జీవితాన్ని మార్చే 42రోజుల శివాలయ దర్శనం.. ఈ నియమాలు తప్పనిసరి!
జీవితాన్ని మార్చే 42రోజుల శివాలయ దర్శనం.. ఈ నియమాలు తప్పనిసరి!
భారతదేశంలో శైవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఊరిలో ఒక శివాలయం తప్పనిసరిగా కనబడుతుంది. శివుడిని భోళా శంకరుడు అని పిలుస్తారు. శివుని ఆరాధన చాలా సువులుగా ఉంటుంది. ఎన్నెన్నో ఉపచారాలు, హడావిడి లేకుండా సులువుగా శివుడి పూజ చేయవచ్చు. కానీ కావాల్సిందల్లా కేవలం చిత్తశుద్ది. స్వచ్చమైన మనసు, నిర్మలమైన భక్తి. ఇవన్నీ ఉంటే పరమేశ్వరుడు భక్తుడిని తప్పక అనుగ్రహిస్తాడని చెబుతారు. జీవితంలో ఎన్నో సమస్యలతో, ఏ పనులు తలపెట్టినా ఆటంకాలు ఎదురవుతూ ఉన్నప్పుడు శివాలయ దర్మనం చేసుకుంటే ఎంతో మంచి ఫలితం ఉంటుందని చెబుతారు. చాలామంది 42రోజుల శివాలయ దర్శనం చేస్తే ఎంతో గొప్ప ఫలితం ఉంటుందని చెబుతారు. అయితే దీనికోసం చేయాల్సిందేంటి? ఏ నిమయాలు పాటించాలి? తెలుసుకుంటే..
42రోజుల శివాలయ దర్శన నియమాలు..
శివాలయ దర్శనానికి వెళ్లాలి అనుకునేవారు ముందురోజే సంకల్పం చేసుకోవాలి. అలాగే ముందురోజే ధూమపానం. మద్యపానం మానేయాలి. మాంసాహారం తీసుకోవడం ఆపేయాలి. భారీ భోజనం కాకుండా మితంగా బోజనం చేయాలి. ఇదే విధంగా 42 రోజులు చేస్తానని నిర్ణయం తీసుకోవాలి. ఆ రోజు రాత్రి నిద్రపోవాలి.
మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే స్నానం చేసి విభూతి దరించాలి. ఇంట్లో ఉన్న దేవుడికి నమస్కారం చేసుకోవాలి. ఆ తరువాత శివాలయానికి వెళ్లాలి.
42రోజుల శివాలయ దర్శనం ప్రదోష కాలంలో చేసుకోవడం మంచిది. ప్రదోషకాలం అంటే.. సూర్యాస్తమయానికి అటు ఇటు 45 నిమిషాల సమయంతో మొత్తం 1గంట, 30నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అని అంటారు. ఈ సమయంలో శివాలయ దర్శనం చాలా మంచిది.
శివాలయానికి వెళ్లాక అక్కడ ప్రదక్షిణ చేయడం చాలా ముఖ్యం. ప్రదక్షిణలు చాలా వేగంగా కాకుండా.. గర్బం దాల్చిన మహిళలు ఎలాగైతే చాలా నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ నడుస్తారో.. అలా నెమ్మదిగా మూడు ప్రదక్షిణలు వేయాలి. ప్రదక్షణ చేస్తున్నంత సేపు శివ నామ స్మరణ, మృత్యుంజయ మంత్రం లేదా పంచాక్షరీ వంటివి జపం చేయడం మంచిది.
ప్రదక్షిణలు చేసిన తర్వాత లోపలికి వెళ్లి శివలింగ దర్శనం చేసుకోవాలి. ఎంతసేపు వీలైతే అంతసేపు శివలింగాన్ని చూస్తూ దర్శనం చేసుకోవడం మంచిది. శివాలయంలో కానీ, ప్రదక్షిణలు వేసేటప్పుడు కానీ, శివలింగాన్ని చూసేటప్పుడు కానీ ఎలాంటి కోరకి కోరకూడదు. మనిషికి ఉన్న సమస్యలు ఏవో ఆ పరమేశ్వరుడికి తెలుసు. ఆయనే సమస్యలను తీసేస్తాడు. కేవలం నమ్మకంతో 42రోజులు శివాలయ దర్శనం చేయాలి.
శివలింగ దర్శనం తర్వాత కనీసం 10నిమిషాల సేపు శివాలయ ప్రాంగణలో కూర్చోవాలి. ఇది మనసును ప్రశాంతంగా మారుస్తుంది.
పైన చెప్పుకున్న విధంగా 42రోజులు శివాలయ దర్శనం చేసుకుంటే.. జీవితంలో ఎన్నో సమస్యలు తొలగిపోతాయి.
*రూపశ్రీ.