ఆమె జార్జిని చూచింది - జార్జి టైపిస్టు.
అతడు డెయిజీని చూచాడు - డెయిజీ రిసెప్షనిస్టు.
పూలు తెచ్చిస్తున్నాడు జార్జి దేవతకు అర్పించినట్లు అర్పిస్తున్నాడు దేవతలా స్వీకరిస్తుందామె దేవత కంటే ఎక్కువగా ఒక చిరునవ్వు నవ్వేస్తూంది డెయిజీ.
తరువాత ఏమనాలో, ఎలా ప్ర్రారంభించాలో అర్ధం కావడంలేదు జార్జికి ఏదో భయం భయంగా ఉంటూంది గుండె దడ దడ కొట్టుకుంటూంది ప్రేమలేఖలు వగైరా ఎన్నో ఆలోచించాడు రాశాడు కానీ, ఏదీ పూర్తి చేయలేకపోయాడు.
ఆఫీసు ముగిసే సమయానికి ఒక కారు వస్తుంది డెయిజీని తీసికెళుతుంది.
ఒకనాటి సాయంకాలం బస్ స్టాప్ దగ్గర కనిపించింది డెయిజీ అదృష్ట దేవత ఆ రూపంలో అక్కడ ప్రత్యక్షం అయిందనుకున్నాడు జార్జి దడదడా కొట్టుకుందతని గుండె సుమారు పరిగెత్తాడు డెయిజీ దగ్గరికి "గుడ్ ఈవినింగ్ డెయిజీ!" అన్నాడు ప్రక్కకు తిరిగి చూసింది "హో జార్జి, గుడ్ ఈవినింగ్ ఇటు ఎక్కడికి?" అడిగింది.
"డెయిజీ, డార్లింగ్! ఎంతకాలంగా నీ ప్రేమ భిక్షం కోసం ఎదురు చూస్తున్నాను చూడు నా గతి ఎలా అయింది, నా హృదయరాణీ? దయరాదా? కరుణించవా? కరుగవా? ఈ దీనుడు దేహీ అని యాచిస్తున్నాడే? నీ సొగసు, నీ అందం, నీ చందం, నీ వయస్సు నా హృదయంలో అగ్ని రగిలింపచేయుచున్నవే ఏమందువే రాణీ, ప్రణయ రాజ్ఞీ" లాంటి ఏదో డైలాగు అందా మనుకున్నాడు జార్జి కానీ కాఫీ తాగాలని ఎంత కాలంగానో అనుకుంటున్నాను" అని.
నవ్వేసింది డెయిజీ ముచ్చెమటలు పోశాయి జార్జికి "దానికేం, పద వెళ్దాం" అన్నది జార్జికి ప్రాణం వచ్చింది ఫేమిలీ కేబిన్ లో కూర్చున్నారిద్దరూ కాఫీ చప్పరిస్తూ భయం భయంగా అన్నాడు జార్జి "ఒక్క మాటంటాను, మన్నిస్తావా?" "ఎస్" అన్నట్లుగా కళ్ళతో ఆమోదం తెలిపింది డెయిజీ.
"డెయిజీ! వాట్శావ్న్ చెపుతున్నాను అతిశయోక్తి కాదు నీవు మా కంపెనీలోకి వచ్చిన తరువాతే నా జీవితం మొదలైంది అంతకు ముందు నేను బ్రతికాను కాని, జీవితం నాకు తెలీదు"
వింటూంది డెయిజీ ప్రశాంతంగా అతని కధంతా కొత్తగా కనిపించింది ఆనాటి పూవు లందించినలాంటి ఆనందం ఆవిడ మనసులో తలెత్తింది తనకోసం ఒకడు తపిస్తున్నాడని తెలిసి ఆమె ఆనందానికి అంతులేకపోయింది జాగ్రత్తగా అతని కధంతా విన్నది అప్పుడప్పుడూ అతని కళ్ళల్లోకి చూచింది వాటిలో తన ప్రతిబింబం చూచుకుంది.
"డెయిజీ డార్లింగ్! ఇంతకూ నేను చెప్పొచ్చిందేమంటే, నాకు నీవంటే ప్రేమ" తరువాత చెప్పలేకపోయాడు.
ఆ అమాయకత్వం డెయిజీని మైమరపించింది ఆమె హృదయంలో ఎన్నో మల్లెతోటలు వెలిశాయి పచ్చని పచ్చిక మైదానాలు పరచుకున్నాయి ప్రేమ పూవుల్లాంటిదనీ, ప్రేమ ఉషస్సు లాంటిదనీ, ప్రేమ సంధ్యారాగం లాంటిదనీ, ప్రేమ వెన్నెలలాంటిదనీ, ప్రేమ మలయానిలం లాంటిదని ఆమె గ్రహించింది.
