Previous Page Next Page 
కలగంటినే చెలీ పేజి 15

    చల్లగా వుంటుందని నాలుకతో తడిపితే పెదవుల వేడికి నాలుకే చురుక్కుమంది. పూలతీగలా వుండే నడుము తుఫానులో చిక్కుకుపోయినట్లు అదురుతోంది. నేను కళ్ళు మూసుకున్నాను.

    కనురెప్పలు కూడా పూర్తిగా మూయలేదు. అప్పుడే ఆయన తన ఆవేశాన్నంతా తీర్చేసుకున్నాడు.

    ఆయన త్వర త్వరగా భోజనం ముగించడం, సిగరెట్ తాగడం గుర్తొచ్చాయి. ఇదీ అలానే ముగించాడు.

    ఆయన ఏమి మాట్లాడకుండా నిద్రలోకి జారిపోయాడు. నాకు మాత్రం కునుకురాలేదు. శరీరం వేడిగా వుంటే చల్లటి నిద్ర ఎలా ఆవహిస్తుంది? రెండో రోజు, మూడో రోజు కూడా అంతే.   

    దీనికి తోడు - నిద్రలో అప్పుడప్పుడూ కలవరించేవాడు. నిద్రలేపి అడిగితే ఏదో పీడకల అనేవాడు. షేవింగ్ చేసుకునేప్పుడు రేజర్ తో పీక కోసుకోవాలనిపిస్తుందట. షేవింగ్ చేసుకుంటున్నంత సేపూ చెమటలుపడుతుంటాయి. అప్పుడు ఆయన్ని చూడాలంటేనే భయంగా వుంటుంది

    నెలరోజుల క్రితం ఆనుకుంటాను - ఆ రాత్రికూడా యథాప్రకారం అరగంట కార్యక్రమాన్ని అయిదు నిమిషాల్లో పూర్తిచేశాడు. ఇంకా ఏదో కావాలని శరీరం తిరగబడుతోంది. రోజూ రాత్రి శరీరాన్ని మేల్కొల్పడం - చివరికి దానికి సుఖం ఇవ్వకపోవడం భరించలేకపోయాను.
   
    "ఛీ ఛీ - నువ్వంటేనే అసహ్యం" అని సీరియస్ గా గదినుండి బయటికి వచ్చేశాను. ఆయన షాక్ తినడం నాకు తెలుస్తూనే వుంది. ఎందుకనో కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాను.

    రెండు రోజులకి తిరిగి మా మధ్య మాటలు ప్రారంభమయ్యాయి,

    ఆ రెండు రోజులూ మేం ఒకరికొకరం మాట్లాడుకోలేదు.
           
    తిరిగి సంధి కుదిరాక ఆ రాత్రి ఆయన పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఎంత ప్రయత్నించినా ఆవేశం రాలేదు. నిస్తేజంగా వుండిపోయాడు.ఎంత ప్రయత్నించినా ఆవేశం రాలేదు. నిస్తేజంగా వుండి పోయాడు.

    ఆయన అవస్థ చూశాక నాకు నవ్వాగింది కాదు. "మీరు మూడు నెలలకే ముసలివారైపోయారు" అని ఆటపట్టించడం ప్రారంభించాను.

    ఆయన ఉడుక్కున్నారు.

    అన్ని రోజులు ఆయన నన్ను ఇబ్బంది పెట్టింనందుకు నా కసి తీరుతున్నట్లు అనిపించసాగింది.

    అందుకే ఆయన్ను కించపరుస్తూ మరింత ఉడికించాను.

    "మీరు ముసలివాళ్ళయిపోతుంటే నేనేమో రోజురోజుకి చిన్న దాన్నై పోతున్నాను" అని ఆ రాత్రంతా ఏడిపించాను.

    ఏమైందో ఏమో తెలీదుగానీ, రెండో రోజు రాత్రి నా దగ్గరికి రాలేదు. వరండాలో ఒంటరిగా పడుకున్నాడు.

    ఎంత పిలిచినా గదిలోకి రాలేదు.

    వరండాలో పడుకుంటే నేను లోపలికి రమ్మనమని విసిగిస్తానని కాబోలు మరుసటి రోజు రాత్రినుంచి పూర్తిగా కనపడడం కూడా మానేశాడు.

    పగలు ఇంట్లో వున్నా తప్పించుకు తిరిగేవాడు. అందుకే కాబోలు అంతకుముందు ఉదయం, సాయంకాలమే పొలంవెళ్ళే ఆయన అప్పటి నుంచీ ఎక్కువకాలం పొలంలోనే గడుపుతున్నాడు.
 
    సాయంకాలం అలా ఇంటికొచ్చి భోజనం చేసి, ఎక్కడెక్కడో పడుకుంటున్నాడు. ఓరోజు బడిదగ్గర, ఇంకోరోజు శివాలయం దగ్గర, మరోరోజు గంగమ్మ గుడి వెనకాల -ఇలా ఇంటిదగ్గిర తప్ప మిగిలిన చోట్ల నిద్రపోతున్నాడు.

    ఉదయం నిద్రలేచి ఇంటికొచ్చి ముఖం కడుక్కుని పొలంకెళ్ళి పోతున్నాడు. ఇంట్లోవున్న ఆ కాసేపు కూడా నోరు పూర్తిగా తెరిచి మాట్లాడడు. ఏదో గొణిగినట్లు రెండు మూడు మాటలు -అంతే" అంటూ ముగించింది శశి.

    విషయం సగం అర్ధమైపోయినట్లనిపించింది చంద్రరేఖకి. వాసూ రాత్రిళ్ళు ఎందుకు తనింట్లో పడుకోవడం లేదో రేఖామాత్రంగా తెలుస్తోంది.

    అతనికి వస్తున్న పీడకలలేమిటి?

    రేజర్ తో పీక కోసుకోవాలని ఎందుకు అనిపిస్తోంది? ప్రతిపనీ ఎందుకంత అర్జెంట్ గా చేస్తున్నాడు?

    వీటన్నిటికి జవాబులు తెలియాలంటే వాసూనే చెప్పాలి. కానీ వాసూ అంత సులభంగా చెబుతాడా?

    మరి శశి పరిస్థితి ఏమిటి?

    ఆమె మానసికంగా బాగాలేనట్టు అర్ధమవుతోంది. మేలిమి బంగారం లాంటి పిల్ల - చివరికి ఏం కాబోతోంది?
   
    వీటన్నిటినీ పరిష్కరించి వాళ్ళ కాపురాన్ని తిరిగి ఎలా నిలబెట్టటం?

    చంద్రరేఖ ఆమె గురించి ఆలోచనలతో సతమతమౌతోంది?
 

 Previous Page Next Page