భగవద్గీత పార్ట్ - 1
శ్రీమద్భగవద్గీత
అథ ప్రథమోపాధ్యాయః - అర్జునవిషాదయోగః
ధృతరాష్ట్రఉవాచ:-
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః !
మమకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ! 1
ధర్మక్షేత్రే - కురుక్షేత్రే - సమవేతాః - యుయుత్సవః
మమకాః - పాండవాః - చ - ఏవ - కిం - అకుర్వత - సంజయ
సంజయ = ఓ సంజయా, ధర్మక్షేత్రే = ధర్మమైన, కురుక్షేత్రే - కురుక్షేత్రమునకు, యుయుత్సవః = యుద్ధ సన్నద్ధులై, సామవేతాః = కూడినవారైన, మమకాః = నావారును, పాండవాః చ ఏవ = పాండవులును, కిం = ఏమి, అకుర్వత = చేసిరి.
ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను - ఓ సంజయా ! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు యుద్ధసన్నద్దులై చేకూడియున్న నా వారగు దుర్యోధనాదులును పాండు పుత్రులును ఏమి చేసిరి?
సంజయ ఉవాచ:-
దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా !
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ! 2
దృష్ట్వా - తు - పాండవానీకం - వ్యూఢం - దుర్యోధనః - తదా
ఆచార్యం - ఉపసంగమ్య - రాజా - వచనం - అబ్రవీత్
తదా = ఆ సమయమున, రాజా = రాజైన, దుర్యోధనః = దుర్యోధనుడు, వ్యూఢం = వూహ్యరచనతో రణమునకు మోహరించి యున్న, పాండవానీకం = పాండవ సైన్యమును, దృష్ట్వా = చూచి, తు = మరియు, ఆచార్యమ్ = ద్రోణాచార్యుల వారిని, ఉపసంగమ్య = సమీపించి, వచనం = వాక్యమును, అబ్రవీత్ = పలికెను.
ధృతరాష్ట్రుడితో సంజయుడిట్లు పల్కెను - ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో రణమునకు మోహరించియున్న పాండవ సైన్యమును చూచి, ద్రోణాచార్యుని సమీపించి ఇలా పలికెను.
పశ్యైతాం పాండుపుత్రాణామ్ ఆచార్య మహతీం చమూమ్ !
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ! 3
పశ్య - ఏతాం - పాండుపుత్రాణాం - ఆచార్య - మహతీం - చమూం.
వ్యూఢాం - ద్రుపదపుత్రేణ - తవ - శిష్యేణ ధీమతా
ఆచార్యా = ఓ ఆచార్యుడా, తవ = నీ యొక్క, ధీమతా = బుద్ధిమంతుడును, శిష్యేణ = శిష్యుడును, ద్రుపదపుత్రేణ = ద్రుపదుని కుమారుడగు ద్రుష్టద్యుమ్నునిచేత, వ్యూఢాం = వ్యూహాకారముగ నిలుపబడిన, పాండుపుత్రాణాం = పాండు తనయుల యొక్క, ఏతాం = ఈ, మహతీం = గొప్పదియగు, చమూ = సన్యమును, పశ్య = చూడుము.
ఓ ఆచార్యా! బుద్ధిమంతుడైన మీ శిష్యుడును, ద్రుపదపుత్రుడును అయిన ధృష్టద్యుమ్నిచే వ్యూహాకారముగా నిల్పబడిన పాండవుల ఈ గొప్ప సైన్యమును చూడుము.
అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి !
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ! 4
అత్ర - శూరాః - మహేశ్వాసాః - భీమార్జునసమాః - యుధి
యుయుధానః - విరాటః - చ - ద్రుపదః - చ - మహారథః
అత్ర = ఇచ్చట, యుధి = సమరమునందు, భీమార్జునసమాః = భీమార్జునులతో సరితూగు వారును, మహేష్వాసాః = గొప్ప విలుక్రాండును, శూరాః = శూరులును, యుయుధానః = యుయుధానుడు (సాత్యకి), విరాటః = విరాటుడును, చ = మరియు, మహారథః= మహారథుడైన, ద్రుపదః = ద్రుపదుడును, చ = మరియు
ఈ పాండవ సేనలందు శూరులను, గొప్ప ధనుర్విద్యా సంపన్నులును, భీమార్జునులతో సమానులును గలరు, మరియు సాత్యకి, విరాటుడు, మహారథి ద్రుపదరాజును
ధృష్టకేతు శ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ !
