" మీ మానసిక పరిస్థితిని నేను ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను. నాలో అశాంతి తగ్గడానికి, మానసికమయిన స్వేచ్ఛకు, సంతృప్తికి ఇదే తగిన ప్రదేశమని నేను అనుకుంటున్నాను" మళ్ళీ అందామె.
"మానసికమయిన స్వేచ్ఛ అంటే...."
"మీరు ఫెమినిజం అనండి.... ఆర్ధిక స్వాతంత్ర్యం అనండి..... నేటి తరం స్త్రీ మానసికమయిన స్వేచ్ఛతోపాటు, శారీరకమయిన స్వేచ్ఛను కూడా కోరుకుంటోంది. శారీరకమయిన స్వేచ్ఛ అంటే, నచ్చిన ప్రతి మగాడితో వెళ్ళిపోవడం కాదు..... వంటరిగా బతికే ఆడదానిపై చులకన భావం ఏర్పడడం, లైంగిక విశృంఖలతకు సంబంధించిన అనుమానాలు, అవమానాలు ఎక్కువై పోయాయి. అది పురుషుల అవగాహనా రాహిత్యం అని నేనంటాను.... ఏమంటారు?"
"నిజమే...." ఒప్పుకోక తప్పలేదు మైత్రేయకి.
ఇద్దరిమధ్యా కాసేపు నిశ్శబ్దం..... సిగరెట్ తీసి వెలిగించాడు మైత్రేయ.
"చెప్పండి..... రాజేంద్ర కుమార్ మీకేమవుతారు..... రవీంద్రనాథ్ మీకెలా శత్రువయ్యాడు? రవీంద్రనాథ్ మీకెలా శత్రువయ్యాడు? రవీంద్రనాథ్ ని మీరేనా చంపారు?" ఉద్రేకాన్ని తగ్గించు కోవడానికి ప్రయత్నిస్తూ అడిగాడు మైత్రేయ.
గ్లాసులోని డ్రింక్ ను గడగడా తాగేసి, రెండో పెగ్ ను నింపుకుంది మోహిత.
చెప్పడం ప్రారంభించిందామె-
"నేను జీవితంలో దారుణంగా మోసపోయాను మైత్రేయా! ఎంత దారుణంగా అంటే జీవితంలో ఏ కన్నెపిల్లా మోసపోనంతగా. ఒక ఆడపిల్ల స్త్రీత్వం, ఆమెకు తెలీకుండా దారుణంగా నరరూప రాక్షసులకు బలైపోవడం మీరెప్పుడైనా విన్నారా...?" ఆమె గొంతులో ఉద్వేగం చోటుచేసుకుంది.
"మాది ఇబ్రహీంపట్నం. ఇంటికి రెండోదానిని. మా అక్కకు పెళ్ళయింది. మా డాడీ మున్సిపల్ ఆఫీసులో క్లర్కు. నాకెన్నో పెళ్ళిచూపులు జరిగాయి. నా అందాన్ని, నన్ను అందరూ మెచ్చుకున్నా, కట్నం విషయంలో మా డాడీ, నిస్సహాయుడవడం వల్ల నాకు చాలాకాలం పెళ్ళి కాలేదు.
ఆ సమయంలో ఒక వ్యక్తి, నన్ను పెళ్ళిచేసుకోవడానికి ముందుకు వచ్చాడు. ఆ వ్యక్తి రాజేంద్రకుమార్. అప్పటికే అతని భార్య చనిపోయింది. రెండో పెళ్ళివాడని తెలిసినప్పటికీ, తల్లిదండ్రుల్ని బాధపెట్టడం ఇష్టంలేక ఆ పెళ్ళి చేసుకున్నాను.
ఆ పెళ్ళి తిరుపతిలో జరిగింది. కర్నాటక ముదుమలై అడవుల్లో అతనో పెద్ద ఫారెస్ట్ కంట్రాక్టర్. మంచి పొలిటికల్ లింక్స్ వున్న మనిషి. ఆ పెళ్ళికి అతితక్కువమంది రావడం, అప్పట్లోనే నేను సందేహించాను. కొన్నాళ్ళు మైసూర్ లో వుంచాడు. ఆ తరువాత ఈ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కు తీసుకొచ్చాడు నన్నెప్పుడూ మాండ్యాలోని స్వంత ఇంటికి తీసుకెళ్ళలేదు.
