శ్రీకృష్ణుడి శరీర చాయ నీలంగా ఎందుకు ఉంటుంది!
శ్రీకృష్ణుడి శరీర చాయ నీలంగా ఎందుకు ఉంటుంది!
ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని స్థాపించేందుకు మానవ రూపంలో అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దేవకీ గర్భాన జన్మించాడు. ఆ సమయంలో, శ్రీకృష్ణుడి మామ కంసుడు దేవకి ఎనిమిదవ సంతానం చేత చంపబడతాడని ఆకాశవాణి ద్వారా తెలుసుకున్నాడు. కాలక్రమంలో కృష్టుణే తన చెల్లెలి ఏడవ సంతానం అని తెలుసుకున్న కంసుడు శ్రీకృష్ణుడిని చంపడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. ఈ ప్రయత్నాలలోనే కృష్ణుడి శరీర ఛాయ నీలంలోకి మారిందని కొందరి వాదన. దీనివెనుక కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుని, శ్రీకృష్ణుని కృపకు ఇంటి వద్ద చేయవలసిన పరిహారాలు పాటిస్తే ఆ నల్లనయ్య కరుణ అందరిమీద ఉంటుంది.
శరీరం నీలం ఛాయ వెనుక కథనాలు ఇవీ..
కంసుడు రేపల్లెలో ఉన్న నందుని కుమారుడు చాలా లీలలు ప్రదర్శిస్తున్నాడనే విషయం తెలుసుకుని తనను వధించడానికి తన చెల్లెలి గర్భాన పుట్టిన శిశువు ఆ రేపల్లెలోని బాలుడే అనే అనుమానంతో కృష్ణుడిని చంపడానికి పూతన అనే రాక్షసిని పంపుతాడు. పూతన మోసపూరితంగా కృష్టుడికి పాలు తాగించాలని చూస్తుంది. అందులోనూ తన మాయచేత పాలకు బదులుగా విషాన్ని పాలరూపంలో ఇస్తుంది. అయితే శ్రీ కృష్ణ భగవానుడికి పూతన ఉద్దేశం ముందే తెలుసు. అందుకే పాలు తాగే పేరుతో విషాన్ని తాగాడు. కానీ ఆ విషం కృష్ణుడిపై ఎలాంటి ప్రభావం చూపలేదు, కానీ ఆ విషం తాగిన తరువాత పూతనను చంపేశాడు. ఇలా విషం తాగడం వల్ల శ్రీకృష్ణుడి ఛాయ నీలంగా ఉంటుందని ఒక కథనం.
శ్రీకృష్ణుడి నీలం రంగు ఛాయ గురించి మరో కథ కూడా ప్రాచుర్యం పొందింది. పురాణం ప్రకారం, ఒకసారి శ్రీకృష్ణుడు నది ఒడ్డున గోపికలతో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో బంతి యమునా నదిలోకి వెళుతుంది. అప్పుడు కృష్ణుడు బంతిని తీసుకోవడానికి యమునా నదిలోకి వెళతాడు. అయితే కాళీయడు అప్పుడు యమునా నదిలో నివసించేవాడు. కాళీయుడు చాలా విషపూరితమైనవాడు కావడం చేత యమునా నది నీటి రంగు నీలం రంగులోకి ఉంటుంది. ఆ సమయంలో కాళీయుడికి, శ్రీకృష్ణుడికి మధ్య యుద్ధం జరిగిందని అంటున్నారు. ఈ యుద్ధంలో కన్నయ్య గెలిచాడు. అయితే యమునా నదిలో విషం ప్రభావంతో శ్రీకృష్ణుడి శరీరం నీలం రంగులోకి మారిందని అంటున్నారు. ఈ కథనాలు రెండూ శ్రీకృష్ణుని శరీర ఛాయతో ముడిపడినవే.
ఇకపోతే.. శ్రీ కృష్ణుడి కృప కలగడానికి చాలామంది కృష్ణుడిని ఆరాధిస్తారు, పూజిస్తారు, ధ్యానిస్తారు, తమ బాధను కృష్ణుడి ముందు వెళ్లబోసుకుంటారు. కానీ కృష్ణుడి కృప కలగాలంటే ఆరాధించాల్సింది కృష్ణుడిని కాదు. ఆయనకంటే ముందు రాధాదేవిని పూజించాలి. పార్వతీపరమేశ్వరులు అర్థనారీశ్వరులుగా ఎలా ప్రసిద్ది గాంచారో అలాగే రాధాకృష్ణులు కూడా ఎంతో గొప్పవారు. రాధాదేవిని పూజించనిది కృష్ణుడు కరుణించడు. రాధాకృష్ణులను పూజిస్తూ వంటిట్లో ఉండే బిర్యానీ ఆకుతో కొన్ని పరిహారాలు పాటిస్తే ఇంట్లో సమస్యలు తొలగుతాయని నమ్మకం. అవేంటంటే..
రాదాకృష్ణుల పూజ చేసిన తరువాత బిర్యానీ ఆకును కృష్ణుని పాదాల వద్ద ఉంచి ఆ ఆకును పర్సులో ఉంచుకోవాలి. ఇలా చేస్తే పర్సు ఖాళీగా ఉండటం అనే మాట వినిపించదట.
ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే బిర్యానీ ఆకును ఉపయోగించి పరిష్కారం చేయవచ్చని చెబుతున్నారు. దీనికోసం రాధాకృష్ణుల పూజ అనంతరం 3-4 బిర్యానీ ఆకులను తీసుకుని వాటిమీద సమస్యలను ఆ ఆకులపై రాసి ఆ తరువాత ఆ ఆకులను కాల్చేయాలి. ఆకులు కాలిపోయిన తరువాత ఆ బూడిదను పారుతున్న నీటిలో పడేసిరావాలి. ఈ పరిహారం చేసేటప్పుడు ఇంట్లో ఎవరూ ఉండకూడదట.
ఇంటి పరిస్థితులు బాగాలేకపోతే ఇంట్లో బిర్యానీ ఆకును కాల్చి పొగవేసినా, ఆర్థిక ఇబ్బందులు తొలగాలన్నా బిర్యానీ ఆకును పూజ దగ్గర ఉంచి ఆ తరువాత దాన్ని ఇంట్లో భద్రపరచాలి.
ఈ పరిష్కాలు చాలావరకు మానసిక సమస్యలు తొలగిస్తాయి. బిరానీ ఆకు కాలినప్పుడు విడుదలయ్యే రసాయనాలు మెదడులో మానసిక వ్యవస్థను సాధారణం చేస్తుంది. ఈ కారణంగా ఇది సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుంది. దీన్ని దైవంతో ముడిపెట్టడం వలన పాజిటివ్ నెస్ పెరుగుతుంది.
*నిశ్శబ్ద.