పురుజిత్ కుంతిభోజశ్చ నరపుంగవః ! 5
ధృష్టకేతుః - చేకితానః - కాశిరాజః - చ - వీర్యవాన్
పురుజిత్ - కుంతిభోజః - చ - శైభ్యః - చ - నరపుంగవః
ధృష్టకేతుః = ధృష్టకేతుడు, చేకితానుడు, వీర్యవాన్ = బలశాలియైన, కాశిరాజును, చ = మరియు, పురిజిత్ = పురుజిత్తుడును, కుంతి భోజః = కుంతిభోజుడును, చ = ఇంకను, నరపుపుంగవః = శ్రేష్టమానవుడైన, శైబ్యః = శైబ్యుడును, చ = మరియు, ధృష్టకేతువు, చేకితానుడు, బలశాలి కాశీరాజు, పురుజిత్తు, కుంతి భోజుడు, మానవ శ్రేష్ఠుడగు శైల్యుడును
యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ !
సౌభాద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ! 6
యుధామన్యుః - చ - విక్రాంతః - ఉత్తమౌజాః - చ - వీర్యవాన్
సౌభద్రః - ద్రౌపదేయాః - చ - సర్వే - ఏవ - మహారథాః !
విక్రాంతః = పరాక్రమవంతుడైన, యుధామన్యుః = యుధామన్యుడు, చ = మరియు, వీర్యవాన్ - వీరుడగు, ఉత్తమౌజాః = ఉత్తమౌజుడును, చ = మరియు, సౌభద్రః = సుభద్రా పుత్రుడగు అభిమాన్యుడును, చ = మరియు, ద్రౌపదేయాః = ద్రౌపదీపుత్రులును, సర్వే = అందరును, మహారథాః ఏవ = మహారథులే.
పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది మొక్క ఐదుగురు పుత్రులును కలరు. వీరందరును మహారథులే.
అస్మాకం - తు - విశిష్టాః - యే - తాన్ - నిబోధ - ద్విజోత్తమ
నాయకాః - మమ - సైన్యస్య - సంజ్ఞార్థం - తాన్ - బ్రవీమి - తే 7
ద్విజోత్తమ - ఓ బ్రాహ్మణ శ్రేష్టుడా, అస్మాకం - మన పక్షములో, తు - కూడా, యే - ఎవరు, విశిష్టాః - శ్రేష్టులో, మమ - నా యొక్క, సైన్యస్య - సైన్యమునకు, నాయకాః - నాయకులో, తాన్ - వారిని, తే - నీకు, సంజ్ఞార్థం - తెలియుట కొరకు, బ్రవీమి - తెలుపుచున్నాను, తాన్ - వారిని, నిబోధ -తెలిసికొనుము
ఓ బ్రాహ్మణోత్తమా ! మన సైన్యములో ప్రధాన యోధులను గూడ గమనింపుడు. మీకు తెలియుటకై మన సేనానాయకులను గూర్చియు తెలుపుచున్నాను.
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః !
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి స్తథైవ చ 8
భవాన్ - భీష్మః - చ - కర్ణః - చ - కృపః - చ సమితింజయః
అశ్వత్థామా - వికర్ణః - చ - సౌమదత్తిః - తథా - ఏవ - చ
భవాన్ - తమరును, భీష్మః - భీష్ముడును, చ - మరియు, కర్ణః - కర్ణుడును, చ - మరియు, సమితింజయః - సమరవిజయుడుగు, కృపః - కృపాచార్యుడును, చ - మరియు, అశ్వత్థామా - అశ్వత్థామయును, వికర్ణః - వికర్ణుడును, చ - మరియు, సౌమదత్తిః - సోమదత్తుని పుత్రుడు నగు భూరిశ్రవుడును, తథా - ఆలాగున, ఏవ చ - మరియు తమరును,భీష్ముడు, కర్ణుడు, సమరవిజయుడగు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు.
