వాస్తులో తూర్పున లేదా ఉత్తరాన పెద్ద భవనం ఉంటే... (Vastu – East West – big building)

 

వాస్తులో తూర్పున లేదా ఉత్తరాన పెద్ద భవనం ఉంటే...

(Vastu – East West – big building)

 

వాస్తులో మన ఇంటికి చెందిన నియమాలు మాత్రమే కాదు, పక్కనున్న ఇళ్ళు, రోడ్లకు సంబంధించి కూడా కొన్ని సూత్రీకరణలు ఉన్నాయి. ఇంటికి తూర్పు దిక్కునున్న నిర్మాణం మనదానికంటే పెద్దదిగా ఉంటే, అప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం.

 

తూర్పువైపున మన ఇంటికంటే పెద్ద భవనం గనుక ఉన్నట్లయితే మామూలు వాస్తు నియమాల ప్రకారం వదలాల్సిన ఖాళీస్థలం కంటే కనీసం అయిదు అడుగుల జాగాను అదనంగా వదలాలి. ఒకవేళ తూర్పున మాత్రమే గాక, పశ్చిమాన కూడా పెద్ద నిర్మాణమే ఉంటే... (తూర్పున ఉన్న భవనం అంత లేదా అంతకంటే పెద్దది అయిన నిర్మాణం) ఈ సూత్రం వర్తించదు. అంటే తూర్పు, పడమర – రెండు దిక్కులలోనూ మన ఇంటికంటే ఎత్తయిన భవనాలు ఉంటే దోషం లేదు. తూర్పున మాత్రమే ఉంటే, కొంత స్థలం వదలడం ద్వారా దోష నివారణ చేసుకోవచ్చు.

 

అలాగే ఉత్తర దిక్కున మన ఇంటికంటే పెద్దదయిన భవనం ఉంటే తూర్పువైపున చెప్పినట్లే మామూలుగా వాస్తు నియమం ప్రకారం వదలాల్సిన జాగా కంటే అయిదు అడుగుల అదనపు స్థలాన్ని వదిలిపెట్టాలి.

 

ఉత్తరాన మన ఇంటి కంటే పెద్ద భవనం ఉన్నప్పుడు దక్షిణ నైరుతిలో ఉపగ్రహం నిర్మించాలి.

 

దక్షిణ ప్రహరీ గోడకి ఒక అరుగు కట్టాలి.

 

ఇంటికి దక్షిణాన రోడ్డు గనుక వచ్చినట్లయితే, సరిగ్గా ఈ నియమాలే వర్తిస్తాయి.

 

ఒకవేళ ఇంటికి దక్షిణాన గనుక ఉత్తరదిక్కున ఉన్న భవనంతో సమానమైన లేదా అంతకంటే పెద్దదైన భవనం ఉంటే అప్పుడు అదనపు ఖాళీ స్థలం వదలాల్సిన అవసరం లేదు.