ఆమె జీవితంలో మొదటిసారిగా ఓడలు పులకరించింది "జార్జి డియర్! ఐ లవ్ యూ" అన్నది.
జార్జి మీద అమృత వృష్టి కురిసింది వెన్నెలవాగుల్లో మునిగాడు పూలవాన కురిసింది ఉబ్బితబ్బిబ్బయినాడు.
ఆ ఆనందంలో సహితం అతడు హద్దుమీరలేదు 'మై డార్లింగ్' అని చేయి చాచాడు ఆమె చేయి అందించింది వారు షేక్ హాండ్ చేసుకున్నారు వారి గుండెలు చేతుల్లో చేరి కలిసిపోయాయి.
జార్జితో వెన్నెల్లో విహరించడంలో ఆవిడకు ఎంతో ఆనందం కలిగేది అతని భుజంమీద తల ఉంచి అలా ఎంతో సేపు ఉండిపోయేది జార్జి ఒళ్ళో తలపెట్టుకొని పడుకుంటే అతడు కురుల్ను సవరించడం, చెక్కిలిమీద వ్రేలితో గీతలు గీయడం తల్చుకుంటే ఆమె గుండె జలదరించింది.
తరవాత ఆమె జీవితంలో చీకట్లు కమ్మాయి.
ఒకనాటి రాత్రి వాళ్ళ ప్రొప్రయిటర్ జార్జి ఇంటికి వెళ్ళాడు కలకత్తాకు టికెట్టు రిజర్వేషను, ట్రాన్సుఫర్ ఆర్డరూ ఇచ్చి తన కార్లో తీసికెళ్ళి కలకత్తా రైలు ఎక్కించి వచ్చాడు.
జార్జి క్రమశిక్షణలో పెరిగినవాడు నియమ నిబంధనల చట్రంలో బిగింపబడినవాడు మారుపలకలేకపోయాడు.
కలకత్తా వెళ్ళినవాని పేరు జార్జేకాని అతడు డెయిజీ జార్జికాడు తరువాత చాలామంది వచ్చారు వచ్చిందెవరో వెళ్ళిందెవరో ఆమెకు గుర్తులేదు రాజారావు వచ్చాడు అతడు వెళ్ళలేదు అతడు సర్వదా తనవాడు కావాలని ఆమె కోరిక రాజారావు మీద డెయిజీకి మనసైంది అతడు తనను ప్రేమిస్తున్నాడనుకుంటూంది డెయిజీ అలాంటి వాణ్ణి మోసం చేయడానికీ తనను యంత్రంగా వాడుకుంటున్నారు సూరీ, మైకేలూ తాను యంత్రంగా ఉపయోగపడాల్సిందేనా? తనను నమ్మిన వాణ్ణి మోసగించాల్సిందేనా? మోసగిస్తే రాజారావు తనను నమ్ముతాడా? మోసగించకుంటే మైకేలు తనను బ్రతకనిస్తాడా? బ్రతుకులో ఉన్న స్వారస్యం ఏమిటి? ఇళ్ళూ, ఫర్నిచరూ అద్దెకు పోయినట్లు తానూ అద్దెకు పోవాలి! సారాయివలె, సినిమావలె, రేసులవలె, జూదంవలె క్షణకాలపు ఆనందంకోసం తాను అమ్ముడు పోవాలి చస్తేనేం? చచ్చినా ఫరవాలేదు, మోసం చేయరాదు, అదీ తాను నమ్మినవాణ్ణి"
"చావు" అనే పధం అంధకారంగా, భయంకరంగా, అయోమయంగా కనిపించింది గుండె దడదడలాడింది చావంటే తానొక్కతేనా? తనలో ఒక ప్రాణి జీవం పోసుకుంటూంది తాను తల్లి కాబోతోంది రాజారావు ప్రతిబింబం, ప్రతిరూపం తనలో మసలుతూంది ఆ ఆలోచనే ఆమెలో ఆనందాన్ని కలిగించింది ఆ ఆనందం కోపం, తన బిడ్డకోసం, జీవించాల్సిందే? ఎన్ని కష్టాలైనా భరించాల్సిందే! తాను ఏదైనా చేస్తుంది కాని, తన బిడ్డను కాపాడుకుంటుంది.
అవును అయితే, అందుకు చేయాల్సిందేమి? ఎలా? ఏవిధంగా? పారిపోతే ఎటు ఎక్కడికి? ఎవరున్నారు? ఏ రీతిగా? అయినా ఎందుకు పారిపోవడం? మరి ఏమిటీ చేయడం? రాజాతో ఈ విషయం చెప్పేస్తే? తనకు ఆశ్రయం కల్పించమంటే? ఆ ఆలోచన మెరుపులా మెరిసింది ఇంతసేపన్నుంచీ తనకా ఆలోచన ఎందుకు రాలేదో అర్ధంకాలేదు.
