శ్రీ లక్ష్మీ స్తోత్రముతో వైభవలక్ష్మీని పూజించండి

 

శ్రీ లక్ష్మీ స్తోత్రముతో వైభవలక్ష్మీని పూజించండి

 

దీపావళి స్పెషల్ కథనాలకోసం ...

 

 

శ్రీ లక్ష్మీ, హరివల్లభ, విద్యాలక్ష్మి, క్షీర సముద్రరాజతనయా, రమా, వైభవలక్ష్మీ, సాంప్రదాయినీ, శ్రీ చక్ర విలసిని, యోగమాత, ప్రకృతి స్వరూపిణీ, జగద్రక్షిణీ అని అనేక నామాలతో విరాజిల్లుతున్న శ్రీలక్ష్మిదేవిని పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగములలో సకలదేవత సముదాయముల చేత కశ్యపుడు, అత్రి, భృగువు, ఆగస్త్య మహఋషులచేతను వైభవలక్ష్మి పూజింపబడింది. పూర్వకాలంలో అమృతము కోసం దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని చిలుకే సమయంలో ముందుగా లక్ష్మిదేవి పాలసముద్రం నుండి ఉద్భవించింది. అందువల్ల శ్రీ లక్ష్మిని పూజించి అనుకున్న కార్యాలను దిగ్విజయం చేసుకోండి.

శ్రీ లక్ష్మి స్తోత్రం

 

 



శ్రీ మన్మహాలక్షెంత్య

బ్రాహ్మీం చ వైస్ణవీ భద్రాం షడ్భుజాం చ చతుర్ముఖాం

త్రినేత్రాం చ త్రిశూలాం చ పద్మచక్రగదాధర

ప్రధమే త్ర్యంబకాగౌరీ ద్వితీయే వైష్ణవీ తథా

త్రుతీయే కమలా ప్రోక్తా, చతుర్థే లోకసుందరీ

పంచమే విష్ణు పత్నీచ,షష్టేచవైష్ణవీ తథా.

సప్తమే చ వరారోహా అష్టమే వరదదాయిని.

శ్రీలక్ష్మ్యష్టకం నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే,

శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి ర్నమోస్తు తే.

నమస్తే గరుడారూఢే దేవాసుర భయంకరి!

సర్వపాపహరే దేవి మహలక్ష్మి ర్నమోస్తు తే.

సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి!

సర్వభగ్యప్రదేదేవి!మహాలక్ష్మి ర్నమోస్తు తే.

సిద్ధి బుద్ధిప్రదేదేవి భుక్తిముక్తి ప్రదాయిని,

మంత్రమూరెత సదాదేవి మహలక్ష్మి ర్నమోస్తు తే.

ఆద్యంతరహితేదేవి ఆదిశక్తే మాహేశ్వరి,

యోగజ్ఞే యోగసంభూతే మహలక్ష్మి ర్నమోస్తు తే.

స్ధూలసూక్ష్మే మహారౌద్రే నహాశక్తే మహాఒదరే,

 

 

మహాపాహరే దేవి మహాలక్ష్మి ర్నమోస్తు తే.

పద్మాసనస్ధితే దేవి పరబ్రహ్మస్వరూపిణి,

పరమేశే జగన్మత ర్మహాలక్ష్మి ర్నమోస్తు తే.

శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే,

గత్‌స్ధితే జగన్మత ర్మహాలక్ష్మి ర్నమోస్తుతే.

మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠే ద్భక్తిమా న్నరః!

సర్వసిద్ధి మావాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా.

ఏకకాలే పఠే న్నిత్యం ధనధాన్యసమన్వితః

త్రికాలం యః పఠ నిత్యం మహాశత్రువినాశనం,

మహాలక్ష్మీర్ భవేన్నిత్యం సర్వదా వర్దా శుభా.

ఇతి ఇంద్రకృత శ్రీ మహాలక్ష్మ్య ష్టకస్తవః సంపూర్ణంః

దేవి దేహీ ధనం దేహి దేవి దేవీయశో మయి,

కీర్తిం దేహి సుఖం దేహీ ప్రసీద హరివల్లభే.

శ్రీ లక్ష్మినారాయణ ప్రసాదసిద్ధిరస్తు.

సర్వకామ్యార్ధఫలసిద్ధిరస్తు.

మనోభీష్టాఫలసిద్ధిరస్తు