Home » D kameshwari » Subhodayaam


    ఓ అరగంట తరువాత అన్నపూర్ణమ్మ, అవధానిగారు బయటికి వచ్చారు. బయట కూర్చున్న రాధని చూసి ఆవిడ ఒక్కక్షణం ఆగి ఏదో అనబోయింది.
    "ఊ, పద" అంటూ అవధానిగారు గదమాయించడంతో ఆవిడ ఆయన వెంట వెళ్ళిపోయింది.
    ఒక్కమాట! ఒక్క సానుభూతి వచనం చెప్పివుంటే ఆ క్షణాన రాధకి ఎంతో స్వాంతనగా వుండేది. హు... అసలే జాతి మతంలేని కోడలు- యిప్పుడందులో కుక్కముట్టిన కుండ అయిపోగా- ఎందుకు మాట్లాడుతారు! రాధ విషాదంగా నవ్వుకుని చిన్నపోయిన మొహంతో గదిలోకి వెళ్ళింది.
    ఏదో సంఘర్షణకి లోనయినట్టుగా మాధవ్ అశాంతిగా ఆలోచిస్తున్నాడు. రాధని చూసి "ఎక్కడికి వెళ్ళావు? అమ్మా, నాన్న వస్తే అలా వెళ్ళిపోవడం ఏమిటి?" అన్నాడు కాస్త కోపంగా.
    "వెళ్ళక ఏం చెయ్యమంటారు? నా ఎదురుగానే జాతిలేనిది, కుక్కముట్టిన కుండ అంటూంటే వింటూ సంతోషిస్తూ కూర్చోమంటారా?" గాయపడిన మనసుతో అడిగింది.
    "హు... ఆ కాలంవాళ్ళు, నిష్ఠనియమం కలవాళ్ళు. ఒక్కసారిగా ఎలా మారిపోతారు? వాళ్ళ పరువు ప్రతిష్ట మంటగల్సిందన్న దుఃఖంతో అంటే అంటారు... మనకే యిలా వుంటే... పాతకాలంవాళ్ళకి ఎలా వుంటుంది" మాధవ్ తల్లిదండ్రులని సమర్థిస్తూ అన్నాడు.
    సానుభూతి చూపకపోగా వాళ్ళనే వెనకేసుకొస్తున్న మాధవ్ ని... కొత్త మాధవ్ ని చూస్తున్నట్టు విస్మయంగా చూసింది.
    "మాధవ్... ఏ కాలంకి చెందినవారయినా మీ అమ్మగారు ఓ స్త్రీ... తోటి స్త్రీకి జరిగిన అన్యాయానికి జాలి చూపకపోగా... అలా అంటే... హు... ఆడదానికి ఆడదే శత్రువు అని ఎందుకంటారో అర్థం అయింది. తోటి స్త్రీ చూపలేని సానుభూతి పురుషులు చూపలేదని వారిని దుయ్యబట్టడం అనవసరం" అక్కసుగా అంది రాధ. మాధవ్ మొహం గంటు పెట్టుకున్నాడు.
    "సానుభూతి చూపిస్తే నీవు పోగొట్టుకుంది తిరిగి పొందగలవా?" ఏదో జవాబివ్వాలని అన్నాడుగాని అతనన్నమాటలు అతనికే పేలవంగా కన్పించాయి. రాధకి ఏనాడు మాధవ్ తో ఈనాటివరకు గట్టిగా మాట్లాడే అవసరం రాలేదు. యిద్దరిమధ్య చిలిపికజ్జాలు, అలకలు కూడా ఎన్నడూ రానీయకుండా అతనికనుగుణంగా తనని మార్చుకుంది. అతనన్నదే వేదంగా దేనికి ఎదురాడకుండా, ఎన్నడన్నా విసుగుతో ఏదన్నా అన్నా పట్టించుకోకుండా సామ్యంగా వుండే రాధకి ఆనాడు... తనున్న స్థితిలో మాధవ్ మాటలు, మాధవ్ నిరాదరణ, ప్రవర్తన ఆమెని గాయపరిచింది.
    "కన్నతల్లిలేని నన్ను... ఒక్కసారి దగ్గిరకి తీసుకుని తల నిమిరితే చాలండి... నేను పొందిన అవమానం మరిచిపోయేదాన్ని... ఒక్కమాట కాస్త సామ్యంగా మాట్లాడితే చాలండి... నా వేదన మరిచిపోయేదాన్ని... తోటి స్త్రీనుంచి ఆ మాత్రం ఆశించడం అత్యాశ అంటారా?... ఒక్కమాట... ఒక్కసారన్నా నావంక చూడకుండా ఏ పురుగునో చూసినట్లు చూసి వెళ్ళారండి..." రాధ రుద్ధకంఠంతో అంటుండగా కన్నీళ్ళు జారాయి.
    "బాగుంది. పెళ్ళినాడే వాళ్ళతో తెగతెంపులు అయ్యాయి... ఆనాడే నిన్నంగీకరించని వాళ్ళు, ఈనాడు ఎలా ఆమోదిస్తారనుకున్నావు?" చిరాగ్గా అన్నాడు.
    "అవును... నిజమే... నాది అత్యాశే... క్షమించండి" రాధ యింక వాదన పెంచడం యిష్టంలేక కొంగుతో కన్నీరు వత్తుకుంటూ మాధవ్ కోసం హార్లిక్స్ కలపసాగింది.


