శనిదోషం వెంటాడుతోందా...శనివారం ఈ ఒక్క స్తోత్రం వింటే అద్బుత ఫలితాలుంటాయి..!
శనిదోషం వెంటాడుతోందా...శనివారం ఈ ఒక్క స్తోత్రం వింటే అద్బుత ఫలితాలుంటాయి..!
శనిదేవుడిని న్యాయ ప్రదాత అని అంటారు. మనిషి చేసే మంచి చెడుల కారణంగా ఏర్పడే కర్మలను ఎలాంటి పక్షపాతం లేకుండా అమలుపరిచేవాడు శనిదేవుడు. అయితే చాలా మందికి శనిదోషం ఉంటుంది. దీని వల్ల జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే శని దేవుడి అనుగ్రహం ఉంటే.. ఎంతటి కష్టాన్ని అయినా నొప్పి తెలియకుండా దాటేలా చేస్తాడు. అసలు శనిదోషం ఉందని ఎలా తెలుస్తుంది? ఈ శనిదోషం ప్రభావం తగ్గాలంటే ఏం చేయాలి? శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి? తెలుసుకుంటే..
శని దోషం..
జ్యోతిష్యం ప్రకారం గ్రహ స్థితిలో శని గ్రహం అనుకూలంగా లేకపోతే దాన్ని శనిదోషం అని అంటారు. శనిదేవుడు కర్మ ఫలితాన్ని సాధారణంగా రెండు విధాలుగా ఇస్తాడు. ఒకటి అనారోగ్యం, రెండు సంబంధాల మధ్య గొడవలు, ఇబ్బందులు. వీటిని అధిగమించి జీవితంలో ఇబ్బందులు కలగకూడదు అంటే శని దేవుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన స్తోత్రం ఉంది. ఈ స్తోత్రాన్ని ప్రతి శనివారం, శనిత్రయోదశి లాంటి తిథి లేదా ప్రతి రోజూ పఠిస్తూ ఉంటే శనిదేవుడి అనుగ్రహం వల్ల శని దోషం ప్రభావం తగ్గి.. పెద్ద పెద్ద బాధలు, సమస్యలకు బదులుగా చిన్న సమస్యలతో శనిదోషకాలం గడిచిపోతుంది. ఇంతకీ అంత శక్తివంతమైన స్తోత్రం ఏమిటంటే.. శని వజ్రపంజర కవచం. ఈ కవచాన్ని శని దేవుడి తండ్రి అయిన సూర్యభగవానుడు ప్రసాదించాడు.
ఈ స్తోత్ర ప్రత్యేకత..
సాధారణంగా కవచం అంటే రక్షణ కల్పించేది. చాలా దేవుళ్లు, దేవతల కవచాలు ఉన్నాయి. అలాగే శనిదేవుడి వజ్రకవచం వల్ల శనిదోషం తొలగి చాలా సమస్యలు చిన్నవిగా తొలగిపోతాయి. ఈ వజ్రకవంచంలో శరీరంలోని వివిధ అవయవాలను ప్రస్తావిస్తూ.. ఆయా అవయవాలకు రక్షణ కల్పించమంటూ శనిదేవుడిని ప్రార్థించడం జరుగుతుంది. దీని వల్ల చాలా వరకు అనారోగ్యాలకు దూరంగా ఉండటం జరుగుతుంది. ఇక కర్మ బంధాలు ఏవైనా ఇబ్బంది పెడుతున్నా.. శని వజ్ర పంజర స్తోత్రం పారాయణ చేస్తూ.. ఎవరికైనా తెలిసి కానీ తెలియక కానీ కీడు చేసి ఉంటే.. నా తప్పులు ఉంటే మన్నించు స్వామి.. నేను ఇకమీదట ధర్మబద్దంగా ఉంటాను అని శనిదేవుడి ముందు చెప్పుకుని, ధర్మంగా జీవిస్తూ ఉంటే.. చాలా వరకు సమస్యలు అన్నీ మెల్లిగా తగ్గుముఖం పడతాయి. ఒకవేళ సమస్యలు ఉన్నా.. వాటి తాలూకు బాధ మనిషిని మరీ అంత బాధపెట్టకుండా ఉండేలా శనిదేవుడు చేస్తాడు.
కాబట్టి శనిదేవుడికి సంబంధించిన అద్భుతమైన శని వజ్రపంజర కవచాన్ని చదివి సమస్యల నుండి పడవచ్చు.
*రూపశ్రీ.