అన్వేచ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః !
నానాశాస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ! 9
అన్వే - చ - బహవః - శూరాః - మదర్థే - త్యక్తజీవితాః
నానాశాస్త్రప్రహరణాః - సర్వే - యుద్ధవిశారదాః !
అన్యే - ఇతరులను, చ - కూడ, బహవః - అనేకులు, శూరాః - శూరులు, మదర్థే - ణా కొరకు, త్యక్త జీవితాః - జీవితములపై భ్రాంతి వదిలినవారై, సర్వే - వీరందరును, నానాశాస్త్ర ప్రహరణాః - అనేకములగు శాస్త్రాస్త్రములు గలవారును, యుద్ధవిశారదాః - సమర చాతుర్యము గలవారును
ఇంకను పెక్కుమంది శూరులును, వీరులును మన సైన్యము నందు కలరు. వీరందరును యుద్ధవిశారదులు. నానా స్త్రాస్త్రదారులై. నాకొరకు తమ జీవితములను ధారపోసియైనను యుద్ధము చేయుటకు సిద్ధముగా నున్నారు.
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ !
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ ! 10
తత్ - అలాంటి, అస్మాకం - మనయొక్క, భీష్మాభిరక్షితం - భీష్మాచార్యుల వారిచే సురక్షితమైన, బలం - సైన్యం, అపర్యాప్తం - అపారము, తు - అయితే, భీమాభిరక్షితం - భీమునిచే రక్షితమైన, ఏతేషాం - వారి యొక్క, ఇదం - ఈ, పర్యాప్తం - పరిమితముగ నున్నది.
భీష్మపితామహునిచే సురక్షితమై, అపరిమితముగా నున్న మనసైన్యము అపరిమితమై యున్నది. భీమునిచే రక్షింపబడుచు పాండవసైన్యం పరిమితముగా నున్నది.
అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః !
భీష్మ మేవాభిరక్షంతు భావంతః సర్వ ఏవ హి !! 11
ఆయనేషు - చ - సర్వేషు - యథాభాగం - అవస్థితాః
భీష్మం - ఏవ - అభిరక్షంతు - భవంతః - సర్వే - ఏవ - హి
భవంతః - మీరు, సర్వే ఏవ - అందరును, చ - అందువల్ల, సర్వేషు - సకలములైన, అయనేషు - వ్యూహస్థానముల యందు, యథాభాగం - మీ మీ నియమిత స్థానముల యందు, అవస్థితాః - ఉండినవారై, భీష్మమేవ - భీష్మాచార్యుల వారినే, అభిరక్షంతు హి - చక్కగా రక్షింతురుగాక
కనుక మీరందరును మీమీ స్థానములలో సుస్థిరముగా నిలిచి, అన్నివైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించు చుండవలెను.
తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః !
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ! 12
తస్య - సంజనయన్ - హర్షం - కురువృద్ధః - పితామహః
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ !
తస్య - ఆ దుర్యోధనునకు, హర్షం - సంతోషమును, సంజనయన్ - కలిగించుచు, ప్రతాపవాన్ - ప్రతాపవంతుడును, కురువృద్ధః - కురువృద్ధుడును, పితామహః - పితామహుడును, ఉచ్చైః - బిగ్గరగా, సింహనాదం - సింహనాదమును, వినద్య - చేసి, శంఖం - శంఖమును, ధధ్మౌ - పూరించెను.
కురువృద్ధుడును, ప్రతాపశాలియను ఐన భీష్మ పితామహుడు దుర్యోధనుని సంతోషపరచుటకై ఉచ్ఛస్వరంతో సింహనాదము చేసి, తన శంఖమును పూరించెను.
తతః శంఖాశ్చ భేరశ్చ పణవానఖగోముఖాః !
సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములోపాభవత్ ! 13
తతః శంఖాః - చ - భేర్యః - చ - పణవానక గోముఖాః
సహసా - ఏవ - అభ్యహన్యంత - సః - శబ్దః - తుములః - అభవత్
తతః - తరువాత, చ - మరియు, శంఖాః - శంఖములను,చ - మరియు, భేర్యః - భేరులును, పణవానక గోముఖాః - పణవములు, తప్పెటలు, రణభేరులును, సహసా + ఏవ - ఒకేసారి, అభ్య హన్యంత - మ్రోగించబడెను, సః - ఆ, శబ్దః - ధ్వని, తుములః - గొప్ప భయంకరముగ, అభవత్ - ఆయెను.
ఆ తరువాత శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖవాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. ఆ ధ్వనులతో దిక్కులను పిక్కటిల్లాయి.(ఆ శబ్దములు భయంకరముగా నుండెను.)
తతః శ్వేతైర్హాయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ !
మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః ! 14
తతః - శ్వేతైః - హయైః - యుక్తే - మహతి - సందనే - స్థితౌ
మాధవః - పాణ్డవః - చ - ఏవ - దివ్యౌ - శంఖౌ - ప్రదధ్మతుః
తతః - తరువాత,శ్వేతైః - తెల్లని,హయైః - గుఱ్ఱములతో, యుక్తే - కూడిన, మహతి - ఉత్తమమైన, స్యందనే - రథమునందు, స్థితౌ - కూర్చొని యున్నట్టి, మాధవః - శ్రీ కృష్ణ భగవానుడు, పాండవః - అర్జునుడు, చ - మరియు, ఏవ - కూడా, దివ్యౌ - దివ్యములగు, శంఖౌ - శంఖములను, ప్రదధ్మతుః - పూరించిరి.
పిమ్మట శ్వేతాశ్వములను పూన్చిన మహారథముపై ఆసీనులైయున్న శ్రీకృష్ణార్జునులు తమ దివ్యశంఖములను పూరించిరి.
పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః !
పాండ్రం ధధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ! 15
పాంచజన్యం - హృషీకేశః - దేవదత్తం - ధనంజయః
పాండ్రం ధధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః !
హృషీకేశః - శ్రీ కృష్ణుడు, పాంచజన్యం - పాంచజన్యమను శంఖమును, ధనంజయః - ధనంజయుడు, దేవదత్తం - దేవదత్తమను శంఖమును, భీమకర్మా - భయంకర కార్యము లాచరించు, వృకోదరః - భీముడు, పౌండ్రం - పౌండ్రమను, మహాశంఖం - గొప్ప శంఖమును, ధధ్మౌ - పూరించిరి.
శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును పూరించిరి. అరి వీరభయంకరుడైన భీముడు పౌండ్రము అను గొప్ప శంఖమును పూరించెను.
అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః !
సకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ !! 16
అనంతవిజయం - రాజా - కుంతీపుత్రః - యుధిష్ఠిరః
సకులః సహదేవః సుఘోషమణిపుష్పకౌ !!
కుంతీపుత్రః - కుంతీపుత్రుడును, రాజా - రాజును అగు, యుధిష్ఠిరః - ధర్మరాజు, అనంత విజయం - అనంతవిజయ మనే శంఖమును, నకులః - నకులుడు, చ - మరియు, సహదేవః - సహదేవుడును, శుఘోష మణిపుష్పకౌ - సుఘోష మణిపుష్పకము లనే శంఖములను కుంతీ పుత్రుడును, రాజును అగు ధర్మరాజు అనంత విజయము అను శంఖమును, నకులసహదేవులు శుఘోషమణిపుష్పకములను శంఖములను పూరించిరి.
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః !
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చా పరాజితః !! 17
కాశ్యః - చ - పరమేష్వాసః - శిఖండీ - చ - మహారథః
ధృష్టద్యుమ్నః - విరాటః - చ - సాత్యకిః - చ - అపరాజితః
పరమేష్వాసః - శ్రేష్ఠమైన విల్లుగల, కాశ్యః - కాశీరాజును, చ - మరియు, మహారథః - మహారథుడైన, శిఖండీ - శిఖండియు, చ - మరియు, ధృష్టద్యుమ్నః - ధృష్టద్యుమ్నుడును, విరాటః - విరాటుడును, చ - అలాగుననే, అపరాజితః - పరాజయ మెరుగని, సాథ్యకిః - సాత్యకియును, చ - మరియు
ఓ రాజా! మహాధనుర్దారియైన కాశీరాజు, మహారథుడైన శిఖండియు, ధృష్టద్యుమ్నుడును, విరాటరాజు, పరాజయమెరుగని సాత్యకి యు మరియును.
