తిరుమల వేంకటేశ్వరునికి తోమాలసేవ (Tirumala Venkateswara Tomala Seva)

 

తిరుమల వేంకటేశ్వరునికి తోమాలసేవ

(Tirumala Venkateswara Tomala Seva)

 

తిరుమల ఏడుకొండల స్వామి ఆలయంలో ప్రతిరోజూ శుద్ధి కార్యక్రమం పూర్తికాగానే తోమాలసేవ ఉంటుంది. శుక్రవారం నాడు మాత్రం స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత తోమాలసేవ నిర్వహిస్తారు. తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలో ధ్రువబేరం మూలవిరాట్టుకు (Main Idol of Tirumala Sri Venkateswara, Dhruvaberam), కౌతుక బేరం భోగ శ్రీనివాసమూర్తి (Bhoga Srinivasa Murthy, Koutukaberam), స్నపన బేరం ఉగ్ర శ్రీనివాసమూర్తి (Ugra Srinivasa Murthy, Snapanaberam), ఉత్సవబేరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి (Sridevi, Bhoodevi Sameta Malayappa Swami, Utsavaberam), బలిబేరం కొలువు శ్రీనివాసమూర్తి (Koluvu Srinivasa Murthy, Baliberam) విగ్రహాలను వివిధ రకాల పుష్పమాలలు, తులసి మాలలతో అలంకరిస్తారు. జీయంగారు పుష్పశాల నుండి తెచ్చిన పూలమాల;లను అర్చకులు మూలవిరాట్టుకు భక్తిగా అలంకరిస్తారు.

 

తోమాలసేవ అరగంట పాటు జరుగుతుంది. మంగళ, బుధ, గురువారాల్లో తోమాలసేవను ఆర్జితసేవగా నిర్వహిస్తారు. తక్కిన రోజుల్లో ఏకాంతసేవలో భాగంగా తోమాలసేవ నిర్వహిస్తారు. వేంకటేశ్వరునికి జరిగే తోమాలసేవను ''భగవతీ ఆరాధన'' అని కూడా అంటారు. తోమాలసేవ (Tomala Seva) అంటే స్వామివారికి పూలమాలలు అలంకరించి అర్చించడం. ''తోడుత్తమలై'' అనే తమిళ పదం ఆధారంగా ''తోమాల'' పదం ఉద్భవించి ఉంటుంది అంటారు భాషా శాస్త్రాలను అధ్యయనం చేసిన పండితులు. తమిళ పదం ''తోడుత్తమలై'' అంటే సుమాలతో కట్టిన మాల అని అర్థం.

 

రుసుము చెల్లించి టికెట్టు కొనుక్కున్న భక్తులు తిరుమల వేంకటేశ్వరుని పుష్పమాలలతో అలంకరించి సేవించే తోమాలసేవను తిలకించవచ్చు.

 

Tirumala Venkateswara Tomala Seva, Rituals in Tirumala, Rituals of Lord Venkateswara, daily sevas in tirumala, weekly sevas in tirumala, tomalaseva, suddhi and tomalaseva