కాశీ చరణ్ పరిస్థితి మేరీకి అసలేం అర్ధంకావడంలేదు. రేగ్యులర్ గా చేసే ఇంజక్షన్ చేసి_" నా షిఫ్ట్ అయిపోయింది. పునర్దర్శనం మళ్ళీ రేపే. మీకేదయినా కావలసినా వస్తే ఇంటర్ కమ్ లో 302 ప్రెస్ చేయండి. స్టాఫ్ ఎవరైనా ఎటెండ్ అవుతారు. ప్రస్తుతానికి ఆలోచనలు కట్టిపెట్టి నిద్రకు ఎక్కువసమయం ఇవ్వండి. సీయూ" నవ్వుకొంటూ వెళ్ళిపోయింది మేరీ. వెళుతున్న ఆమె కేసి ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు కాశీచరణ్.
* * * *
డాక్టర్ మధురిమ ఛాంబర్ లో కెళ్ళాడు డాక్టర్ శ్రీరామ్. శ్రీరామ్ లోనికొచ్చిన సమయంలో ఆమె ప్యాడ్ మీదున్న కాశీచరణ్ అనే అక్షరాల్ని చూసి విస్మయానికి లోనయ్యాడు.
అంతకుముందే డ్యూటీనుంచి వెళ్ళిపోయే ముందు ఆ అందమైన పేషెంట్ పేరును కాశీచరణ్ అని చెప్పి వెళ్ళిపోయింది మేరీ. ఏదయినా వింటున్న సమయంలో ఆ మాటల్ని యాత్రికంగా పేపరు మీద రాయడం అలవాటు మధురిమకు.
"అతని పేరు కాశీచరణట. తెలిసిందా మేడమ్?" అడిగాడు శ్రీరామ్.
"పది నిమిషాలముందే మేరీ చెప్పింది" తడబాటు కనిపించకుండా చెప్పిందామె.
"మరో విచిత్రం తెలుసా మేడమ్? ఆపేరు కూడా అతనిదో, కాదో అతనికే తెలీదట. తలకు దెబ్బతగిలి, గతమంతా మర్చిపోయేడేమోనని అనుకుందామంటే తలకు పెద్ద గాయాలు తగ్గలేదు. షాక్ కు గురికావడంవల్ల కొంత జ్ఞాపకశక్తి కోల్పోయాడని నా అనుమానం."
"ఏమ్నేషియా తలకు దెబ్బతగిలిన ప్రతి వాళ్ళందరకూ రాదు కదా" అని అడిగిందామె.
"ఏస్ డాక్టర్! డిసీజ్ హండ్రెడ్ పర్సెంట్ సైకాలాజికల్ ప్రాబ్లం అని నా డౌట్. ఎందుకైనా మంచిదని రౌడ్ ఎక్స్రేరేలు తీయిస్తున్నాను."
"గో ఎహెడ్" అని మధురిమ అంటున్న సమయంలోనే పొన్ మోగింది.
"ఏస్... డాక్టర్ మధురిమ... హియర్" అందామె టేబుల్ పైనున్న ఫోన్ అందుకుని.
"గుడ్ ఆప్టర్ నూన్ డాక్టర్! అయాం లాయర్ నీలకంఠన్. హౌ ఈజ్ మై పేషెంట్ ప్రోగ్రెస్?"
"ఎవ్విరిథింక్ ఓ.కే... బట్ తన పేరు కూడా గుర్తులేని పరిస్థితిలో వున్నడతను" చెప్పింది మధురిమ, ఎన్నో సందేహాల్ని తీర్చుకోవాలనే తన ఆతృతను లోలోనే అణుచుకుంటూ.
"అతని పేరు కాశీచరణ్. డిల్లీనుంచి వస్తూ రెండు రోజులక్రితం బీబీనగర్ రైల్వే క్రాసింగ్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ కి గురయ్యాడు. అతను నా కోసమే డిల్లీ నుంచి బయలుదేరాడు" అంటూ లాయర్ నీలకంఠన్ చాలా వివరాలు చెప్పి, కాశీ చరణ్ ఎప్పుడు చూడొచ్చని అడిగాడు.
"రేపు మార్నింగ్ తోమ్మిది గంటలకు రాగలరా?"
