'చిక్కని' అందాల విలాసం
అర్జునా! పరాక్రమోపార్జునా! విందువా నా మాట! ఈ గదుడు అంగదుడులా చెప్పే రాయబారం వింటావా! ఎన్నిదేశాలు చూశాం! ఎందరమ్మాయిలను చూశాం. ఎక్కడా అందగత్తె లేదయ్యా అర్జునా!
ఆమె కోప్పుతో పోల్చడానికి తగిన మాటలే లేవు. పోలికలే కానరావు ఎప్పుడు కేళికా సరసిలో తేలి ఆడుతూ అంటాయి. కాబట్టి శైవాలతలు కొంత సాటి వస్తాయి. పుష్పమాలికలతో పొందు సల్పుతాయి కాబట్టి ఎలదేటి గుంపు కొంత యీడౌతాయి. కంటికింపగు రేఖగా ఉంటుంది కాబట్టి కాటుక దినుసుగా కొంత పోలుతుంది! వయ్యారంలో బిరుదు పొందింది కాబట్టి చమరివాలం కొంత సమయం కావచ్చు. అంతేకాని ఆమె సోగ వెండ్రుకలకు ఏవీ సరిరావు. ఆనలుపు ఆమెత్తని మొత్తం - ఆనిడుద - ఆ దళాలు ఆ మెరపు అహో! నుతింప శక్యం కాదు....
అన్నట్టు నీ గురించీ చెప్పాలే! జయంతుని తమ్ముడు సోయగంలో అన్నాను. శ్రీకృష్ణుని ప్రాణసఖుడని చెప్పాను! పోరులో పరమేశ్వరుడివన్నాను--- ఇంతెందుకు? అతని కతనే సాటి చతురబ్ది పరీత మహితలంలో అన్నానయ్యా!
అందమే కాదులే - ఐశ్వర్యమే కాదులే శౌర్యాన్ని కూడా గొప్పగా చెప్పాను లేవయ్యా మిత్రమా! మా అర్జునుడు పారచూస్తే పారసేన పారజాస్తుంది! వింటికి ఒరిగితే రిపురాజి వింట కొరుగుతుంది. వెయ్యేటికిమా మా పాండవేయు సాటి వీరుడిల లేడమ్మ! ఉంటే గింటే ప్రతి రఘువీరుడు ఒకడే అన్నానయ్యా!
అర్జునా నీకతలేమిటి? ఆమె వర్ణన వినవయ్యా! ఒక్కొక్కరికి నడుమంత్రపు సిరివస్తే నిక్కినీల్గి విర్రవీగుతారు కదా! ఆమె కుచాలు మెరుగుటారు వేనలి అలాగే నిక్కినీల్గాయి. కుచాలకు పర్వత సాదృశ్యం వచ్చింది. దానితో నిక్కాయి చక్కా! ఏం పొగరు! ఎంత పొగరు అన్నట్టున్నాయి. మిత్రమా! మెరుగుటారు అహీనభూతితో నీలిగాయి. ఇక వేనలి ఘనాభ్యుదయం పొంది మేఘ మాలికల్ని తలదన్నుతూ విర్రవీగుతూ ఉందయ్యా! నిజమే కదా మొదట లేని సిరి నడుమంత్రగా వస్తే నిక్కి నీల్గవా మరి?
నవనీయ విలాసాలతో నడక అంచలను బుజ్జగిస్తే - చనుకట్టు రధాంగ యుగళిని మచ్చిక చేస్తే! ఆమె చెలువపు పలుకులను చిలుకలు గారవిస్తే-కనుదోయి చకోరపాళిని పెనగి అందగిస్తాయి. అంతందం అంత సౌరుతీరు ఏమందం. మందయాన ముఖ మందం నవారవిందం మీరుతుంది.