అంతే అలాగే చేయాలి రాజా రాగానే చెప్పేస్తుంది రాజా మురిసిపోతాడు రాజాతోనే వెళ్ళిపోతోంది రాజా అనే కోటను బద్దలు చేసి మైకేలుగాని, సూరిగాని రాలేరని స్థిరపరచుకుంది.
కాని, రాజా ఎలా రిసీవ్ చేస్తాడో ఈ వార్తను? తనలో అతని ప్రతిబింబమే ఉందంటే నమ్ముతాడా? గుండె జల్లుమంది అవును, నమ్మాల్సిన అవసరమేం? తానేం తాళికట్టించుకున్న పెళ్ళామా? నమ్మకుంటే తన గతేం కాను? తానెక్కడికి పోవాలి?
మళ్ళీ ఆలోచనల పరంపర, వందలవేల క్వశ్చన్ మార్పులు గుండె చీల్చినట్లు అవుతూంది మెదడు మండిపోతూంది ఎదురుగా టేబుల్ మీద విస్కీ కనిపించింది ఏమైనా ఈ వ్యధనుంచి దూరం కావాలనుకుంది గటగటా త్రాగి గ్లాసు ఖాళీచేసి టేబుల్ మీద పెడ్తుండగా గదిలోకి ఎవరో ప్రవేశిస్తున్న అడుగుల చప్పుడైంది గుండె జల్లుమంది గుమ్మంవైపు చూచింది సూరి కనిపించాడు సైతాన్ను చూచినట్లయింది కెవ్వుమని కేకలేద్దామనుకొని లేచి నుంచుంది కాని, కేక గొంతుదాకా వచ్చి నిలిచిపోయింది.
"హల్లో డార్లింగ్ డెయిజీ! ఎంత అందంగా ఉన్నావు? ఇప్పుడు నీకు పదహారేళ్ళన్నా కాదనేవాడు లేడు ఆ సూర్యుడు నిన్ను చూళ్ళేదు కాని, చూస్తే నీ ఆయుష్షు హరించేవాడుకాడు ఏమి ఆ చమక్కు? రా రా రావే వయ్యారీ!" అని చేయి పట్టుకోపోయాడు సూరి.
డెయిజీ చేయి వదిలించుకొని దూరంగా పోయింది "ఎందుకలా పారిపోతావు డార్లింగ్, ద్రౌపదిలా? ఓహో తెలిసింది రాజారావు వస్తాడనా? మైసింపుల్ డెయిజీ! రాజా ఈ లోకంలో లేడు" గుండె జల్లుమంది డెయిజీకి "పేకలో మునిగి తేలుతున్నాడు యాభైవేలు అతనివి పోయినాయి ఇరవైవేలు మనకు వచ్చేశాయి ఇవ్వాళ మనం రాజా, నువ్వు రాణీ - ఏమంటావు? అదిగో కుర్రాడు వోడ్కా తెచ్చేశాడు, రా డార్లింగ్ త్రాగేద్దాం ఉమర్ ఖయ్యాం అన్నాడో అనలేదో తెలీదు కానీ నీవూ, వోడ్కా ఉంటే మరేం కావాలె మైస్వీట్?" అని డెయిజీని పక్కన కూర్చుండబెట్టుకొని వోడ్కా అందించి, "యిది వోడ్కా, రష్యా తయారీ రష్యన్స్ ఉన్నారు చూచావూ? అన్ని విషయాల్లోనూ స్ట్రాంగ్ రష్యన్ వోడ్కా స్ట్రాంగ్, లిటరేచర్ స్ట్రాంగ్, రెవెల్యూషన్ స్ట్రాంగ్ కాని, గరల్స్ మాత్రం చాలా సింపుల్ అంటారు కానీ, ఒక్క సిప్ కొట్టు కాస్త గొంతు కాల్తుంది అంతే, తరవాత ఉంది దాని మజా" అని త్రాగించాడు డెయిజీతో.
డెయిజీ గుండె దడదడలాడింది చమటలొచ్చాయి ఈ పరిస్థితిలో రాజా వస్తే? వస్తే వస్తే? ఏం చేయాలి? తన నిలా పాతాళంలోకి ఎందుకు దింపుతున్నారు? గొంతుదాకా దుఃఖం వచ్చింది ఏం చేయాలో అర్ధం కాలేదు కన్నీరు టప టప రాలింది సూరి మైకం సగం చచ్చింది వెర్రిగా చూచాడు "డెయిజీ, దుఃఖం రెండూ ఒక్కచోట ఉండరానివి, ఎందుకలా ఏడుస్తున్నావ్?" అడిగాడు.