షార్సు నైన్. ఒకే డాక్టర్! థాంక్యూ" ఫోన్ పెట్టేశాడు నీలకంఠన్.
నీలకంఠన్ వస్తే చాల సందేహాలు పరిష్కారం కావడానికి ఆస్కారం వుంది. కాశీ చరణ్ పట్లతనకున్న ఇంట్రెస్ట్ ని పక్కనుంచితే, అతని బిహేవియర్ మరింత ఇంటరెస్టు గా వుంది డాక్టర్ మధురిమకు.
అంతలో కాశీ చరణ్ మేల్కోన్నాడని వార్డ్ బోయ్ వచ్చి చెప్పగా డాక్టర్ శ్రీరామ్ తోపాటు అతన్ని చూడటానికి బయలుదేరింది డాక్టర్ మధురిమ.
గబగబా మెట్లెక్కి వరండా మీద కెళ్ళిన మధురిమ అక్కడనుంచి ఎందుకో స్పీడుగా నడవలేకపోతోంది.
కొన్ని సెకండ్లో తను కాశీ చరణ్ చూడబోతోంది, మాట్లాడబోతోంది. అన్న ఆలోచనవల్ల ఆమె మన సేడుకో తీవ్రమయిన విద్వేగా నికి లోనైంది. ఇంతకుముందు ఎప్పుడూ ఏ పేషెంట్ విషయంలోనూ కలగని అనుభవం అది.
నెమ్మదిగా డాక్టర్ శ్రీరామ్ వెనుక ఆ రూమ్ లోకి నడిచింది డాక్టర్ మధురిమ.
ఆ రూమ్ లోకి అడుగిడుతున్నప్పుడు తిరిగి మరోసారి విచిత్రమైనా భావేద్వేగానికి లోనైంది.
చేతిలో వున్న మ్యాగజైన్ టేబుల్ మీద పెడుతూ, లోనకొచ్చిన డాక్టర్ శ్రీరామ్ ని విష చేశాడు కసహీ చరణ్. ఏవో మాట్లాడాబోయెంతలో అతని వెనకే ప్రత్యక్షమయిన డాక్టర్ మధురిమ వైపు కన్నార్పకుండా చూస్తూ వుండిపోయాడు కాశీచరణ్.
అలా తనవేపే తదేకంగా చోస్తున కాశీచరణ్ కళ్ళలోకి సూటిగా చూడలేకపోయింది మధురిమ.
"మిస్టర్ కాశీ! షి ఈజ్ దాజ్క్తర్ మధురిమ. చీఫ్ ఆఫ్ ది హాస్పిటల్" అతనికి పరిచయం చేస్తున్నట్టుగా అన్నాడు శ్రీరామ్.
అతికష్టం మీద రెండు చేతులు జోడించాడు కాశీచరణ్. థాంక్యూ డాక్టర్! మీ సహాయం నేను నా జీవితంలో మర్చిపోలేను" అన్నాడు.
"ఇట్స్ మై డ్యూటీ. మిస్టర్ కాశీచరణ్! మీ గిరించి నాకు కొని వివరాలు కావాలి చెప్పగలరా?" కుర్చీలో కూర్చుంటూ అడిగింది మధురిమ.
ఆ మాటలనడానికి తనను తాను చాలా కూడదీసుకోవాల్సి వచ్చిందామెకు.
"తెలిసినంతవరకూ ఆమెకేసి అదోలా చూస్తూ అన్నాడు కాశీచరణ్.
"మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మీరేం చేస్తూ వుండేవారు? మీ రిలేటివ్స్ ఎక్కడున్నారు?" వరసుగా ప్రశ్నల్ని గుప్పించింది మధురిమ. అతను చెప్పేది సమాధానాలు వినాలనివున్నా తను రౌండ్స్ కి వెళ్ళవలసి వుండడంతో శ్రీరామ్ ఆమెకు చెపి వెళ్ళిపోయాడు.
భారంగా నిట్టూర్చాడు కాశీచరణ్. ఎందుకంటే ఆమె వేసిన ప్రశ్న లలో ఎ ఒక్క ప్రశ్నకూ తన దగ్గర జవాబు లేదని అతనికి తెలుసు కాబట్టి.