అద్దె ఇళ్ళకు వాస్తు చూడాలా? (Vastu – Rented Homes)

 

అద్దె ఇళ్ళకు వాస్తు చూడాలా?

(Vastu – Rented Homes)

 

సొంత ఇల్లు మాత్రమే ఇల్లు కాదు. మనం నివసిస్తున్నాం కనుక అద్దె ఇల్లయినా మనదే. కొనుక్కున్న ఇల్లు, అద్దె చెల్లిస్తున్న ఇల్లు, లేదా ఉచితంగా కొన్నాళ్ళపాటు ఏ బంధుమిత్రుల నివాసంలోనో ఉండటం అయినా కావచ్చు.. డానికి సంబంధించిన వాస్తు మనకు వర్తిస్తుంది.

గృహ వాస్తు ప్రభావం కుటుంబంలో అందరిమీదా ఉంటుంది. ముఖ్యంగా ఇంటి యజమానిమీద మరింత తీవ్రంగా ఉంటుంది. అద్దెకు ఇల్లు తీసుకునేటప్పుడు అద్దె చెల్లించగలిగేలా ఉందా లేదా అని మాత్రమే చూస్తారు చాలామంది. కానీ, అంతటితో సరిపోదు. అద్దెతో బాటు వాస్తు ఎలా ఉందో కూడా చూసుకోవాలి. వాకిలి ఎటు ఉంది, వంటిల్లు, పూజగది, స్నానాల గది మొదలైనవి ఉండాల్సిన వైపే ఉన్నాయా లాంటివి చూసుకోవాలి.

ఇల్లు కొనుగోలు చేసేటప్పుడే వాస్తు శిల్పికి చూపి, వాస్తు సరిగ్గా ఉందో, లేదో తెలుసుకోవాలి. అద్దె ఇంటి విషయంలోనూ వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించాలి. ముందు జాగ్రత్త లేనట్లయితే, తర్వాత ఇబ్బందులు తప్పవు.

ఒకవేళ కొనుక్కున్న ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని తర్వాత తెలిస్తే, వెంటనే సరిచేయించుకోవడం మంచిది. ఆ దోషాలను అలా వదిలేసి, మార్గాంతరంగా ఇంకో అద్దె ఇంటికి వెళ్ళినా ఆ ప్రభావం ఉంటుంది. పైగా అద్దె ఇంట్లో కూడా దోషాలు ఉంటే ఇక రెండు దుష్ప్రభావాలూ కలిసి మరింత చెడు పరిణామాలు చోటుచేసుకుంటాయి.

 

 

 

More Related to Vastu