"నన్ను నగ్నంగా, అతి దగ్గరగా చూశాక, మీకేమనిపించలేదా?" చనువుగా అడిగిందామె.
రెండు నిమిషాల తర్వాత మెల్లగా పెదవి విప్పాడతను.
"కోరిక రాజుకుంది...." ఏ మాత్రం బిడియపడకుండా చెప్పాడు.
"మరెందుకు వెంటనే చెప్పలేదు...." ఆ ప్రశ్నకు జవాబు ఎలా చెప్పాలో అర్థంకాలేదు మైత్రేయకి.
"ఇటీవలి కాలంలో ఆడవాళ్ళలో వస్తున్నా మానసికమయిన మార్పు మగవాళ్ళలో రావడం లేదేమోనని నా అనుమానం.... నీకు దాహం వేస్తే మంచినీళ్ళు కావాలని అడగవా? ఆకలి వేస్తే అన్నం తినాలనిపించదా? మంచి గాలి, వెల్తురు లాగానే మంచి సెక్స్ మనసుకి మంచిది. మనసుకే కాదు శారీరక ఆరోగ్యానికి కూడా మంచిది. శరీర భౌతిక ధర్మాన్ని, అవసరాల్ని అణుచుకోవటం, కొత్త అనారోగ్యానికి హేతువవుతుంది. శరీర నిర్మాణములో హార్మోన్ల ఉత్పత్తి అనేది మానవ నియంత్రితం కాదు. బిడియం, సంకోచాలు కొన్ని విషయాల్లో పనికిరావు మిష్టర్ మైత్రేయ...." నవ్వుతూ చెప్పింది మోహిత. మైత్రేయవేపు చూస్తూ రెండు నిమిషాలసేపు నవ్వుతూ వుండిపోయిందామె. ఆ నవ్వు పువ్వు విరినట్టుగా వుంది. వెన్నెల రువ్వినట్టుగా వుంది.
"నన్ను నువ్వు కోరుకుంటున్నావు కదూ.... నిజం చెప్పు" సూటిగా అతని కళ్ళవేపు చూస్తూ అడిగిందామె.
"అవును! నిజంగా....."మిలమిల్లాడుతున్న ఆమె కనురెప్పల వైపు చూస్తూ అన్నాడతను.
"మగవాడు కోరికలోంచి స్త్రీని చూస్తాడు. స్త్రీ ఆరాధనలోంచి కోరికను చూస్తుంది...." చెప్పి బాటిల్ నీ, గ్లాసుల్నీ పక్కన పెట్టేసి డైనింగ్ టేబుల్ వైపు నడిచింది.
పావుగంట తర్వాత డిన్నర్ పూర్తయింది.
గుడ్ నైట్ చెప్పి తన బెడ్ రూమ్ లోకెళ్ళి డోర్ గడియ పెట్టుకుంది. మోహిత ప్రవర్తన చాలా వింతగా అనిపించింది. మైత్రేయకి. ఒక్కొక్కప్పుడామె ఎన్నెన్నో రంగుల కిరణంలా కనిపిస్తే, మరొక సమయంలో ఎంతో అమాయకత్వం ఉట్టిపడే పసిపిల్లలా కనిపిస్తోంది.
చాలాసేపు నిద్రపట్టలేదు మైత్రేయకి.
* * *
మైసూర్ వెళ్ళిన వెంకటయ్య రాకకోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు తల్లీకూతుళ్ళు.
ఏ సమయంలోనైనా తండ్రి రావచ్చు..... మెయిన్ గేట్ వైపు చూస్తూ వరండాలో పచార్లు చేస్తోంది ఇందు.
అక్కడ బావ పరిస్థితి ఎలా వుందో! పోలీసులనుంచి విడిపించుకుని బావతో పాటు వస్తాడా? లేదా తండ్రొ వస్తాడా! తన బతుకేమవుతుంది? మనసులో ఎన్నెన్నో ఆలోచనలతో సతమతమవుతోంది ఇందుమతి.
సరిగ్గా అదే సమయంలో వెంకటయ్య సూట్ కేస్ తో ఇంట్లోకొచ్చాడు. కుర్చీలో కూలబడిపోయాడు నిస్త్రాణంగా.
కాఫీగ్లాసు పట్టుకెళ్ళి, ఆయన చేతికి అందించి, ఆయన ముఖంలోకి చూస్తూ, కొంచెం దూరంలో వున్న స్తంభానికి అనుకుని కూర్చుని-
"మైత్రేయ విషయం ఏమయిందండీ.....?" అడిగింది సావిత్రమ్మ.
మధ్యగదిలో ద్వారబంధానికి అనుకుని నిల్చుని, తండ్రి నోట్లోంచి వచ్చే మాటలకోసం ఎదురుచూస్తోంది ఇందు.
"మైత్రేయని కలిశారా?" మళ్లీ అడిగింది సావిత్రమ్మ.
"లేదు.... కలవలేదు" అనిచెప్పి మైసూర్లో సర్కిల్ ఇన్ స్పెక్టర్ చంద్రప్ప ద్వారా తెలుసుకున్న వివరాలన్నీ చెప్పి నిట్టూర్చాడు వెంకటయ్య.
"అయితే బావ ఇప్పుడెక్కడ....?" అడిగింది ఇందు.
రాబోతున్న దుఃఖాన్ని ఆపుకుంటూ.
"పరారీలో వున్నాడు" వెంటనే చెప్పాడతను.
"మర్డర్ స్పాట్ లో మీవాడు దొరికిన మాట నిజమే.... స్టేషన్ తీసుకు రావడం నిజమే..... మీవాడు స్టేషన్నుంచి పారిపోయాడు..... అంతవరకు మాత్రమే నాకు తెల్సు....." చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు వెంకటయ్య.
"వీటన్నింటికీ కారణం ఎవరో అమ్మాయని విన్నాను. ఆ అమ్మాయెవరో ఎక్కడుంటుందో తెలుసా?" అడిగాడు వెంకటయ్య.
"తెలీదు! దర్యాప్తు చేస్తున్నాం."
"మరి మా మైత్రేయ....."
"అతని గురించి కూడా దర్యాప్తు చేస్తున్నాం" చంద్రప్ప మాటల్లో ఒకదాని కొకటి పొంతన కనిపించలేదు వెంకటయ్యకి.
వెంకటయ్య ఆ అమ్మాయి గురించి వేసిన ఏ ప్రశ్నకూ సరైన జవాబు చెప్పలేకపోయాడు చంద్రప్ప.
"వాళ్ళిద్దరిమధ్యా ఏదో మిస్టరీ రిలేషన్ వుందండి. అంతకంటే నేనేం చెప్పలేను. మీరు మళ్ళీ కాంటాక్ట్ చేయండి. ఏ విషయం తెల్సినా మీకు చెప్తాను....." వచ్చేసేముందు చంద్రప్ప చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయతనికి.
ఇన్ స్పెక్టర్ చెప్పిన దాని ప్రకారం ఆ అమ్మాయితో మైత్రేయకి మిస్టరీ రిలేషన్ వుందనుకుంటే, ఆ మిస్టరీ రిలేషన్ ఎలాంటిదై వుంటుంది? అక్రమ సంబంధమా?
అందుకే పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడా? ఆ అమ్మాయి వలలో పడిపోయాడా.... ఎక్కడో రహస్యంగా యిద్దరూ గడుపుతున్నారా?
వాడి భవిష్యత్తుమీద తను ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అందుకే కష్టపడి చదివించాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఏం చెయ్యాలో తోచడం లేదు వెంకటయ్యకి. కూతురుకి వేరే సంబంధం చూడాలా? అంతవరకూ వచ్చిన ఆలోచనలు కూతురు పెళ్ళి పెళ్ళి దగ్గరకి వచ్చేసరికి ఆగిపోయాయి.
ఇంకో పక్క ఇందు పరిస్థితికూడా అలాగే వుంది.
"బావతో తన పెళ్ళి కాదా.... బావ ప్రస్తుతం ఇరుక్కున్న సమస్యల్లోంచి బయటకు రాడా? మరి కనిపించడా? తను ఇంకో కుర్రాడిని చేసుకోవలసి వస్తుందా?" రకరకాల ఆలోచనతో పిచ్చిదైపోతుంది ఇందు.
తలగడలో ముఖం దాచుకుని ఏడ్వటం తప్ప, ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో ఇందుకు తోచడంలేదు.
* * *
మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం-
మోహిత, మైత్రేయ ఇద్దరూ దట్టమయిన చెట్లమధ్యనుంచి నడుస్తున్నారు. విశాలమయిన భూర్జవృక్షాల ఆకుల మధ్యనుంచి పడుతున్న ఎండ, పాలిపోయిన వెన్నెల్లా వుంది.
"నాతో నువ్వు ఎన్నాళ్ళుండగలవ్..... మైత్రేయ...." అడిగింది మోహిత. పసుపురంగు బెంగాలీకాటన్ చీర. మ్యాచింగ్ జాకెట్టు, జడ వేసుకోకుండా వదిలేసిన జుట్టు గాలికి ఎగురుతూ, ఆమె ముఖంమీద పడుతున్నప్పుడు ఆ ముఖం అందంగా కన్పిస్తోంది.
"వారం రోజులని" ఏదో చెప్పబోయాడు మైత్రేయ.
"నన్ను చూశాక నాతో ఎక్కువ సమయయం గడపాలని నీకనిపించడం లేదా?" పక్కకు తిరిగి అతని ముఖంలోకి చూస్తూ అడిగిందామె.
"ఎక్కువ సమయం అంటే...." ప్రశ్నించాడతను.
"కొన్ని నెలలు..." అందామె.
"ఇప్పటికే మా ఆఫీసువాళ్లు..... నేనేమయిపోయానోనని పేపర్లో కనిపించడంలేదని ఎడ్వర్టేజ్ మెంట్ ఇచ్చేస్తారని భయంగా వుంది" చిన్నగా నవ్వుతూ అన్నాడు.