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే !
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ! 18
ద్రుపదః - ద్రౌపదేయాః - చ - సర్వశః - పృథివీపతే
సౌభద్రః - చ - మహాబాహు - శంఖాన్ - దధ్ముః - పృథక్ - పృథక్
పృథివీపతే - హే ధృతరాష్ట్ర మహారాజా, ద్రుపదః - ద్రుపదరాజు, చ - మరియు, ద్రౌపదేయాః - ద్రౌపదీపుత్రులును, చ - మరియు, మహాబాహుః - గొప్ప భుజములుగల, సౌభద్రః - సుభద్రా తనయుడగు అభిమన్యుడును, సర్వశః - అంతటను, పృథక్ పృథక్ - వేరు వేరుగా, శంఖాన్ - శంఖములను, దధ్ముః - పూరించిరి.
ద్రుపదమహారాజు, ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులును, భుజబలశాలియు సుభద్రాపుత్రుడును అగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి.
స ఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ !
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ !! 19
సః - ఘోషః - ధార్తరాష్ట్రాణాం - హృదయాని - వ్యదారయత్
నభః - చ - పృథివీం - చ - ఏవ - తుములః వ్యనునాదయన్
తుములః - భయంకరమైన, సః - ఆ, ఘోషః - శబ్దము, నభః - ఆకాశమును, చ - మరియు, పృథివీం - భూమియును, చ - మరియు, ఏవ - కూడా, వ్యనునాదయన్ - ప్రతిధ్వనించుచు, ధార్తారాష్ట్రాణాం - ధృతరాష్ట్ర పుత్రులయోక్క, హృదయాని - గుండెలను, వ్యదారయత్ - భేదిరించెను.
పాండవవీరుల శంఖనినాదములకు భూమ్యాకాశముల దద్ధరిల్లినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హృదయములు తల్లడిల్లెను.
అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తారాష్ట్రాన్ కపిధ్వజః !
ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః
హృషీకేశం తదా వాక్యమ్ ఇదమహ మహీపతే ! 20
అథ - వ్యవస్థితాన్ - దృష్ట్వా - ధార్తరాష్ట్రాన్ - కపిధ్వజః
ప్రవృత్తే - శాస్త్రసంపాతే - ధనుః - ఉద్యమ్య - పాండవః
హృషీకేశం - తదా - వాక్యం - ఇదం - ఆహ - మహీపతే
అథ - తరువాత, మహీపతే - ఓ రాజా, చ శస్త్రసంపాతే - ఆయుధ ప్రయోగము, ప్రవృత్తే - జరగబోవుచుండగా, కపిధ్వజః - కపిరాజు చిహ్నముతోడి పతాకము గల, పాండవః - అర్జునుడు, వ్యవస్థితాన్ - సమర సన్నద్ధులై యున్న, ధార్తరాష్ట్రాన్ - దుర్యోధనాదులను, దృష్ట్వా - చూచి, ధనుః - వింటిని, ఉద్యమ్య - సంధించి, తదా - అప్పుడు, హృషీకేశం - శ్రీ కృష్ణునితో, ఇదం - ఈ, వాక్యం - వచనమును, ఆహ - పలికెను.
అర్జున ఉవాచ:-
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేపాచ్యుత !
సేనాయోః - ఉభయోః - మధ్యే - రథం - స్థాపయ - మే - అచ్యుత 21
అచ్యుత - శ్రీకృష్ణా, ఉభయోః - రెండింటీ, సేనయోః - సేనల యొక్క, మధ్యే - నడుమ, మే - ణా యొక్క, రథం - రథమును, స్థాపయ - నిలుపుము.
ఓ అచ్యుతా ! నా రథమును ఇరుసేనల మధ్య నిలుపుము.