                           10


    ఆ రోజు మొదలు రాధ ఎన్నో సందర్భాలలో కన్నీళ్ళు వత్తుకుంటూనే వుంది రోజూ. ఆమె జీవితంలో మాధుర్యం, తీపి, శాంతి అన్ని ఆ సంఘటనతో హరించిపోయాయి.
    మాధవ్ లో మార్పు శారీరకంగా దెబ్బతినడంవల్ల వచ్చింది కాదని, మానసికంగా వచ్చిన మార్పని నెలరోజులలోనే గుర్తించింది రాధ. ఆస్పత్రి నుంచి యింటికి వెళ్ళాక యింకా బలహీనంగా వున్న అతను నెలరోజులు సెలవు పెట్టాడు. రాధ కూడా జరిగిన సంఘటన తను మరిచిపోవడానికే కాక, లోకులు మర్చిపోవడానికి కొంత టైము కావాలని అందరి ఎదుటపడి అందరి చూపులు, అందరి ప్రశ్నలు, సానుభూతి తట్టుకోవడం కష్టం అని రాధ కూడా సెలవు పెట్టింది. రాధ సెలవు పెట్టకముందు మాధవే "కాలేజీకి సెలవు పెట్టు కొన్నాళ్ళు" అన్నాడు గంభీరంగా. రాధ జవాబివ్వకముందే "ఛా! ఈ గోలతో యింక అందరిమొహం యెలా చూడాలో అర్థం కావడంలేదు..." గొణిగాడు.
    రాధ దెబ్బతిన్నట్టు చూసింది. అలాకాక "సెలవు పెట్టు రాధా. నీకు, నాకు శారీరకంగా, మానసికంగా విశ్రాంతి కావాలి" అంటే ఎంతో సంతోషించేది. ప్రతి మాటలో తనదే నేరం అన్నట్టు మాట్లాడుతున్న మాధవ్ ధోరణికి కుమిలిపోసాగింది రాధ.  
    ఆఖరికి యిరవైరోజుల తరువాత వుండబట్టలేక అతని గుండెలమీద తల ఆన్చి "మాధవ్... ఎందుకు... ఎందుకిలా మారిపోతున్నావు.... నేనేం పాపం చేశానని, నా అపరాధం ఏమిటి మాధవ్... యిందులో నా నేరం ఏముందని ఆ రోజునించి నన్నిలా శిక్షిస్తున్నావు" అతన్ని చుట్టేసి బావురుమంది.
    ఆ ఇరవైరోజులుగా మాధవ్ రాధని చేతితో కూడా తాకలేదు. ఇదివరకు అనుక్షణం ప్రతి చిన్నపనికి రాధా రాధా అంటూ పిలిచే మాధవ్ యిప్పుడు రాధంతట రాధ వచ్చి చేసేవరకు పిలవడు. లేదా తనే చేసుకుంటున్నాడు. చెయ్యి విరిగింది కనక స్నానానికి, బట్టలు మార్చుకోవడానికి రాధమీద ఆధారపడక తప్పలేదు. ప్రతిక్షణం వెంట వెంట తిరుగుతూ ఏదో కబుర్లు చెపుతూ నవ్విస్తూ పసిపిల్లాడిలా తిరిగే మాధవ్ యిప్పుడు ఇరవైనాలుగ్గంటలూ పక్కమీదే గడుపుతున్నాడు. పుస్తకం చదువుతూ మధ్యమధ్య అన్యమనస్కంగా అలా గుండెలమీద పుస్తకం పెట్టుకుని నిద్రపోతాడు. ట్రాన్సిష్టర్ పక్కమీద పెట్టుకుని మాట పలుకు లేకుండా అలా వుండిపోతాడు. ఆ యింటి ఆనందమే లోపించింది. నవ్వులే కరువయ్యాయి. రాధ పలరించితే జవాబు చెపుతాడు. ఏదన్నా చెపుతూంటే ఊ కొడ్తూంటాడు. అప్పుడప్పుడు రాధని పట్టిపట్టి చూస్తుంటాడు. ఇంటికెవరన్నా వస్తే అతని ముఖకవళికలు పూర్తిగా మారిపోతాయి. నిస్తేజంగా, నిర్లిప్తంగా వుండిపోయిన అతన్ని చూస్తూ బలహీనంగా వున్నాడని కొన్నాళ్ళు సరిపెట్టుకుంది. శక్తి పుంజుకున్నాకా అతని ధోరణి మారకపోవడం గుర్తించి అతనిలో మార్పుకి కారణం గ్రహించింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra