శివుడి వివాహ సమయంలో.. ఆయన తండ్రి తాతల పేర్ల గురించి ఏం చెప్పారో తెలుసా.!
శివుడి వివాహ సమయంలో.. ఆయన తండ్రి తాతల పేర్ల గురించి ఏం చెప్పారో తెలుసా.!
శివుడిని ఆది దేవుడు అని కూడా పిలుస్తారు. ఆయన ప్రళయ కారకుడు.. అన్నింటిని తనలో లీనం చేసుకునే వాడు. అయితే దేవుడికైనా సరే.. పెళ్లి చేసేటప్పుడు కొన్ని నియమాలు, పద్దతులు తప్పవట. వివాహం సమయంలో వరుడు తన తండ్రి, తాత, ముత్తాతల పేర్లు చెప్పాల్సి ఉంటుంది. పరమేశ్వరుడు కూడా తన వివాహ సమయంలో ఈ ప్రశ్నలు ఎదుర్కున్నాడు. అయితే పరమేశ్వరుడు ఇచ్చిన జవాబు మాత్రం చాలా అద్బుతమైనది. దీని గురించి పురాణ గ్రంథాలలో కూడా ఉంది. శివుడు తన వివాహ సమయంలో తండ్రి, తాతల పేర్ల గురించి ఏం చెప్పాడో తెలుసుకుంటే..
వివాహం సమయంలో వంశం గురించి..
వివాహ సమయంలో వరుడిని తండ్రి, తాత, ముత్తాత.. ఇలా వంశం గురించి అడుగుతారు. అలా అడిగినప్పుడు వారి వంశంలో ఉన్న వారి పేర్లు చెప్పాలి. అయితే శివుడి వివాహ సమయంలో కూడా ఇలా సందర్బం వచ్చింది. శివుడని మీ తండ్రి ఎవరు? మీ తాత ఎవరు? మీ ముత్తాత ఎవరు అని అడిగారట.
బ్రహ్మ..
శివుడిని మీ తండ్రి ఎవరు అని అడిగితే.. బ్రహ్మ దేవుడే నా తండ్రి అని చెప్పారట.
విష్ణువు..
శివుడిని వివాహ సమయంలో బ్రహ్మ మీ తండ్రి అయితే.. మీ తాత ఎవరు అని అడిగారట. "ఈ విశ్వాన్ని పోషించే విష్ణుమూర్తి నా తాత" అని సమాధానం ఇచ్చాడట.
ముత్తాత..
వివాహ సమయంలో శివుడు తండ్రి, తాతల గురించి సమాధానం ఇచ్చేసరికి.. పెళ్లి కూతురికి ఉత్సాహం ఆగలేదట.. దాంతో.. మీ తండ్రి బ్రహ్మ, మీ తాత విష్ణు మూర్తి అయితే.. మీ ముత్తాత ఎవరు అని అడిగారట. ఆ ప్రశ్న వినగానే శివుడు గట్టిగా నవ్వి.. ఆప్యాయంగా మాట్లాడుతూ.. "నేను అందరికీ ముత్తాతను" అని బదులిచ్చాడట. అప్పటి నుండే శివుడిని దేవదేవుడు, మహాదేవుడు అని పిలుస్తున్నారని చెబుతారు.
శివపురాణంలో కథనం..
శివ పురాణంలో శ్లోకం..
న జానే పరమం స్థానం న జానే తవ జన్మ తతః।
మహేశ్వర నమస్తుభ్యం త్వమేవ శరణం మమ॥
అర్థం..
"ఓ మహేశ్వరా! నీ అంతిమ నివాసం నాకు తెలియదు, నీ అసలు రూపం కూడా నాకు తెలియదు. నీవే నా ఏకైక శరణ్యం కాబట్టి నీకు నమస్కరిస్తున్నాను." అని శ్లోక అర్థం.
సృష్టి వినాశనాలకు అతీతమైన, శాశ్వతమైన, మార్పులేని చైతన్యానికి శివుడే మూలం , అంతం. అందుకే శివుడిని దేవతలలోకెల్లా గొప్పవాడైన మహాదేవుడు అని మాత్రమే కాకుండా, ఆదియోగి అని కూడా పిలుస్తారట. సమస్త దైవిక , విశ్వ శక్తులు ఉద్భవించే సర్వోన్నత చైతన్యానికి ఆయన ప్రతీక.
లింగ రూపంలో పూజ అందుకే..
శివుడిని మానవ రూపంలో కాకుండా, అనంతమైన శక్తికి . సృష్టికి ప్రతీక అయిన శివలింగ రూపంలో పూజిస్తారు. ఇది శివుని ఆదియోగి స్థానానికి ఒక ప్రధాన ఉదాహరణ అని చెబుతారు. ఆయనను దేవతలు, రాక్షసులు ఇద్దరూ పూజిస్తారు. అందువల్ల, శివుడు కాలానికి, రూపానికి, పరిమితులకు అతీతంగా ఉంటాడని అంటారు.
గమనిక.. సోషల్ మీడియాలో భక్తి, ఆధ్యాత్మిక వార్తల నుండి సేకరించిన సమాచారం ఇది.
*రూపశ్రీ.