Previous Page Next Page 
యోధుడు పేజి 10

ఇంతకీ తనది న్యూడిల్లీఏనా? హైదరాబాదా? అంతకుముందు రోజు బెబేనగర్ రైల్వేక్రాసింగ్ దగ్గర టుప్పల్లో తను పడివుండగా ఎవరో మేడికోస్ తనను తీసికొచ్చి ఈ హాస్పిటల్ లో చేర్పించినట్టు మేరీ చెప్పింది. ఏమీటి వైరుధ్యం?
    దేలీఫ్ చెప్పేది ఒక రకంగా_ మేరె చెప్పేది ఒకరకంగా వుంది. ఏది కరెక్ట్? అంతకు క్రితంరాజే తన పేరు కాశీ చరణ్ అని దేలీఫ్ ఎందుకు చెప్పలేదు?
    ఆలోచనలతో అతని మెదడు క్షణాల్లో సిస్టర్ మేరీతో.
    "ఎక్కువ ఆలోచించకండి... టాబ్లెట్ ఇస్తాను వేసుకోండి." అంటూ ఓ టాబ్లెట్ తీసికొచ్చింది మేరీ.
    ఆ టాబ్లెట్ వేసుకుంటున్న సమయంలోనే కాశీ చరణ్ కి ఓ విషయం జ్ఞాపకానికి వచ్చింది.
    క్రితం రోజు_
    మగతనిద్రలో తనున్నప్పుడు, ఎవరో తన నుదుటిమీద చెయ్యిపేట్టి చూశారు. ఆ చేయి చల్లగా వుంది. ఎవరిదా చేయి? అదే ప్రశ్నిచాడు కాశీచరణ్.
    "మేడమ్  మధురిమ... మీరింత త్వరగా కోలుకోవడానికి కారణం ఆవిడే" అంది మేరీ.
    "డాక్టర్ మధురిమ... చాలా అందమైన పేరు. ఆవిడ వయసు ఎంత వుంటుంది?" కాశీ చరణ్ పెదవుల్లోంచి ఆ ప్రయత్నంగా వచ్చింది ఆ ప్రశ్న.
    "హాస్పిటల్ చీఫ్ కాబట్టి అవిదకో అరవై ఏళ్ళు వుమ్తాయను కొంటున్నారుగాడా... అయినా... ఆడవాళ్ళ వయస్సు అడగకూడదని మీకు తెలియదా?" నవ్వుతూ అంది సిస్టర్ మేరీ.
    "తెలుసు... కానీ ఎవరో ఏమిటో తెలియని నన్ను స్పెషల్ గా ట్రీట్ చేసిన డాక్టర్ గురించి తెల్సుకోవడంలో తప్పులేదనుకుంటాను" అన్నాడు కాశీచరణ్.
    "డాక్టర్ గారి వయసా సార్... బిలో తర్తీ... ఎబౌ ట్వంటీ ఫైవ్... గుడ్ అండ్ జెంటిల్ లేడీ సార్! మీ వయసేకదా..." తన ధోరణిలో గడగడా వాగేశాడు అప్పుడే లోపలకొచ్చిన శివానందం.
    "ఏయ్... శివానందం... ఊరికే అనవసరమైన  విషయాల్లో తల అదూర్చకు ముందు ఇక్కడనుంచి నువ్వెళ్ళు" కసురుకుమ్డీ మేరీ.
    "ఆవిడ వయస్సు చెప్తే నేకేమ్దుకు అంత కోపం కూమారి మేరీ?" వేళాకోళంగా అన్నాడు శివానందం.
    "కూమారి మేరీ అనేమాట అనొద్దని లక్షసార్లు  చెప్పాను. మరో సారి ఆ మాట అన్నావంటే... నిన్ను సప్సేమ్ద్ చేయిస్తాను" అంటూ రుసరుసలాడుతూ బయటికెళ్ళిపోయింది మేరీ.
    వాళ్ళిద్దరి వేళాకోళాలు  చూస్తుంటే వార్డ్ బోయ్, నర్సుల సంభంధంళా అనిపించడంలేదు కాశేచరణ్ కి.
    "ఏంటి విశేషం...మేరీకి పెళ్ళి కాలేదా?" శివానందాన్ని అడిగాడు కాశేచరణ్.
    "న్న కోసమే అగిమ్డండీ బాబూ... నాలుగేల్లానుంచి ఎన్నిలైన్లు వేశానో... ఎన్ని లవ్ లేతల్రు రాశానో... ఆఖరికి ఇప్పుదిప్పుడే లైన్లోకి వస్తైమ్ది గోరూగారూ. నాకేం తక్కువ చెప్పండి_ శక్తి కపూర్ ళా ఎర్రగా, బుర్రగా వున్నావా? రాజ బబ్బర్లా నా హెయిర్ స్టయిల్ చూడండి. ఈ ఫీల్డ్ లో నేనే సీనియర్ ని. ఇన్నేళ్ళయినా ఈ కుమారి మేరీ నన్నెందుకు కరునించదంలేదో న్ అంతుబట్టడంలేదండీ." అలా లోడా లోడా వాగుతున్న శివానందం ముఖంవైపు చూస్తూ కాశీచరణ్.
    "నేను చెప్పనా?" అన్నాడు కాశీచరణ్.
    "అందుకే గదండీ... నాహృదయం మీ ముందు విప్పి వుంచాను." ఫిన్మా ఫక్కీలో అభినయం చేస్తూ అన్నాడతను.
    "నువ్వెంత మగాడివినా వార్డ్ బోయ్ వి. అవునా? తనేమో సేనియర్. సిన్మా ఫక్కీలో అభినయం చేస్తూ అన్నాడతను.
    "నువ్వెంత మగాడివినా వర్డ్ బోయ్ వి. అవునా? తనేమో సీనియర్. హెడ్ ఫక్కిల్. ఆవిడ నన్ను మనసులో అభిమానిస్తున్నా, స్టేటస్ గురించి అలోచిస్తోందేమో"అన్నాడు కాశీచరణ్.
    అతనన్న మాటలు విని చప్పున సైలెంటయిపోయాడు శివానందం.
    ఈ పాయింట్ గురించి ఇంతకు ముందు నేనెప్పుడూ ఆలోచించలేదు గురువుగారూ" ఆశ్చర్యపోతూ అన్నాడు శివానందం.
    "ఆవిడ స్థాయికి నివ్వేది గావనుకో... నిన్ను పెళ్ళి చేసుకోవడానికి ఆమెకి అభ్యంతరం వుండకపావువాచునేమో" అనవ్వుతూ అన్నాడు కాశీచరణ్.
    "కరెక్ట్ సార్! అంటే నా ఫోస్టూ మార్చుకోవాలి_ మేడమ్ మధురిమ గారిని ఇవాళే అడిగేస్తాను. మేలనర్స్ గా ప్రమోషనిమ్మని. థాంక్యూ ఫర్ యువర్ ఆడ్ వైజ్ సార్... మీకెప్పుడు అవసరం వచినా పిలవండి సార్. స్పెషల్ సర్వీస్ చేస్తాను" హుషారుగా, హాడవిడిగా బయటికెళ్ళిపోయాడు శివానందం.
   