"ఆ ఉద్యోగం మానెయ్! ఆ డబ్బు నేనిస్తాను" ఆ మాటకు ఆమెముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడతను.
"ఇక్కడే కొన్నినెలలు నేనుంటే.... నేనో ట్రైబల్ ని అయిపోతానేమో...." అన్నాడు చిన్నగా నవ్వుతూ.
"మనం ఇక్కడ వుండేది మరికొద్దిరోజులు మాత్రమే. మనం చేయాల్సిన పనులు చాలా వున్నాయి" అంటూ ఏటవాలుగా వున్న గుట్ట ఎక్కుతోందామె.
"అంటే....." అతని ప్రశ్నకు జవాబు చెప్పలేదామె.
భయంకరమయిన గతాన్ని మర్చిపోయి తనతో హాయిగా, నవ్వుతూ ఎలా ప్రవర్తించగలుగుతోంది! ఆమె నవ్వు, మాటలు అన్నీ నటనేనా? తన ద్వారా మోహిత ఆశిస్తున్న దేమిటి? కొన్ని నెలలు ఆమెతో వుంటే ఏం జరుగుతుంది? అన్నీ జవాబులేని ప్రశ్నలే.
జలపాతానికి కొంచెం దూరంలో వున్న కొండమీదున్నారు.
"అదొక గిరిజన గ్రామం.... ఆ గ్రామం పేరు చాల విచిత్రంగా వుంటుంది తెలుసా?" అడిగిందామె.
"మోపుల గూడెం."
"చాలా చిత్రమయిన పేరు" అంటూ ఆ గ్రామంవేపు చూశాడు మైత్రేయ.
ఏడు గుడిసెపు. ఒక చిన్నగుడి. గడ్డిమోపులు. కొన్ని గొర్రెలు మాత్రమే వున్నాయి. మనుషుల అలికిడి ఎక్కడా లేదు. "మనుషుల్లేరేమిటి?"
"ఈ టైంలో వాళ్ళు పోడు వ్యవసాయం చెయ్యడానికి కొండల్లోకి వెళతారు" చెప్పిందామె.
కొండ దిగి చిన్న లోయలాంటి మార్గంలో నడుస్తున్నారిద్దరూ.
"మైత్రేయ.... నీకిప్పుడు కొన్ని దృశ్యాలు చూపిస్తాను. ఆ దృశ్యాలు చూశాక, నీ ఫీలింగ్స్ నాకు చెప్పు" అంది మోహిత.
ఏ దృశ్యాలు చూపిస్తుంది మోహిత? ఏదో ఆసక్తి చోటుచేసుకుంది అతనిలో.
"నీకు తెలియని ఒక విషయం చెప్తాను విను. గిరుజన దంపతులు రాత్రిపూట ఇళ్ళల్లో పడుకున్నప్పుడు సెక్స్ పరంగా కల్సుకోటానికి ఇష్టపడరు. తెలుసా...." చాలా మందికి తెలీని నిజాన్ని చెప్పిందామె.
"మరి.....! ఎప్పుడు కల్సుకుంటారు?" ప్రశ్నించాడతను.
"పోడు వ్యవసాయం కోసం, పశువుల్ని మేపడం కోసం, కర్రలు కొట్టడం కోసం అడవుల్లోకి వెళ్ళినప్పుడు మిట్టమధ్యాహ్నం సమయం, అంటే ఇలాంటి సమయంలో వాళ్ళు ఒకరికొకరు దగ్గరౌతారు. ఆ సమయాల్లో వాళ్ళ ప్రవర్తన గమ్మత్తుగా వుంటుంది" అందామె.
"అర్థంకాలేదు."
"చూస్తే నీకే తెలుస్తుంది..... రా" ముందుకు తీసికెళ్లింది. వరుసగా నల్లటి మట్టిదిబ్బలు. గుబురయిన చెట్లు, ఆ చెట్ల మధ్య పెద్ద చెరువు. మూడువేపులా దట్టమయిన వెదురు. ఆ పొదల వెనక్కి మైత్రేయని తీసికెళ్ళి ఆ పొదల్ని పక్కకి తప్పించి.... "నువ్వు తీరుబడిగా చూడు.... నేను పదినిముషాల్లో వస్తాను" అంటూ వెనక్కి వెళ్ళిపోయింది మోహిత.
తనకు అలాంటి దృశ్యాల్ని చూపించడం వెనక ఆసలు కారణం ఏమిటి? అనే విషయం ఆలోచించడం లేదు అతను. ఆసక్తిగా ఆ పొదల మధ్యనుంచి కన్పిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాడతను.
* * *
ఇద్దరు గిరిజన దంపతులు. ఇద్దరూ నగ్నంగా చెరువులో స్నానం చేస్తున్నారు. పాతికేళ్ళలోపు వయసు.
ఆ గిరిజన యువతి మెడలో వేసుకున్న పూసల మధ్యనుంచి కన్పిస్తున్న ఆమె గుండెలు.