జగన్నాథ ఆలయ అతిపెద్ద రహస్యం..  బ్రహ్మపదార్థం తాకగానే పూజారులకు జరిగే అనుభవం..!

 

జగన్నాథ ఆలయ అతిపెద్ద రహస్యం..బ్రహ్మపదార్థం తాకగానే పూజారులకు జరిగే అనుభవం..!


హిందువులు ఒడిశాలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయాన్ని  భూలోకంలో ఉన్న వైకుంఠంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే జగన్నాథ రథయాత్ర భారతదేశంలో  ప్రసిద్ధి చెందింది. భారతదేశ నలుమూలల నుండే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా జగన్నాథ రథయాత్ర వైపు ఆకర్షితులవుతారు.   ఈ చారిత్రాత్మక రథయాత్ర జూలై 16వ తేదీ, గురువారం నాడు ప్రారంభం కానుంది. ఈ ఆలయంతో, రథయాత్రతో   ఎన్నో అద్భుతాలు ముడిపడి ఉన్నాయి, వాటికి ఆధునిక విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత కూడా సమాధానం చెప్పలేవు. కానీ వీటన్నిటిలోకెల్లా అతిపెద్ద , అత్యంత ఆశ్చర్యకరమైన రహస్యం..  బ్రహ్మ పదార్థం,  జగన్నాథుని విగ్రహంలో ఉండే రహస్య పదార్థాన్ని బ్రహ్మ పదార్థం అని అంటారు. దాని హృదయ స్పందనను ఈనాటికీ అనుభూతి చెందవచ్చని అంటారు. ఈ బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహం నుండి కొత్త విగ్రహంలోకి పూజారులు తరలిస్తారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

బ్రహ్మ పదార్థం..

బ్రహ్మ పదార్థాన్ని తాకడమో, మార్చడమో చేయాల్సి వచ్చినప్పుడల్లా, దేవాలయంలోని గొప్ప  పూజారులు సైతం వణికిపోతారట. దీని వెనుక ఉన్న రహస్యం ఎంత లోతైనదంటే.. శతాబ్దాలుగా ఎవరూ దాన్ని ఛేదించలేకపోయారట.

నవకళేబర..

నవకళేబర అని పిలువబడే ఈ రహస్య ప్రక్రియ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ వేడుకలో జగన్నాథుడు, బలభద్రుడు , సుభద్రల పాత విగ్రహాలను తొలగించి, కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఈ ప్రక్రియ జరిగిన రాత్రి, పూరీ నగరం అంతటా విద్యుత్తును నిలిపివేస్తారు. ఆలయ సముదాయం మొత్తం చీకటిలో మునిగిపోతుంది. లోపలికి ఎవరూ తొంగి చూడకుండా నిరోధించడానికి ఆలయం చుట్టూ సైన్యాన్ని లేదా భారీ పోలీసు బలగాలను మోహరిస్తారు. విగ్రహాలకు బాధ్యత వహించే పూజారులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు.

స్పందన..

పాత విగ్రహం  ఛాతీ నుండి బ్రహ్మ పదార్థాన్ని వెలికితీసి, దానిని కొత్త విగ్రహంలోకి ప్రవేశపెడతారు. ఇప్పటి వరకు ఈ ప్రక్రియను పూర్తి చేసిన పూజారులు అద్భుతమైన అనుభవాలను పొందారని చెబుతారు. చేతులకు గ్లౌజులు ఉన్నప్పటికీ ఆ పదార్థాన్ని పట్టుకున్నప్పుడు, ఏదో సజీవమైన దానిని పట్టుకున్నట్లుగా అనిపిస్తుందని పూజారులు చెబుతారు.  ఒక కుందేలు గంతులు వేస్తున్నట్లు, ఒక మనిషి గుండె దడదడలాడుతున్నట్లు అనిపిస్తుందట. అది సాక్షాత్తు దేవుడి గుండెలా అనిపిస్తుందని చెబుతారు.

అసలు రహస్యం..

జగన్నాథుడి రహస్య పదార్థం విషయంలో అందరికీ ఒకే ప్రశ్న తలెత్తుతుంది. ఆ చెక్క విగ్రహం లోపల కొట్టుకుంటున్న  వస్తువు ఏమిటని. దాని చుట్టూ అనేక కథలు, నమ్మకాలు ఉన్నాయి. మహాభారత కాలం తర్వాత కూడా  శ్రీకృష్ణుని హృదయం నశించలేదని, శ్రీకృష్ణుడి  నిజమైన హృదయం ఇదేనని కొందరు నమ్ముతారు.  కొందరు దీనిని శక్తివంతమైన, అద్భుతమైన వజ్రంగా లేదా దైవ లోహంగా భావిస్తున్నారు, నిజం ఏదైనప్పటికీ, నేటి ఆధునిక ప్రపంచంలో కూడా  ఈ రహస్య పదార్థం విజ్ఞాన శాస్త్రాన్ని  సవాలు చేస్తోందని చెబుతారు.

                           *రూపశ్రీ.