నన్ను తన పిల్లలకు గానీ, ఇతర బంధువులకు గానీ పరిచయం చెయ్యలేదు. అయినా నాకు సందేహం రాలేదు. దానిక్కారణం నడివయసులో నన్ను పెళ్ళి చేసుకోవడమేనని నేననుకున్నాను.
అప్పుడప్పుడు-
ఈ గెస్ట్ హౌస్ లో డ్రింక్ పార్టీలు జరుగుతుండేవి. నేను లేనప్పుడు ఇక్కడికి రకరకాల వ్యక్తులు, అమ్మాయిలు కూడా వచ్చేవారట.
ఆ మందుపార్టీలకు నలుగురు వ్యక్తులు ముఖ్యంగా హాజరవుతుండేవారు. ఆ నలుగురు వ్యక్తులూ రాజేంద్రకుమార్ బిజినెస్ కి బాగా ఉపయోగపడే వ్యక్తులు.
అందులో మొదటివ్యక్తి ఎమ్మెల్యే రవీంద్రనాథ్, రెండో వ్యక్తి అప్పట్లో ఇక్కడ ఎస్పీగా పనిచేసిన మహేంద్ర, మూడోవ్యక్తి ఫారెస్ట్ ఆఫీసర్ జయంత్, నాలుగో వ్యక్తి లాయర్ ఆదిత్య!" చెప్పడం ఆపింది మోహిత.
మూడో పెగ్గు వేసుకుంది.
ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు. ఆమె గొంతు బొంగురుపోయింది.
"ఒకరోజు రవీంద్రనాథ్, రాజేంద్రకుమార్ కల్సి తాగుతున్నారు. వాళ్లమాటలు, జోకులు అన్నీ వింటూ బెడ్ రూమ్ లో కూర్చున్నాను. నేను యధాప్రకారం డిన్నర్ పూర్తి చేసి పడుకున్నాను. ఉదయం ఎనిమిది గంటలకు మెలుకువ వచ్చింది. లేవలేకపోయాను. వళ్ళంతా నొప్పులు. రాత్రి నన్ను ఎవరో అనుభవించారని తెలియడానికి నాకెంతోసేపు పట్టలేదు.
రవీంద్రనాథ్ ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలీదు.
నేను డ్రాయింగ్ రూమ్ లో కెళ్ళాను.
రాజేంద్రకుమార్ పేపర్ చదువుకుంటున్నాడు.
"ఏమిటి! రాత్రి అంత మొద్దులా నిద్రపోయావు.....?" నవ్వుతూ అన్నాడు.
"ఏం జరిగింది?"
"బాగా తాగాను కదా.... నువ్వు నిద్రపోతున్నా, నీతో గడిపాను. ఆడదాని అంగీకారం లేకపోతే, ఆమెతో గడపకూడదని నాకు తెలుసు..... కానీ నిగ్రహించుకోలేకపోయాను" ఏమాత్రం ఫీలింగ్ లేకుండా అన్నాడతను.
నేనెందుకో అతని మాటల్ని నమ్మలేకపోయాను.
మనసులో ఏదో అనుమానం.
మరో నెలరోజులకు ఇంకో సంఘటన జరిగింది..
ఆ రోజు రాత్రి ఎస్.పి. మహేంద్ర, రాజేంద్రకుమార్ కలిసి తాగుతున్నారు.
రాత్రి ఒంటిగంటవరకూ రాజేంద్రకుమార్ కోసం ఎదురుచూసి డిన్నర్ చేసి పడుకున్నాను.
ఉదయం తొమ్మిది గంటలకు మెలకువ వచ్చింది.
నా శరీరంలో ఏదో బాధ..... ఎవరో రాత్రి నా శరీరావయవాలతో పైశాచికంగా ప్రవర్తించినట్టు బాధ. నెలరోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది.
నాకేమీ అర్థంకాలేదు.
"రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు నాతో గడిపారా?' సీరియస్ గా ప్రశ్నించాను రాజేంద్రని.
"లేదే.... ఇక్కడ పార్టీ అయిపోయాక నేనూ, మహేంద్ర వెళ్ళిపోయాం. నేను బర్గూర్ నుంచి ఇప్పుడే వచ్చాను అని చెప్పాడు. అతని మాటలు నమ్మశక్యం కాలేదు.
