శశికి, వాసూకి పెళ్ళయి మూడు నెలలయింది. వాసూది సూళ్ళూరు పేట పక్కనున్న పల్లెటూరు మధ్యతరగతి కుటుంబం. నలుగురు అన్న దమ్ములు. ఇల్లరికం రావాలనే షరతుమీద భూపతిరెడ్డి వాసూని అల్లుడుగా చేసుకున్నాడు.
వాసూ మంచివాడు. మామగారి ఇంటవున్నా. అంత ఆస్తిపాస్తులున్నా కష్టపడి పనిచేసే మనస్తత్వం. భూపతిరెడ్డి అల్లుడన్న అహంభావం ఏమీలేదు. దాంతో ఊర్లోని అందరితో ఇట్టే కలిసిపోయాడు.
తొలిసారిగా అతనిమీద ఆరోపణ రావడం.
"ఇంటి దగ్గర పడుకోడా? ఎందుకు?" చంద్రరేఖ అనుమానంగా అడిగింది.
"అదే నాకూ అంతుపట్టడం లేదక్కా. రాత్రయితే చాలు ఆయన మూడ్ మారిపోతుంది ఒక్కసారిగా సీరియస్ అయిపోతాడు. పెందరాళే భోజనంచేసి ఇక కనిపించడు. తిరిగి ఉదయం ప్రత్యక్షమౌతాడు."
మొత్తంమీద ఇలాంటి సమస్యలన్నీ బెడ్ రూంలోనే మొదలవుతాయని చంద్రరేఖకి తెలుసు.
"ఒక్క విషయం అడుగుతాను - నిజం చెప్పాలి" మెల్లగా అడిగింది ఆమె.
అలానే అడగమన్నట్లు తల ఆడించింది శశి.
"మీ దాంపత్యం బావుందా? ముఖ్యంగా పడకటింట్లో?" అని అడిగింది చంద్రరేఖ.
ఆ ప్రశ్న వినగానే ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయింది శశి. కళ్ళనుంచి నీళ్ళు జలజలా రాలాయి.
చంద్రరేఖ బిత్తరపోయింది! శశిని అనునయించడానికి ఆమె చాలా కష్టపడాల్సి వచ్చింది.
"అలా ఏడ్వడంవల్ల సమస్య పరిష్కారం కాదు. మీ ఇద్దరి బాధా చెప్పాలి ఆ తరువాత దానిగురించి ఆలోచిద్దాం" అన్నదామె.
కానీ ఏం చెబుతుంది శశి? ఏదో తెలియని బెరుకు గుండెల్ని అదిమేస్తోంది.
"మీరిద్దరూ సాన్నిహిత్యంగానే వుంటారా?"
అలా ప్రశ్నలడిగి జవాబులు తెలుసుకోవడం తప్ప ప్రస్తుతానికి మరో మార్గంలేదు.
"మొదట్లో బాగానే వుండేవాళ్ళం! ఓ రోజు రాత్రి ఇద్దరి మధ్యా పెద్ద ఘర్షణ జరిగింది. అప్పట్నుంచే మాటల్లేవు....." అని చెప్పింది శశి.
"ఎందుకు కొట్లాడారు?"
"అదంతా పెద్ద కథలే అక్కా. అంతా నా దురదృష్టం" అంది శశి దిగులుగా.
"అదే. ఆ దురదృష్టం ఏమిటో చెప్పు?"
"వాసూకి తొందరెక్కువ. ఇది మొదటిరోజే నేను కనిపెట్టాను భోజనం చేయడం దగ్గర్నుంచి ప్రతిదీ ఎవరో వెనక తరుముకొస్తున్నట్లు చేస్తాడు.
పెళ్ళయిన మొదటిరోజు మధ్యాహ్నం భోజనాలప్పుడు ఆయన పక్కన నన్ను కూర్చోబెట్టారు. ఆయన భుజాలు నాకు తగులుతున్నాయి. అలా తగులుతున్నప్పుడు నా శరీరం మొత్తం గమ్మత్తుగా త్రుళ్ళిపడడం నేను కనిపెట్టాను. ఆయన నా స్పర్శకు ఎంజాయ్ చేస్తున్నట్లు నాకు అనిపించింది.
భోజనాల వడ్డన ప్రారంభమైంది! నా విస్తట్లో అన్ని పదార్ధాలు వడ్డించేలోపే ఆయన తన భోజనం ముగించాడు నేను ఆశ్చర్యపోయాను. "మీ ఆయన స్పీడు నువ్వందుకోవాలి" అని అమ్మలక్కలంతా నన్ను ఆటపట్టించారు.
ఆ రాత్రి శోభనం గదిలోకి అడుగుపెట్టాను! ఆయన ఆప్యాయతతో నన్ను దగ్గరకు తీసుకున్నారు. అంతలో సిగరెట్ గుర్తొచ్చింది కాబోలు నన్ను వదిలిపెట్టి సిగరెట్ వెలిగించుకున్నారు.
సిగరెట్ తాగడానికి ఎలా లేదన్నా అయిదు, పది నిముషాలు పడుతుంది కాబట్టి ఈలోగా రిలాక్స్ అవుదామని నేను బెడ్ మీద కూర్చున్నాను.
అలా కూర్చున్నానో లేదో నా మీద తిరిగి పడిపోయాడు.
"సిగరెట్ తాగలేదా?" అంత త్వరగా సిగరెట్ తాగగలరని నాకు తెలియదు. అందుకే అడిగాను.
"తాగేశాను అదిగో ముక్క" అంటూ గది మూలకు చూపించాడు.
అక్కడ ఎర్రటి అగ్గి మేకరక్తాన్ని పళ్ళెంలో పట్టినట్టు వుంది. ఆయన ప్రవర్తన సహజంగా లేదు. ఏదో ఆత్రుతతో చేస్తున్నట్లుంది.
ఆ తరువాత ఇక ఏమీ మాట్లాడలేదు.
రెండు ముద్దులు, మూడు కౌగిలింతలతో మూడ్ లోకి వచ్చేసినట్టున్నాడు. నా మనసు మాత్రం అప్పటికి రాజుకోవడం ప్రారంభించింది.