యావదేతాన్నిరీక్షేపాహం యోద్ధుకామానవస్థితాన్ !
కైర్మయా సహ యోద్ధవ్యమ్ అస్మిన్ రణసముద్యమే
కైః - మయా - సహ - యోద్ధవ్యం - అస్మిన్ - రణసముద్యమే 22
అస్మిన్ - ఈ, రణసముద్యమే - సమర సందర్భమున, మయా - నా చేత, కైః - సహ - ఎవరితో, యోద్ధవ్యం - యుద్ధము చేయబడవలయునో, యోద్ధుకామాన్ - సమరము నభిలషించి, అవస్థితాన్ - ఉన్న, ఏతాన్ - ఈ శూరులను, అహం - నేను, యావత్ నిరీక్షే - చూచెదను
ఈ సమరమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్షయోధు లందరిని చూచి వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసియున్నదో పరిశీలించెదను.
యోత్స్యమానానవేక్షేపాహం య ఏతేపాత్ర సమాగతాః !
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః ! 23
యోత్స్యమానాన్ - అవేక్షే - అహం - యే - ఏతే - అత్ర - సమాగతాః
ధార్తరాష్ట్రస్య - దుర్బుద్ధేః - యుద్ధే - ప్రియచికీర్షవః
దుర్బుద్ధేః - దుష్టబుద్ధియైన, ధార్తరాష్ట్రస్య - దుర్యోధనునకు, యుద్ధే - యుద్ధము నందు, ప్రియ చికీర్షవః - మేలు కోరినవారై, యే - ఏ, ఏతే - ఈ వీరులు, అత్ర - ఈ యుద్ధభూమి యందు, సమాగతాః - వచ్చి యుండిరో, యోత్స్యమానాన్ - అలా యుద్ధము చేయువారిని, అహం - నేను, అవేక్షే - చూచెదను.
దుర్భుద్ధియైన దుర్యోధనునకు మేలుకోరి యుద్ధమున పాల్గొనదలచి వచ్చియున్న రాజులను అందరిని వీక్షించెదను.
సంజయ ఉవాచ:-
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత !
సేనయోరుభాయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ! 24
ఏవమ్ - ఉక్తః - హృషీకేశః - గుడాకేశేన - భారత
సేనాయోః - ఉభయోః - మధ్యే - స్థాపయిత్వా - రథోత్తమమ్
భారత - ఓ ధృతరాష్ట్రుడా, ఏవం - ఈ విధముగ, గుడాకేశేన - అర్జునుని చేత, ఉక్తః - చెప్పబడిన, హృషీకేశః - శ్రీకృష్ణుడు, ఉభయోః - రెండు, సేనాయోః - సైన్యముల యొక్క, మధ్యే - నడుమ, రథోత్తమం - గొప్పదియగు రథమును, స్థాపయిత్వా - నిలిపి
సంజయుడు పలికెను - ఓ ధృతరాష్ట్రా ! అర్జునుని కోరికమేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును నిలిపెను.
భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ !
ఉవాచ పార్ధ పశ్వైతాన్ సమవేతాన్ కురూనితి 25
భీష్మద్రోణ ప్రముఖతః - సర్వేషాం - చ - మహీక్షితాం
ఉవాచ - పార్థ - పశ్య - ఏతాన్ - సమవేతాన్ - కురూన్ - ఇతి
భీష్మద్రోణ ప్రముఖతః - భీష్మద్రోణుల ఎదుట, చ - మరియు, సర్వేషాం - సర్వులైన, మహీక్షితాం - రాజుల ఎదుట (నిలిపి), పార్థ - ఓ అర్జునా, సమవేతాన్ - సన్నద్ధులై యున్న, ఏతాన్ - ఈ కురూన్ - కౌరవులను, పశ్య - చూడుము, ఇతి - అని, ఉవాచ - పలికెను.
భీష్మద్రోణులకును, ఆ పక్షమునందలి మహారాజులందరికిని ఎదురుగా ఉభయసేనుల మధ్య నిలిపి పిదప అతడు అర్జునునితో పార్థా! ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరికిని బాగుగా పరికింపుము అని నుడివెను.