పితృదేవతలకు మోక్షాన్ని ప్రసాదించగల ఈ ప్రదేశాల గురించి తెలుసా..
పితృదేవతలకు మోక్షాన్ని ప్రసాదించగల ఈ ప్రదేశాల గురించి తెలుసా..
హిందూ మతంలో మరణించిన వారి ఆత్మల శాంతి, సంతృప్తి కోసం శ్రద్ధా సంస్కారం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. పిండ దానం ఎక్కడ చేయాలో , ఎక్కడ చేస్తే మరణించిన పెద్దల ఆత్మ శాంతిస్తుందో అని చాలా మంది గందరగోళానికి గురవుతూ ఉంటారు. కొందరు తమ సంప్రదాయం ఆధారంగా ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచిస్తూ చాలా అయోమయంలో ఉండిపోతారు. అయితే భారతదేశంలో పితృదేవతలకు మోక్షాన్ని ప్రసాదించగల మోక్షమార్గాలు 13 ఉన్నాయి. ఈ ప్రదేశాలలో పితృదేవతలకు శ్రాద్దకర్మలు నిర్వహించడం, తర్పణాలు వదలడం చేస్తే మోక్షం లభిస్తుందట. అవేంటో తెలుసుకుంటే..
బ్రహ్మ కపాలం..
ఈ ప్రదేశం హిమాలయ పర్వతంపై ఉన్న బద్రీ ధామ్‌లో ఉంది. దీనిని వైకుంఠ ధామ్ అని కూడా పిలుస్తారు. మహాభారతం తర్వాత పాండవులు తమ పూర్వీకులందరి పిండ దానాన్ని ఇక్కడే నిర్వహించారని నమ్ముతారు. అలకనంద నది ఒడ్డున ఉన్న బద్రీనాథ్ ధామ్‌లో ఉన్న బ్రహ్మ కపాలంలో పింఢ దానాన్ని చేయడం వల్ల పూర్వీకులు మోక్షాన్ని పొందుతారు. ఇది పింఢ దానానికి అత్యున్నత ప్రదేశంగా పరిగణించబడుతుంది.
పూరి..
దీనిని ఆది గురు శంకరాచార్యులు స్థాపించారు. ఇది ప్రధాన తీర్థయాత్ర స్థలాలలో ఒకటిగా కూడా పరిగణించబడుతుంది. కాబట్టి ఇక్కడ పిండదానం చేయడం వల్ల పూర్వీకులకు శాంతి లభిస్తుంది.
ఓంకారేశ్వర్..
ఈ ప్రదేశం నర్మదా నది ఒడ్డున ఉంది. బ్రహ్మ-విష్ణు-మహేశ్వరుల నివాసంగా నమ్ముతారు. ఇక్కడ పూర్వీకులు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు.
పుష్కర్..
రాజస్థాన్‌లో ఉన్న పుష్కర్‌ను తీర్థయాత్రల రాజు అని కూడా పిలుస్తారు. ఇక్కడ పిండదానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ పిండదానం చేస్తే లక్షలాది యాగాలకు సమానమైన పుణ్యం లభిస్తుందని చెబుతారు.
హరిద్వార్..
ఇది పవిత్ర తీర్థయాత్ర స్థలం. ఇక్కడ హర్ కి పౌరి వద్ద నివాళులు అర్పించడం ఆచారం. ఇక్కడ పిండదానం చేయడం వల్ల పూర్వీకులకు మోక్ష మార్గం తెరుచుకుంటుందని నమ్ముతారు.
ప్రయాగ్‌రాజ్..
గంగ-యమునా-సరస్వతి అనే మూడు పవిత్ర నదుల సంగమం ఇక్కడ జరుగుతుంది. ఇది భరద్వాజ భగవానుని తపోక్షేత్రం. ఈ సంగమంలో పిండదానంకు చాలా ప్రాముఖ్యత ఉంది.
పశుపతినాథ్..
నేపాల్‌లోని గండకి నది ఒడ్డున ఉన్న భగవంతుని నివాసం ఇది. కపిల భగవానుడు ఈ నివాసం ప్రాముఖ్యతను వివరించాడు. ఇక్కడ పిండదానాన్ని చేయడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారు.
ద్వారక..
శ్రీ కృష్ణుడి పవిత్ర భూమి అయిన ద్వారకలో పిండదానం నిర్వహిస్తారు. శ్రీ కృష్ణుడు కూడా ఇక్కడే మోక్షాన్ని పొందాడని చెబుతారు. కాబట్టి ఇక్కడ పిండదానం చేయడం ద్వారా పూర్వీకులు కూడా మోక్షాన్ని పొందుతారు.
నాసిక్..
దీనిని కుంభ క్షేత్రం అంటారు. అమృత చుక్కలు ఇక్కడ పడ్డాయి. పిండదానాన్ని కూడా ఇక్కడ చేయవచ్చు.
మహాకాళ్..
ఉజ్జయిని నగరంలోని శిప్రా నది ఒడ్డున శివుడు తపస్సు చేసిన ప్రదేశం ఉంది. ఇక్కడి నుండి నేరుగా మహాకాళ్ పాదాలను చేరుకోవచ్చు. ఇక్కడ పిండదానం చేస్తే పూర్వీకులు మోక్షాన్ని పొందుతారని చెబుతారు.
రామేశ్వరం..
రామేశ్వరాన్ని శ్రీరాముడు స్థాపించాడు. ఇక్కడ శ్రీరాముడు శివుని గురించి తపస్సు చేశాడు. దీని కారణంగా ఇది పూర్వీకులకు మోక్షాన్ని ఇస్తుంది.
కైలాస మానస సరోవరం..
శివుని పవిత్ర స్థలంలో పిండ దానం చేయడం వల్ల పూర్వీకులు నేరుగా కైలాసాన్ని చేరుకుంటారు. దీనితో పాటు, బృందావన భూమి కూడా పిండ దానానికి అనువైనదిగా పరిగణించబడుతుంది.
గయ..
మత గ్రంథాల ప్రకారం విష్ణుపాదం గయలోని 54 పీఠాలలో మొదటిది. దానిని చూడటం ద్వారానే పూర్వీకులు నారాయణులు అవుతారట. ఫల్గు నదిలో స్నానం చేసి తర్పణం వదలడం ద్వారా పూర్వీకులు దేవతల హోదాను పొందుతారు. గయలో శ్రాద్దకర్మలు, పిండ ప్రదానం చేయడం ద్వారా ఏడు తరాల పూర్వీకులు మోక్షాన్ని పొందుతారని హిందూ ధర్మ విశ్వాసం.
*రూపశ్రీ.