నాకు తెలీకుండా ఎక్కడో, ఏదో గూడుపుఠాణీ జరుగుతోంది. నేను ఎవరిచేతనో దోచుకోబడుతున్నాను. నా స్త్రీత్వం దారుణంగా నాశనమవు తోందన్న భావన నాలో రోజు రోజుకూ పెరగజొచ్చింది.
ఇంకో రెండు నెలల తర్వాత ఇంట్లో ఫారెస్ట్ ఆఫీసర్ జయంత్ తో పార్టీ. మర్నాడు ఉదయం మళ్ళీ అదే అనుభవం నాకు పునరావృతమయింది.
ఆరోజు మధ్యాహ్నం బిజినెస్ పనిమీద రాజేంద్రకుమార్ హైదరాబాద్ వెళ్లాడు.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మైసూర్ వచ్చి నాకు తెల్సిన లేడీ డాక్టర్ని కలిశాను. ఆవిడ నాకు టెస్టులన్నీ చేశాక-
"నువ్వు తరచూ రేప్ కు గురవుతున్నావ్..... ఆ విషయం నీకు తెలుసా?" అయోమయంగా తలూపాను. నా ఊహ నిజమయింది.
"నీ అంగీకారం లేకుండా నీ భర్త నీతో గడుపుతున్నాడా.... అతను శాడిస్టా?" మరికొన్ని ప్రశ్నలు వేసింది డాక్టర్.
జరిగిందంతా ఆమెతో చెప్పాను.
విస్తుపోయిందామె. ఆవిడ నాకు కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పింది.
మరో నెలరోజుల తర్వాత-
లాయర్ ఆదిత్యతో పార్టీ. రాజేంద్రకుమార్, ఆయన కల్సి రెండు ఫుల్ బాటిల్స్ తాగారు.
డాక్టర్ చెప్పిన సలహా ప్రకారం ఆ రోజు ఇంట్లో కాఫీ, టీ, కూల్ డ్రింక్, టిఫిన్, భోజనం ఏమీ చేయలేదు.
రాత్రి ఒంటిగంటవరకూ మేల్కొన్నాను.
సరిగ్గా మరో అరగంట తర్వాత-
రాజేంద్రకుమార్ నా దగ్గరకొచ్చి నిద్ర నటిస్తున్న నావేపు చూసి -
"ఆదిత్యాజీ.... మై స్వీట్ వైఫ్. ఇంకో అయిదారు గంటలసేపు స్పృహలో వుండదు. మీ ఇష్టం..... మనసారా అనుభవించండి. ఈ విషయం దానికి మాత్రం తెలియకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పానుగా? ఫారెస్టు గెస్ట్ హౌస్ లో మీకోసం ఎదురు చూస్తుంటాను...." చెప్పి రాజేంద్రకుమార్ వెళ్ళిపోయాడు.
లాయర్ ఆదిత్య బెడ్ రూమ్ లోకొచ్చాడు. అప్పటికి అతను బాగా తాగి వున్నాడు. నా వంటిమీద చెయ్యివేయగానే, నేనొక్కసారి కళ్ళిప్పి లేచి నిలబడే సరికి, నావేపు దెయ్యంని చూసినట్టుగా చూసి గడగడ వణికిపోయాడు.
రాజేంద్రకుమార్ అసలు స్వరూపం గురించి అతనే భయంతో నాకు చెప్పాడు.
తన బిజినెస్ కోసం, అఫీషియల్ లెవెల్లో కొన్ని పనులు జరగడం కోసం మాత్రమే రాజేంద్రకుమార్ నన్ను పెళ్ళి చేసుకున్నాడట. తనకు అవసరమయిన అధికార్లను ఇంటికి పిలవడం, పార్టీలివ్వడం, అదే సమయంలో నేను తీసుకునే డ్రింక్ లో గానీ, భోజనంలోగానీ మత్తుమందు కలపడం, నేను నిద్రపోయాక వాళ్ళని నా బెడ్ రూంలోకి పంపి, తను బర్గూర్ వెళ్ళిపోవడం..... వీళ్ళు నన్ను అనుభవించి వెళ్ళిపోవడం కొన్ని నెలలుగా జరుగుతున్న కథ ఇది... లాయర్ ఆదిత్యతో పాటు మిగతా ముగ్గురు కూడా నన్ను చాలాసార్లు అనుభవించారట...." వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది మోహిత.
