తిరుమలలో రాత్రి కైంకర్యాలు (Tirumala Ratri Kaimkaryalu)
తిరుమలలో రాత్రి కైంకర్యాలు
(Tirumala Ratri Kaimkaryalu)
తిరుమల వేంకటేశ్వర ఆలయంలో ఉదయం జరిపే తోమాలసేవ, రాత్రిపూట కూడా జరుపుతారు. ఆ సేవ అనంతరం స్వామివారికి హారతి ఇచ్చి అష్టోత్తర శతనామార్చన చేస్తారు. శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీ నామార్చన జరుపుతారు. ఆ సమయంలో మూడో గంట మోగిస్తారు. అప్పుడు నైవేద్యాన్ని సమర్పిస్తారు. అనంతరం సర్వదర్శనం తిరిగి ప్రారంభమౌతుంది.
తిరుమలలో అష్టోత్తర శతనామార్చన
(Tirumala Ashtottara Shatanamarchana)
తిరుమల వేంకటేశ్వర ఆలయంలో స్వామివారికి మధ్యాహ్నం జరిపే పూజల్లో మొదటిది అష్టోత్తర శతనామార్చన. ''వరాహపురాణం''లో వేంకటేశ్వరుని స్తుతిస్తూ రాసిన 108 నామావళిని అర్చకులు పఠిస్తారు. అష్టోత్తర శతనామార్చన పూర్తయిన తర్వాత శ్రీదేవి, భూదేవి రూపాలకు లక్ష్మీనామార్చన చేస్తారు.
Tirumala Rituals, Tirumala Sevas, Tirumala Ashtottara Shatanamarchana, Tirumala Ratri Kaimkaryalu, Tirumala Srivari Seva, Tirumala Lakshmi Namarchana, Tirumala Venkateswara Namavali