మా : అలా తిరిగొద్దాం పద!
ఇం : పద!
[ఇద్దరూ లేచి వెళ్ళిపోతారు. రచయిత అలిసిపోయినట్లు ప్రవేశిస్తాడు.]
బాధ!.... బాధ! నేను బాధితుడను
అర్ధం లేని ప్రశ్నల్ని అలాగే ఉండనియ్ !
సంధ్యాకాలపు నీడలో
నన్ను విశ్రామించనియ్
వాక్చాతుర్యంవల్ల ప్రయోజనం?
తర్కవితర్కాల వల్ల ప్రయోజనం ?
తర్కించి తర్కంచి అలిసిపోయాను.
నాకు మిగిలిపోయింది బాధ ఒక్కటే
శూన్య నిర్జవ చాయలో పన్ను నిద్రపోనియ్.
[రెండో అంకం సమాప్తం]
తృతీయాంకం
[ఒక టేబుల్ చుట్టూ కూర్చొని అమల్ , విమల్ , కమల్ , చీట్లపేక ఆడుతున్నారు. ముగ్గురూ వాళ్ళ వాళ్ళ మాటలు పూర్తిచేసి పేకముక్కలు వేస్తుంటారు.]
అమల్ : 1947 ఆగష్టు 15వ తేదీన భారతదేశం స్వతంత్ర అయింది.
విమల్ : ఇంగ్లీషు వాడి సామ్రాజ్యావాద పంజాలనుండి. విముక్తి అయింది.
కమల్ : ఇప్పుడు మనం స్వాధీన ఆదర్శ సమాజాన్ని నిర్మించుకోవాలి.
అమల్ : పెట్టుబడిదారీ వ్యవస్ధ నాశనం కావాలి. ఫాసిజం సమాజాన్ని వినాశనంవైపుకు తీసుకుపోతూంది.
కమల్ : కమ్యూనిజం వ్యక్తిస్వాతంత్ర్యానికి గొడ్డలిపెట్టు.
అమల్ : డెమోక్రసీ ద్వారా మార్పుల్ని వెంటనే సాధించలేం.
విమల్ : డెమోక్రసీ అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో శాపంలాగా పరిణమించింది.
కమల్ : సామాన్య మానవుడికి ఏ వ్యవస్ధలోనూ సుఖం వుండదు.
అమల్ : దేశంలో ఎక్కడ చూసినా ఆస్తవ్యస్తం, అరాజకం.
విమల్ : ఈ ప్రభుత్వం లాభంలేదు.
కమల్ : అధికారం హస్తగతం కాగానే అందరూ ఒకటిగానే ప్రవర్తిస్తున్నారు. అందరూ తోడుదొంగలు.
అమల్ : రాజకీయాల్లో వున్న మురికి ఇంకెక్కడా వుండదు.
విమల్ : నా పని - ఏ గూటి చిలక ఆ పాటగా వుంది.
కమల్ : తాతముత్తాతల పేరు నిలబెట్టటానికి, నేను ఎంతో కాలం బ్రతుకననిపిస్తుంది.
అమల్ : ప్రమోషన్ రాలేదు.
విమల్ : క్వార్టరు బొత్తిగా బాగాలేదు.
కమల్ : జీవితం గతుకుల రోడ్డు మీదే నడుస్తోంది.
అమల్ : మా ఇంట్లో జబ్బుగా వుంది.
విమల్ : మావాడు పరీక్ష తప్పాడు.
కమల్ : నాన్నగారు పోయారు.
అమల్ : అందరికీ అన్నీ...
విమల్ : ఛి, ఛి, చీ ...
కమల్ : తస్సాదియ్యా.
అమల్ : విమల్.
విమల్ : కమల్.
కమల్ : అమల్.
అమల్ : విమల్.
విమల్ : కమల్.
కమల్ : అమల్.
[నేపథ్యంలో- "ఏవం ఇంద్రజిత్" అనే మాటలు వినిపిస్తాయి. రచయిత ప్రవేశిస్తాడు.]
అమల్ : ఏమయ్యా కవీ-ఏమిటి విశేషాలు ?
విమల్ : ఏమయ్యా కవీ-ఏమిటి విశేషాలు ?
కమల్ : ఏమయ్యా కవీ-ఏమిటి విశేషాలు ?
రచ : నిన్న ఇంద్రజిత్ ఉత్తరం వచ్చింది.
అమల్ : ఏం రాశాడు?
విమల్ : విదేశం వెళ్ళాడు గదూ ?
కమల్ : ఇంకా తిరిగి రాలేదా?
రచ : పరీక్ష పాసయాడట.
అమల్ : శుభవార్త.
విమల్ : తిరగి రాగానే ఉద్యోగం దోరుకుతుంది. ఇంజనీరింగ్ లైను- చాలా మంచిది.
కమల్ : ఇంకా విదేశ డిగ్రీకి మన దేశంలో చాలా మోజువుంది.
రచ : వింటారా ? ఏం రాశాడో ?
అమల్ : ఆఁ వినిపించు.
విమల్ : చాలా పెద్ద ఉత్తరంలా వుంది.
కమల్ : అయితే నేం?
(రచయిత ఉత్తరం చదువుతూ వుంటాడు. ముగ్గురూ పేక ఆడుతూ వుంటారు మౌనంగా)
రచ : కలకత్తా - భోపాల్ - బొంబాయి- జలంధర్- మిరఠ్- మద్రాసు -లండన్ - గడచిపోయిన కాలరథపుచక్రాలు- గిర్రున తిరుగుతున్నాయి. అయినా చక్రంలా తిరగడం లేదు. ప్రతి ఆవర్తం - క్రొత్తచక్రంలా వేర్ గా తిరుగుతూవుంది. అదే ట్రాజడీ- ఒకదాన్ని పట్టుకొని - పాతదాన్ని పారేస్తున్నాను. మళ్ళీ కొత్తదాన్ని పట్టుకొంటున్నాను. ప్రతిసారీ ఏదో ఆశించని సంఘటన జరుగుతుందని ఆశిస్తూ వుంటాను. తప్పక జరుగుతుంది. దాని ప్రకాశంలో గతాన్ని పూర్తిగా మర్చిపోతాను. మర్చిపోయిన స్వప్నంలా - నిద్రమెలకువ వచ్చినా - ఆ స్వప్నం తాలూకు- మత్తు వదలనట్లూ మర్చిపోతాను. (ఇంతలో ఇంద్రజిత్ వచ్చి, రచయిత ప్రక్కనే నిలుచుంటాడు. అమల్ - విమల్ - కమల్ , పూర్వంలాగే- పేక ఆడుతూ వుంటారు.)
ఇం : కావాలనుకున్నదంతాపొందాను. కాని - ఈ పొందటంలోవున్న , అర్ధహీనతను అర్ధంచేసుకున్నాను. ఇంకా పొందగలననుకోవటం - ఆ పోందినదాన్ని పోగుచేసుకోవటానికి, నాలుగుచేతులు వస్తాయనుకోవటం ఎంత తెలివి తక్కువ. భూత భవిష్యత్తులు ఒకే తాటికి, రెండు చివర్లు. ఒకదానితో ఒకటి కలవదు - లేకపోతే - భవిష్యత్తును చుట్టి గతంలో పారేశేవాణ్ని. వర్తమానం, ఎప్పుడూ, కనీ కనిపించని భవిష్యత్తుకేసే చూస్తూవుంటుంది. అంటే మృత్యువును వరిస్తుంది.
(అంతకుముందే మానసి వచ్చి వింటూంది.)