Previous Page Next Page 
రాక్షస నీడ (రెండవ భాగము) పేజి 11

 

    "హైదరాబాద్."
    "ఏం పని బాబూ?"
    "తర్వాత చెప్తాను. ముందు మీరు మీ అబ్బాయిని గురించి మాకున్న కొన్ని సందేహాలు తీర్చాలి."
    వర్ధనమ్మ అయోమయంగా చూసింది.
    "గౌతమ్ మీరు కన్నబిడ్డ కాదు కదూ?"
    "కాదు. అందరికీ తెలిసిన విషయమే."
    "అయితే గౌతమ్ తల్లి పేరు ఏమిటి?"
    "నాకేం తెలుసు?"
    "మరి గౌతమ్ మీకెలా దొరికాడు?"
    "ఎవరో కని కుప్ప తొట్టి పక్కన పారేస్తే తెచ్చి పెంచుకున్నాం."
    "అబద్దం! గౌతమ్ అమల కొడుకు. తండ్రి పేరు రంగనాధరావు."
    వర్ధనమ్మకు వళ్ళంతా చెమట్లు పట్టాయి.
    "ఎవరు మీరు! ఏం కావాలి మీకు?"
    "మీకు నిజం కావాలి."
    "ఎందుకు?"
    "తర్వాత చెప్తాం."
    "నాకు తెలియదు. వాడి తల్లి పేరు నాకు తెలియదు."
    "చూడమ్మా! భయపడకు. మేము గౌతమ్ క్షేమం కోరే వచ్చాం. అమల మీకు తెలుసు. మీ ఇంట్లో అద్దెకు వుండేది...."
    "మీరెవరు ! ఎందుకొచ్చారు. గౌతమ్ నా బిడ్డే ఇక నాకేమి తెలియదు. ముందు మీ రిక్కడ్నుంచి వెళ్ళండి వెళ్ళిపొండి ." పిచ్చిదానితో అరవసాగింది వర్ధనమ్మ.
    "అది కాదమ్మా!"
    "ముందు వెళ్తారా లేదా?" బాణం తగిలిన జంతువులా అరిచింది.
    ఆమె రూపం చూసి ఇద్దరూ యంత్రకంగా లేచి నిల్చున్నారు.
    అప్పటికే గౌతమ్ వచ్చి వాకిట్లో నిలబడిపోయాడు అతడ్ని ఎవరూ గమనించలేదు.
    "పొండి! వెళ్ళి పొండి!" పిచ్చిగా అరిచింది వర్ధనమ్మ.
    ఇద్దరూ కర్తవ్య విమూడుల్లా నిల్చుండిపోయారు.
    "ఒక్కమాట....."
    "వినను. ముంది క్కడ్నుంచి కదుల్తారా లేదా?" నా బిడ్డంటే ఏమనుకోంటున్నారు. వాడు వచ్చాడా మీ ప్రాణాలు తీస్తాడు. నా మీద ఈగ వాలనివ్వడు , ఏమనుకున్నారో! " ఆమె కంఠంలో కోపంతో పాటు రవ్వంత గర్వం కూడా పలికింది.
    "అది కాదమ్మా!"
    "నేనేమి వినదల్చుకోలేదు. వెంటనే వెళ్ళిపొండి."
    "ఒక్క మాట!"
    "ముందు వెళ్తారా లేదా?" తారాస్థాయిలో అరిచింది.
    "అమ్మా!" వెనుక నుండి గౌతమ్ అన్నాడు.
    వర్ధనమ్మ త్రుళ్ళి పడింది. గౌతమ్ ను గట్టిగా రెండు చేతులతోనూ పట్టుకుంది.
    "ఏమిటమ్మా ఏం జరిగింది? ఎందుకంత కోపంగా ఉన్నావ్? ఎవరు వీళ్ళు? ఎందుకొచ్చారు?"
    "వీళ్ళను వెంటనే వెళ్ళి పోమ్మనురా  , గౌతమ్. వెళ్లకపోతే నాలుగు తగిలించు."
    "అమ్మా!" గౌతమ్ తల్లి ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు. వర్ధనమ్మను అంత కోపంలో ఎన్నడూ చూడలేదు. పైగా అతిధులంటే ఆమెకు మహా గౌరవం. కొందరు రోజుల తరబడి ఇంట్లో తిష్ట వేస్తె తను విసుక్కునేవాడు. అందుకామె "పోనియ్ లేరా, బాబూ! వాళ్ళకు తినడానికి లేక మనింటికి వస్తారా? అభిమానంతో వస్తారు గాని, అని తనను శాంతపరిచేది. అలాంటి అమ్మ ఇంటికి వచ్చిన వాళ్ళను గెంటేయ్యమంటోంది. ఎవరు వీళ్ళు? ఎందుకు కొచ్చారు?
    గౌతమ్ తల తిప్పి ఇద్దర్ని మార్చి మార్చి చూశాడు.
    ఇద్దరూ శిలా ప్రతిమల్లా తన మీద చూపులు నిలిపి నిలబడిపోయారు. నోళ్ళు కూడా కొద్దిగా తెరచుకొనే ఉన్నాయి.
