Read more!

తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు

 

తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు

 

 

 

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిక కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం ఉదయం సర్వాలంకార భూషితురాలై పెద్దశేషవాహనంపై మాడా వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. తెల్లవారుజామున 4గంటలకు అమ్మవారికి సుప్రభాత సేవతో మేల్కోలిపి నిత్యార్చన, శుద్ది, కైంకర్య పూజల వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉదయం 7 గంటలకు అమ్మవారి ఉత్సవ మూర్తిని వాహన మండపంలో పెద్ద శేషవాహనంపై అధిరోహింపచేసి కంకణభట్టు తిరుమాలాచారి ఆధ్వర్యంలో ఆలయ వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య సాంప్రదాయబద్దంగా అలంకరించారు.

 

 

 


అనంతరం అమ్మవారిని తిరుమాడావీధుల్లో విహరింపజేశారు. ఈ సందర్భంగా అమ్మవారి వాహన సేవకు ముందుగా గజములు, అశ్వాలు సైన్యంగా కదులుతుండగా భక్తులు చేసే భగవన్నామ స్మరణలు, కోలాటాలు, వాయిద్యాలతో తిరుచానూరు మారుమొమోగింది. భక్తులు మాడావీధుల్లో బారులు తీరి మంగళహారతులు పలికారు. పద్మావతీమాతకు కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. శేషుడు లక్ష్మీసహితుడైన శ్రీవారికి దాసుడిగా సఖుడిగా శయ్యగా, సింహాసనంగా, చత్రంగా, సమయోచితంగా సేవలు అందించే పెద్దశేషుని వాహనంపై అమ్మవారు విహరిస్తూ అలమేలు మంగమ్మకు వాహనమై తన విశేష, జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేశారు