శుక్రవారం ఈ పనులు చేస్తే జీవితంలో గొప్ప మార్పులు చోటుచేసుకుంటాయట..!
శుక్రవారం ఈ పనులు చేస్తే జీవితంలో గొప్ప మార్పులు చోటుచేసుకుంటాయట..!
హిందూ పంచాంగం ప్రకారం ప్రతి వారానికి, ప్రతి తిథికి, ప్రతి మాసానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ఒక్కో రోజు ఒక్కో దేవుడికి లేదా దేవతకు ఎంతో ముఖ్యమని కూడా చెబుతారు. భారతదేశంలో ప్రతి హిందూ ఇళ్ళలో శుక్రవారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. సాధారణ రోజుల కంటే శుక్రవారం రోజు ఇంట్లో పూజలు, హడావిడి ఎక్కువగా ఉంటుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని భక్తితో పూజించడం వల్ల ఆర్థిక లాభాలు మాత్రమే కాకుండా జీవితంలో ఆర్థిక స్థిరత్వం కూడా వస్తుంది. శుక్రవారం పూజకు మరొక ప్రత్యేక ప్రాముఖ్యత కూడా ఉంది. శుక్రవారం పూజ వల్ల జాతకంలో శుక్రుడు బలంగా ఉంటాడు. శుక్రుడు ఆనందం, అందం, ప్రేమ, కళ, విలాసానికి మూలకారకుడు. శుక్రుడి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే శుక్రవారం రోజు చేయాల్సిన పనులేంటో తెలుసుకుంటే..
శుక్రవారం చేయాల్సిన పనులు..
శుక్రవారం నాడు గులాబీ రంగు దుస్తులు ధరించాలి. శుక్రవారం రోజు సాయంత్రం లక్ష్మీ దేవిని పూజించి, 21 గవ్వలను సమర్పించాలి. ఇది ఆర్థిక సమస్యలను తగ్గిస్తుందట. అంతేకాదు.. ప్రేమ వివాహం చేసుకోవాలనే వారి కోరికను నెరవేరుస్తుందని చెబుతున్నారు.
శుక్రవారం నాడు తెల్లటి వస్తువులను దానం చేయడం మంచిదట. పాలు, పెరుగు, బియ్యం దానం చేయడం మంచిది. అయితే చక్కెర దానం చేయడం వల్ల సంబంధాలలో తీపి వస్తుందని నమ్ముతారు.
శుక్రవారం రోజు నల్ల చీమలకు చక్కెర, తెల్ల ఆవుకు బెల్లం, పిండి తినిపించాలట. ఇలా చేయడం వల్ల పనిలో అడ్డంకులు తొలగిపోవడం, ఇంటి ఆర్థిక స్థితి మెరుగ్గా మారడం వంటివి జరుగుతాయట.
శుక్రవారం నాడు నెయ్యి, బెల్లం వేసి తయారు చేసిన రొట్టెలను ఆవులకు తినిపించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందట. ఇది ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని తెస్తుందట.
శుక్రవారం రోజు ఉపవాసం ఉండాలి. లక్ష్మీదేవి పూజ చేసే సమయంలో లక్ష్మీ చాలీసా పఠించాలి. ఇది సంపద, మనశ్శాంతి, కోరికలు నెరవేరడానికి మార్గాన్ని సులువు చేస్తుందట.
శుక్రవారం రోజు లక్ష్మీ చాలీసాను, ఆదిశంకరాచార్యులు రచించిన సౌందర్య లహరిని అమ్మవారి ముందు భక్తితో పఠించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెబుతారు.
*రూపశ్రీ.