                         *    *    *    *
    మేరీ టవల్ ని గోరువెచ్చని నీళ్ళలో ముంచి కాశీ చరణ్ మోహం, భూజాలు, చేతులు, కాళ్ళు నడుములు, వీపు శుభ్రంగా తుడిచింది.
    "ఈ షర్టు మార్చుకొండీ" అంటూ అంతవరకూ టేబుల్ మీదున్న లైట్ బ్లూ కలర్ షర్టు ను తీసి అతనికి అందించింది.
   
    "ఈ షర్టు బావుంది ఎవరిది? సరిగ్గా నాకు సరిపోయే సైజు" షర్టుని తిప్పి చూస్తూ అంటున్న కాశీచరణ్ ముఖంలోకి విస్మయంగా చూసింది మేరీ.
    "ఆ షర్టు మిస్టర్ కాశీచరణ్" నేమడిగా అన్నది ఆమె.
    "నాదా?" మరింత ఆశ్చర్యానికి లోనయ్యడతను.
    "ఏస్! మీకు సంభందించినదని చెప్పి, మేడికోస్ ఇచ్చి వెళ్ళిన సూట్ కేస్ లోంచి తీసిన శర్తే యిది."
    "నా సూట్ కేస్ ని మేడి కోస్ అప్పగించారా? విడ్డూరంగా వుండే... ఎక్కడుందది?"
    "లగేజి రూమ్ లో"
    "దాన్ని నేను చూడొచ్చా?"
    "చూడొచ్చు. డాక్టర్ మధురిమతో చేబుతాను."

 Previous Page Next Page