడు. మారలేడు. ఇదింతే! చావొచ్చేదాకా------అసలు పుట్టటం అగేదాకా యింతే!

దీనికి ఒకటే పరిష్కారం.

నిశ్చయించుకున్నాడతను.

హైరోడ్డు వెంట వెడుతున్నాడు చిదంబరం.

ఉళ్ళో వుంటే బుక్కర్, క్లబ్ , బార్ నిలవనివవు. నించోనివవు. అందుకే నిలవకుండా నడుస్తూ పోతున్నాడు గమ్యం లేని పయనం.

ఉహూ.

ఇది గమ్యం లేని పయనం కాదు. దీనికి గమ్యం వుంది.......

అప్పుడు దాదాపు తొమ్మిది గంటలు ఆకాశంలో మబ్బులలో దోబూచు లాడుతున్నాడు చంద్రుడు. ఒకటి అరా నక్షత్రాలు ఓపెన్- క్లోజ్ ల్లాగా అర ఆరగా అలా అలా మెరుస్తున్నాయి.

ఎదురుగా ఏదో లారీ వస్తోంది. తాగిన వాడు తూలుతూ, తూగుతూ, సోలుతూ నడుస్తున్నట్టుగా ఆఘమేఘాల మీద అటూ ఇటూ మళ్ళుతూ వస్తోంది.

ఆ డ్రైవర్ తాగేడేమో!

తాగినవాడి చూపులాగా గుడ్డిగా వెలుగుతున్నాయి హెడ్ లైట్లు. తాగుబోతు శరీరంలో రక్తం తరిగి పోయినట్టు వాటికీ బ్యాటరి తగ్గిపోయిందేమో!

నిర్మానుష్యమైన రోడ్డు.

ఆలోచనలతో భారమైన మనస్సు అస్తవ్యస్తమైన నడక.

మరిమరీ సమీపానికి వస్తోంది లారీ.

"మణి! నన్ను క్షమించు అత్యాశకి వెళ్ళెను. అంత అప్పులు చేశాను. పోగొట్టాను. నీతి తప్పాను. నియమంతప్పాను. అందుకే జీవనబాట నుంచి తప్పుకుంటున్నాను.

నా శరీరంలో రక్తం లేదు. బ్రాంది విస్కిలున్నాయి. ఇప్పుడు నాకు నాటు సారా తాగితే తప్ప నిషా రాదు. నాలో చీము నెత్తురు లేవు, మా నావమానాలు, సిగ్గేగ్గులు పోయాయి. అవి ఆశ చేత చచ్చిపోయాయి. నేను యింకా బ్రతికివున్నందువల్ల మికాన్ని కష్టాలే! తినేందుకు తిండి లేదు. కట్టేందుకు బట్ట లేదు.

అదిగో మయదుత లా లారీ వస్తోంది. నేను దాని నుంచి తప్పుకోను. దాని బారి నుంచి తప్పుకోను. జీవితం నుంచే తప్పుకుంటాను. నేను చనిపోతే మీకు ఇన్సురెన్స్ వస్తుంది. పి.యఫ్. వస్తుంది. గ్రాట్యుటి వస్తుంది. పదివేల డబ్బు వస్తుంది. పెద్దబ్బాయికి ఉద్యోగం వస్తుంది.

మణి! అందరికి నా చావు యాక్సిడెంటు. మన పేదరికం జాలి పుట్టిస్తుంది. బ్రతికినన్నాళ్ళు అప్పుకోసం ప్రాణాలు తీసిన బాకీదార్లు-- నే చనిపోగానే మిమ్మల్ని జాలి తలుస్తారు. దయతో అప్పులు వదిలేస్తారు. అపుడు మీరైనా సుఖపడతారు.

కనీసం మీరైనా సుఖపడండి!

జేవచ్చవంలా బ్రతికి--అందరిలో ఏవగింపబడి---మిమ్మల్ని కష్ట పెట్టేకన్నా చనిపోయి పరోక్షంగా మీకు తోడ్పడి మిమ్మల్ని సుఖపెట్టడం మంచిది కదా? మంచి అనే నేను అనుకుంటున్నాను.

అదిగో లారీ వస్తోంది? హరన్ కొడుతున్నాడు. తప్పుకోమని ? తప్పుకోను. జీవితం నుంచే తప్పుకుంటున్నాను.

గుడ్ బై. చనిపోయి అయినా తన వాళ్ళకి మేలు, తనకు యీ బాధల నుంచి విముక్తి లభించాలని ఆశపడి, ఆ ఆశకి బందీ అయ్యాడు చిదంబరం. కానీ లారీ బ్రేకులు కీచుమంటూ మోగాయి.

రోడ్డుపై అడ్డంగా పడిపోయిన చిదంబరం శరీరానికి అంగుళం దూరంలో ఆగాయి టైర్లు. అతన్ని తిడుతూ, దేశాన్ని , రోడ్లని తిడుతూ లారీ దిగేడు శ్రీధర్.

చిదంబరం హతాశుడయ్యాడు.

                                         చింతాకుపతకం.
అదొక పూరిల్లు!

ఆ ఇంట్లో ఈ పూట కొంచెం హడావుడి కన్పిస్తోంది. లేకపోతే ఎపుడూ.....నిదురించే సెలయేరులాగా, శృతి చేయని వీణలాగా, అమాస రేయి లాగా ఆ ఇల్లు నిశ్శబ్దంతో నిండి వుంటుంది. ఆ ఇంట్లో ఇప్పుడుంటున్నది ఇద్దరే! రామన్న, అతడి తల్లి.

వయస్సు మళ్లే వేళ కొడుకు నిచ్చి, భర్తపై లోకాలకి వెళ్ళిపోయిన రోజే రామన్న తల్లి జీవితంలో అమాస మబ్బులు కమ్ముకున్నాయి.

ఆనాటి నుంచి ఆమెకు కొడుకే లోకం, కొడుకే కైలాసం, వాణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకుని అయన పోతూ పెట్టిన అయోధ్యరామయ్య పేరు నిలపాలని అహర్నిశలు శ్రమించింది. వాడికి వయసొచ్చింది.

వయస్సుతో పాటు బుద్ది, జ్ఞానం కూడా వచ్చాయి. యోగ్యుడు, బుద్ధిమంతుడు, చూడ చక్కని వాడు అయిన రామన్నకి సంబంధమూ వచ్చింది. వేలు విడిచిన మేనమామ పక్క వీధిలోనే ఉంటున్నాడు.

అతడికి నలుగురు కూతుళ్ళు, పెద్దమ్మాయి సీతామహాలక్ష్మి బంగారం పోత పోసినట్టు ఉంటుంది. లంకను జయించి రావణుడిని నిర్జించి సీతాదేవిని వెంట పెట్టుకుని అయోధ్యలో పట్టభిషేకం చేసుకున్నాక ఆ జనాభా దేశంలో అంతటా సీతారాముల పేర్లు సర్వ సామాన్యమయ్యాయి. పళ్ళకు సీతాఫలాలు, రామా ఫలాలు అంటూ పేర్లోచ్చాయి.

 Previous Page Next Page