తిరుమలలో సర్వదర్శనం (Tirumala Venkateswara Sarvadarsanam)
తిరుమలలో సర్వదర్శనం
(Tirumala Venkateswara Sarvadarsanam)
తిరుమలలో భక్తులు శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకోడాన్ని''సర్వదర్శనం'' (Viewing of the Deity for all) అంటారు. ''సర్వదర్శనం'' అంటే అందరికీ దర్శనం అని అర్ధం. కొన్ని సంవత్సరాలుగా విపరీతమైన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, స్వామివారి దర్శనం కోసం ''సుదర్శన్'' టోకెన్ పద్ధతిని ఏర్పాటు చేశారు. తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకోవాలనుకున్నవారు ముందుగా తిరుమలలో రద్దీ ఎలా ఉందో తెలుసుకుని, ఆ తర్వాత ప్రయాణం పెట్టుకోవడం ఉత్తమం. ప్రయాణపు తేదీ నిర్ణయించుకున్న తర్వాత ''సుదర్శన్'' టోకెన్ తీసుకుంటే దర్శనం సులువు అవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంవారు కేటాయించిన సమయానికంటే ఐదారు గంటలు ముందుగా ''సర్వదర్శనం'' క్యూ చేరుకోవాలి.
సర్వదర్శనం సాధారణంగా ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకూ ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఏడు గంటలవరకూ ఉంటుంది. మళ్ళీ ఒక గంట విరామం తర్వాత రాత్రి ఎనిమిది గంటల నుండి పదిన్నర వరకూ కొనసాగుతుంది. సాధారణ రోజుల్లో సర్వదర్శనం (Viewing of the Deity for all) ఇలా రోజుకు 14 గంటల చొప్పున ఉంటుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో సర్వదర్శనం 18 నుండి 20 గంటలకు పొడిగిస్తారు.
Sarvadarshanam, Tirumala Sarvadarshanam, Tirumala Venkateswara Sarvadarshanam, Viewing of the Deity for all, Sarvadarshan Que, Vaikuntam Queue Complex, Special Entry Darshan, Seeghra Darshan, Divya Darshan, Sarvadarshan Timings