అంత గొప్ప వీరుడైనా రాముడి చేతిలో రావణుడు ఎందుకు ఓడిపోయాడు? అసలు రహస్యం ఇదే..!
అంత గొప్ప వీరుడైనా రాముడి చేతిలో రావణుడు ఎందుకు ఓడిపోయాడు? అసలు రహస్యం ఇదే..!
హిందూ మత ఇతిహాసాలలో రామాయణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రామాయణం రాముడి గురించి మాత్రమే కాకుండా ప్రతినాయకుడిగా ఉన్న రావణుడి గురించి కూడా ఎన్నో విషయాలు వివరిస్తుంది. రావణుడు ఎంతో గొప్ప వీరుడు, బలసంపన్నుడు, గొప్ప పండితుడు, లంకాధిపతి అని కూడా అంటారు. అంత బలవంతుడు అయినప్పటికీ రావణుడు, రాముడి చేతిలో ఓడిపోయాడు. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? తులసీదాసు రచించిన రామచరిత మానస్ లో దీని గురించి కొన్నిశ్లోకాలు వివరిస్తాయి. వీటి గురించి పూర్తీగా తెలుసుకుంటే..
గోస్వామి తులసీదాస్ రచించిన శ్రీ రామచరిత మానస్ లోని అరణ్యకాండ 22వ శ్లోకంలో ఒక చతుష్పది ఉంది, అదే రావణుడి ఓటమికి అసలు కారణంగా చెప్పబడుతుంది.
చౌపాయీ..
సుర నర అసుర నాగ ఖగ మాహీ ।
మోరే అనుచర కాహు కోఉ నాహీ ॥
ఖర దూషన మోహి సమ బలవంతా ।
తిన్హహి కో మారై బిను భగవంతా ॥ 1 ॥
అర్థం..
దేవతలు, మానవులు, రాక్షసులు, సర్పాలు , పక్షులలో, నా సేవకులను సమీపించగలవారు ఎవరూ లేరు. ఖర, దూషణులు నా అంతటి బలవంతులు, ఏ సాధారణ మానవుడూ వారిని సంహరించలేడు. దీని అర్థం శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారం అని.
శ్రీరాముని చేతిలో రావణుడు ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలలో ఒకటి, విష్ణుమూర్తి చేతిలో మరణించడం ద్వారా మోక్షం పొందాలనే అతని కోరిక.
రావణుడు తన ఓటమిని ఎప్పుడు అంగీకరించాలని అనుకున్నాడంటే..
అరణ్యకాండలో 'హోహి భజాను న తమస్ దేహ' అనే చౌపాయీ ఉంది, ఇది మోక్షం పొందడం కోసం రామునితో యుద్ధం చేయాలని రావణుడు తీసుకున్న నిర్ణయం గురించి తెలియజేస్తుంది.
రావణుడు దీర్ఘంగా ఆలోచించి, తామసిక శరీరం గల రాక్షసుడు దేవుణ్ణి నేరుగా ఆరాధించలేడని, అది తన ధర్మానికి విరుద్ధమని, కానీ తీవ్రమైన శత్రుత్వం ద్వారా మాత్రమే ఆయనను చేరుకోగలడని నిర్ధారణకు వచ్చాడట. ఈ కారణంగానే రావణుడు శ్రీరాముని భార్య అయిన సీతను అపహరించాడని రామచరిత మానస్ లో తులసీదాసు చెబుతాడు.
యోధునిలా పోరాటం..
ఖరదూషణుల తర్వాత అతని కుమారుడైన మేఘనాథుడు మరణించారన్న వార్త విన్న రావణుడు తన ఓటమిని ఊహించాడు. అయినప్పటికీఒక గొప్ప యోధుడిలా శ్రీరాముడిని యుద్ధంలో ఎదుర్కొన్నాడు. రావణుడు తన రథాన్ని అధిరోహించి యుద్ధభూమి వైపు బయలుదేరాడు.
యుద్ధభూమిలో రావణుడు వెంటనే తన బాణాలను లక్ష్మణుడిపై ప్రయోగించి స్పృహ కోల్పోయేలా చేశాడు. చివరకు ఒక మహా యోధునిగా రాముడిని ఎదుర్కొన్నాడు. ఇద్దరూ బలంలోనూ, పరాక్రమంలోనూ సమానులే. అంతిమంగా రావణుడు శ్రీరాముడి చేతిలో ఓడిపోయాడు.
*రూపశ్రీ.