    "ఏయ్! ఎవరు మీరు? బెల్లం గడ్డ దొంగిలించి నోట్లో పెట్టుకున్నట్లు నిల్చున్నారేం?" గౌతమ్ కు వాళ్ళ వాలకం చూస్తే నవ్వు కూడా వచ్చింది.
    "ఎవరమ్మా వీళ్ళు? వీళ్ళ మీద నీకెందుకంత కోపం వచ్చింది? చెప్పమ్మా! నిన్ను అవమానించారా? చెప్పు! గౌతమ్ కంఠం కంచులా మోగింది.
    వర్ధనమ్మ గొంతుకు ఉంగిడి పడిన పశువులా అసహాయంగా దీనంగా, కొడుకును చూసింది.
    "చెప్పండి - ఎవరు మీరు? ఎందుకొచ్చారు?" అసహనంగా అడిగాడు.
    అదే రూపం. అదే కంఠస్వరం. అయితే ఇతడి కంఠంలో కరుకుతనం ఉంది. మొండితనం ఉంది. రవి బుర్ర చురుగ్గా పని చేస్తుంది.
    "నోళ్ళు అలా పడిపోయాయేం? నన్ను చూసి ఎందుకంత భయపడ్తున్నారు? నేను మంచివాళ్ళకు మంచివాడినే. చేద్దవాళ్ళకు మాత్రం వదల్నూ. మీరెవరు? నన్ను చూసి భయపడ్డారెందుకు? నేను ఊళ్ళో లేనని తెలిసే వచ్చారా? మా అమ్మను ఏమన్నారు? ఎందుకామే అలా భయపడ్తుంది?" అంటూ వారి ముఖంలోకి చూసిన గౌతమ్ కు నవ్వొచ్చింది.
    పకపక నవ్వాడు. విరగబడి నవ్వాడు.
    తన అన్నయ్య ఇలా నవ్వడు. అసలు ఆ శబ్దం వచ్చేలా ఎప్పుడో గాని నవ్వడు. ఇలాంటి సందర్భాల్లో అయితే చిరునవ్వు నవ్వుతాడు. చాలా అందంగా ఉంటుంది అన్నయ్య నవ్వు. ఇతడేలా నవ్వుతాడో/ ఏదీ ఇంత వరకు అతడి ముఖంలో చిరునవ్వే తను చుడలేదుగా?
    "ఏమిటిరా గుడ్లు తేలేచి చూస్తారు? నేనేం రక్షసుడిలా కనిపిస్తున్నానా? మెళ్ళో ఎముకల దండలు కళ్ళ చుట్టూ పుసులు కూడా కనిపిస్తున్నాయా?"
    రవికి అతని మాటలు వినిపించటం లేదు. అస్చ్వ్హర్యంలో నుంచి పూర్తిగా బయట పడలేకపోతున్నాడు. ఇతడ్ని ఎవరో తెలియని వ్యక్తిగా లేక మొదటిసారిగా కలుసుకున్న వ్యక్తిగా ఊహించలేకపోతున్నాడు. అతడు తనకు చాలా కాలంగా, అతడు తనకు చాలా కాలంగా కాదు - చిరకాలంగా కాదు- తను పుట్టిన్నప్పట్నుంచి తెలిసిన వ్యక్తిగా అనిపిస్తున్నాడు! ఇద్దరూ కవలలు కాదు కదా? మరి బర్త్ రిజిస్టర్ లో ఒక్కడే పుట్టినట్లుగా నమోదు అయి ఉందిగా? ఇద్దరూ కవలలు కారు కనకనే ఇద్దరి పేర్లూ గౌతమే పెట్టారు. అది కాకతాళీయం కావచ్చు. జీవితం సినిమా కంటే, కధ కంటే చిత్రంగా ఒక్కొక్కసారి మనకు ఎదురౌతుంది. ఇద్దరి పేర్లూ ఒక్కటే కావడం తనకే మంచిది. తను గౌతమ్ గాడి మీద అదే తన అన్నయ్య మీద కసి తీర్చుకోవడం ఏమంత కష్టం కాదు. అయితే ఆ ప్లానంతా విశ్వమే వెయ్యాలి. తన వల్లెం కాదు. మరి ఆ ఇందు గర్వం అణచడం ఎలా? ఆవిడ ఇతన్ని చూసి అన్నయ్యగా భ్రమ పడటం అసంభవం. తను ఒక నవల చదివాడు. అందులో ఒక బీదవాడు ధనవంతుడిగా ఒక ఇంట్లో ప్రవేశిస్తాడు. భార్యా, తల్లీ, నౌకర్లూ, చాకర్లూ అందరూ భ్రమ పడ్తారు. కేవలం న్ట్లో కుక్క ప్రియురాలు మాత్రం అతడు అసలతను కాదని గుర్తించడం జరుగుతుంది. ఇందు చాలా తెలివైంది. ఆమెను భ్రమ పెట్టడం సాధ్యం కాదు. ఇలా సాగిపోతున్నాయి రవి ఆలోచనలు.
    తను గౌతమ్ మీద కసి తీర్చుకోవడానికి మంచి అవకాశం లభించింది . తన అన్నయ్యను జైల్లో పెట్టించాడు. తను వాణ్ణి జైల్లో పెట్టించగలడు. అప్పుడు గాని తన కసి తీరదు. విశ్వం ఆలోచిస్తూ మధ్య మధ్య గౌతమ్ కేసి చూస్తున్నాడు.

 Previous Page Next Page