తను సెక్సిని అని భావించిన ఈ మోహిత వెనక ఇంత దారుణమైన కథ వుందా..... ఆలోచిస్తున్నాడు మైత్రేయ.
అయిదు నిమిషాలసేపు నిశ్శబ్దం....
"మీకంతా తెల్సిపోయిన విషయం రాజేంద్రకుమార్ కు తెలుసా?" ప్రశ్నించాడు మైత్రే.
"తెలీదు..... తను చెప్పేసిన విషయాలు రాజేంద్రకుమార్ కి చెప్పొద్దని ఆదిత్య ప్రాధేయపడ్డాడు" చెప్పి మోహిత లేచి అన్ని రూమ్స్ లో లైట్స్ ఆర్పేసి "రండి.... బెడ్ రూంలో కూర్చుందాం" అంది గ్లాసునీ, బాటిల్ ని పట్టుకుని.
ఆమె వెనక బెడ్ రూమ్ లోకి నడిచాడు మైత్రేయ.
* * *
బెడ్ రూమ్ విశాలంగా, నీట్ గా వుంది.
డబుల్ కాట్ బెడ్, ఒక టీపాయ్, ఒక మూల అల్మారాలో బుక్స్, రెండు ఛెయిర్స్.
ఒక ఛెయిర్ లో కూర్చూంటూ అడిగాడు మైత్రేయ.
"మీకు బుక్స్ అంటే ఇష్టమా?"
"అవును..... బుక్స్ నాకు మగవాళ్ళలా కన్పిస్తాయి. అందుకే ఇష్టం" ఆ స్టేట్ మెంట్ కి ఆశ్చర్యపోయాడతను.
ట్యూబ్ లైట్ వెలుగులో కర్పూరపు బొమ్మలా మెరిసిపోతోంది మోహిత.
జరిగిన దారుణం నుంచి ఉపశమనం పొందడం కోసమేనా, తనకో బాయ్ ఫ్రెండ్ కావాలని పేపర్లో ప్రకటన యిచ్చింది.
తనిక్కడ ఎన్నాళ్ళుండాలి? డ్రింక్ సిప్ చేస్తూ ఆలోచిస్తున్నాడు మైత్రేయ.
"ఏమిటి ఆలోచిస్తున్నావు..... నా ఫ్లాష్ బ్యాక్ విన్నాక నేనంటే నీకు గౌరవం పోయిందా?" స్త్రీ సహజమయిన అనుమానంతో అడిగిందామె.
"లేదు.... జాలి వేస్తోంది" అన్నాడతను.
"నా మీదెవరూ జాలిపడడం నాకిష్టం లేదు" అంటూ టాపిక్ మార్చేసిందామె.
జాలి అన్న పదం వాడినందుకు ఒక్కక్షణం బాధపడ్డాడు మైత్రేయ.
"ఇప్పటివరకూ ఏ స్త్రీ సుఖం నువ్వు ఎరగవంటే నాకు ఆశ్చర్యంగా వుంది" అందామె.
"నన్ను ఇష్టపడేవాళ్లున్నా.... ఏదో సంకోచం..." తాగుడు నిషా నెమ్మదిగా అతనిలో పనిచేస్తోంది. పెళ్ళికి ముందు ఇతరులతో శృంగారం, పెళ్ళి తర్వాత ఇతర స్త్రీలతో సెక్స్ అంటే నాకిష్టం వుండదని సగటు మగాడిలా, ఆత్మవంచన చేసుకోనందుకు అప్పటివరకూ అతనిమీదున్న గౌరవం రెట్టింపయ్యింది. అతనికి ఆ సమయంలో ఎందుకో శిల్ప గుర్తుకు వచ్చింది. వెంటనే ఆఫీసు గుర్తుకొచ్చింది. తను ఆఫీసు విషయం మార్చిపోయాడు. కోలిగ్ చంద్రబోసుకి హైదరాబాద్ ఫోన్ చెయ్యాలి. లీవ్ కి అప్లయ్ చెయ్యాలనుకున్నాడు.