ఆమె అందం జగాదివిటీలు పెట్టీనట్లు జగమెరుంగు! అర్జునా! కాబోయే ప్రేయసి అందం కన్నులకు కట్టినట్లు వర్ణిస్తూ ఉంటే ఇంపుగా ఉంది కదా? ఇంకా ఇంపారేలా వినిపిస్తాను! ఆమె వీనులు తొమ్మిదిని అదేమి లెక్క అని లెక్క చేయవయ్యా! ఎందుకా? తొమ్మిది రాస్తే ఏర్పడేది. తనకేమో రెండు చెవులు, శ్రీకారం దిద్దే తొమ్మిదిలా ఉన్నాయి. ఆమె చేతి గోళ్ళుచు క్కలుంటాయి. చక్కని చుక్కల్ని! ఆమె గబ్బి గుబ్బలు పువ్వుల చెండ్లను పోపో అంటాయి. ఆమె ముఖారవిందం ఆ చందమామను త్రోసి రాజంటుంది. పాపం రాజైన చంద్రుడు కిమ్మనలేదు.
అయ్యారే! ఆ చెలువం ఎక్కడయా! వెయ్యారు స్త్రీలలో - ఆరు వేల - పదారువేల భామల్లో వెదికినా ఆ అంగ రుచి రుచిరాంగ రుచికి ఈడు జోడు ఉందా! రతీదేవిని ఊఁ అని త్రోసివేయగల తీరు తెన్నులున్నాయి సుమా.
పార్ధా! ఆమె కొప్పు కడు హెచ్చు! ఎందుకా నలుపులో సౌరులో తీరులో బారులో అదే హెచ్చు! అదే హెచ్చనుకుంటే వక్షోజాలు మరీహెచ్చు! ఇక కటి వీటన్నిటి కన్నా హెచ్చు! అదీ ఇదీ అనడం ఎందుకు? అన్నీ హెచ్చే! మరి పస లేనిదే లేదా అంటావా! పాపం నడు మాత్రం పసలేదు. కడు పెద్ద పిడికిట బిగిస్తే పిడికిలే మిగిలిపోతుందేమో అన్నంత సన్నం.
ఓ నృపపుంగవా! ఇంకేం చెప్పగలను ఆమె శరీరం బంగారం! ఆమె నొసలు (కొన్నెల వంక, ముగ్గురు ఇంద్ర నీలాలు, అన్నట్లు నీవు ఇంద్ర సుతుడివే కదా! సరి పోతావులే. అయితే ఆమె చూపులున్నాయి చూడు మన్మధుడి రెండు రాళ్లవలె ఉంటాయి. ఇంతెందుకు. ఎక్కడ నెప్పినాడు. తరలేక్షణ చక్కదనమ్ము ఇంక అమ్మక్క! అదే మనంగ ఇపుడందు శతాంశము తెల్పలేదు. ఒక్కొక యంగమెంచ వలయున్ పదివేల ముఖంబు లాయెపో చొక్కపు చూపులో పొల్చు చూచిన కాక ఎరుంగ వచ్చునే!
అలా భట్టులా పొగిడాడు గదుడు విన్నాడు అర్జనుడు. విలాస యాత్రకు బయల్దేడు. ఆపై - అబ్బ ఎంత కభ.
ప్రతి పద్యమునందు చమత్కృతి కలుగంగ చెప్ప నేర్చిన చేమకూర వెంకట కవి మాటల నేర్పులా సరస మార్గములా కొలువుండు రీతులా పాటల గంధులా కళలా భాగ్యములా బహుదాన లీలలా! నాటక శాలలా! యొకటనన్ వలదు ఎన్నిట చూడ అన్నిట మేటియు గీర్తి లోలుడు అయిన రఘునాధ రాయల వారికి తారస పుష్టియై ప్రతి పదంతో జాతి వార్త చమత్కార అర్ధ గౌరవాలు కల్గేలా రచించిన రాయలవారికి చెవిసోక చెప్పిన కమనీయ కావ్యం విజయ బిలాసం.
ఆనతి ఇచ్చెనా అది శిలాక్షరం. ఎవ్వనేని మెచ్చినా వాని కృతార్థు చేస్తాడు. ఇచ్చాడా అది ఏనుగు పాడి అని రఘునాధుడ్ని పొగిడినట్లే ఈ గ్రంధంలో పదాలా పద్యాలా భావాలా చమత్కారాలా మాట విరుపులా ఉపమల అబ్బా! ఎన్ని! ఎన్నెన్ని! తాపీ ధర్మారావ్ గారి హృదయోల్లా సందగ్గరుంచుకొని చదివితే తప్ప తనివి తీరుతుందా! అప్పుడు కదా అనుకోవడం! 'దొరకునా ఇటువంటి కవనం'
----*---