తిరుప్పావై పాశురం 1 (చక్రవర్తుల రంగనాథ్)
తిరుప్పావై మొదటిరోజు పాశురం
తిరుప్పావై
1. పాశురము :
*మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్
కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్
కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱై దరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !
భావము : సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా~ మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరిమును, చంద్రునివలె ఆహ్లాదకరుడును, సూర్యునివలె తేజోమయుడును యైన నారాయణునే తప్పు, యితరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును ఆలసింపక శ్రీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించుచున్నది.
తిరుప్పావైగీతమాలిక
అవతారిక:
వ్రతము చేయుటకు అనువైన సమయము, మాసము - మార్గశీర్షమాసము. కనుక భాగత్సంశ్లేషము కోరే భక్తులందరను వ్రతము చేయగా మార్గళి స్నానం చేదురు, రండీ! అని గోదాదేవి ఆహ్వానిస్తున్నది.
1వ మాలిక
(రేగుప్తి రాగము -ఆదితాళము)
ప.. శ్రీ గోకుల వాసులారా! - సిరికన్నియలార!
భావతాపము దీర్చుకొనగ - వ్రతము చేయరండి!
అ.ప.. మార్గశీర్ష మాసమెంతో - మంచిది కద! రండి!
మనసు పడిన వారెల్లరు -మార్గళి నీరాడ రండి!
1. చ.. ఆపద శంకించి కాచు - ఆనందుని తనయుని
యశోదమ్మ యొడి యాడెడు - ఆ బాల సింహుని
నీలమేఘశ్యాముని - ఇన శశి సమవదమని
నారాయణు గొలువనిపుడు - నరుల బొగడ రండి
2. ఛ. ఈ నోమును నోచు మనము - ఇతరములను కోరము
పర సాధన మొసగెడి మన - పరమాత్ముడే, సర్వము
లోకమంత పొగడగ నీ - నోము మనము నోచెదము
మనసు పడిన వారెల్లరు - మార్గళి నీ రాడరండి.
- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్
- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్
- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్
- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్
శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్