పాశ్చాత్య దేశాల్లో ఆధ్యాత్మికత ఎలా ఉంది?
పాశ్చాత్య దేశాల్లో ఆధ్యాత్మికత ఎలా ఉంది?
"ధ్యాన" అనే సంస్కృత పదం పాళీ భాషలో "ఝాన"గా, జపాన్ భాషలో "చైన్" లేక "జెన్న"గా, చైనా భాషలో "చాన్" లేక "చాన్- న" గా మారింది. 'జెన్' ఒకవేదాంతమూ కాదు, మతమూకాదు, ఇజమూ కాదు. అది ఒక అనుభవం. హృదయానికి - మనస్సుకు సంబంధించింది.
జెన్ ధ్యానం..
'జెన్' విధానంలో 'నేను' అనేది తెలుసుకోవడం ఎంతో 'నేను' అనేది మరచిపోవడం కూడ అంతే. అదే వికాసం. అయితే వికాసానికి చిహ్నాలు లేవు. అవి అందుకు సూచకాలు కావు. అశ్రద్దగా వుండడానికి వీల్లేదు. ఎందులోనూ తగుల్కోడానికి కుదరదు. దాన్ని వివరించడం కూడ కష్టమే. ద్వారం లేని ద్వారం 'జెన్' ద్యానం. తనను తాను తెలుసుకొని బుద్ధత్వం చెందడమే జెన్.
ఇంకా చెప్పాలంటే, జెన్ అనగా శ్రద్ధ వహించడం, ఎరుకతో వుండడం, మనస్పూర్తిగా వుండడం, చైతన్యవంతం కావడం, శబ్దాలతో కూడిన సూత్రాలకు లోబడకుండ, మోసపోకుండ వుండడం, అలాంటి వాటిని అధిగమించడం. జెన్ ధ్యానం అనవచ్చును. 'ఆలోచించవద్దు, అవలోకించు' అనేదే జెన్.
ఒక పువ్వుతో - ఒకనవ్వుతో ' జెన్' మొదలైందని అంటారు. నవ్వే పువ్వు, పుష్పించే నవ్వు 'జెన్' అయ్యింది. ఇది జపాన్ ధ్యానం.
చైనా ధ్యానం
భారతీయులకు సాంప్రదాయకంగా అభ్యాసంతో కూడిన ఏకాగ్రతా విధానం ధ్యానమయింది. చైనీయులకు హఠాత్తుగా లో దృష్టి, వెలుగు ప్రసరించడం జెన్నిజమయింది. కనుక ఇవి ఒక దానికొకటి వ్యతిరేకమైనవి. "టఒ ఇజం" యొక్క వికాసం జెన్. ఇది బౌద్ధంలోని అంతర్దృష్టికి సన్నిహితం.
"టఒ ఇజం అనే తల్లికీ, బుద్ధిజం అనే తండ్రికీ, తల్లి పోలికతో పుట్టిన బిడ్డ, జెన్నిజం అనవచ్చు"
చైనా టావోయిజం
చైనీయుల టావోయిజానికి సంబందించిన జెన్ సంప్రదాయం ప్రకారం “మాట్లాడే వాడికి తెలియదు, తెలిసినవాడు మాట్లాడడు". ఒక యువకుడు చైనా గురువైన సెంగ్లి శాన్ వద్దకు వెళ్ళి “నాకు విముక్తి కల్గించమన్నాడు. ఎవరు బందించారని గురువడిగాడు. "ఎవరూ బంధించ లేద”న్నాడు యువకుడు. “అయితే విముక్తి కోసం ఎందుకు పరితపిస్తున్నావు" అని అడిగాడు. ఆ యువకుడి మనసు విచ్చుకుంది. వికాసం పొందాడు. అదే టావోయిజం. అతడే నాల్గవ గురువు. వ్యత్యాసాలు చూడకుండా, శాస్త్రాలను, పదాలను, అక్షరాలను అధిగమించి సరాసరి మనస్సులో దూరి, నిజ స్వభావమెరిగి, బుద్ధత్వం పొందడమే టావోయిజం
ఆవిధంగా టావోయిజానికి, బుద్ధత్వానికి సమన్వయమైన సంక్షిప్త సూత్రప్రాయపు వ్యాఖ్యానం వెలువడింది. చైనా జెన్ లో అచింతన విదానం జెన్ పరంపరలో హ్యూయినెంగ్ అనే వాడు. అచింతన విధానం ప్రవచించాడు. ఏ ముద్ర, బంధం లేకుండ మనస్సుతో మనసును గమనించడం, సకలం గమనించడం. సామాన్యుల దృష్టిలో వెలుగు చీకటులు వేరు వేరు. కాని నిజ స్వభావమెరిగిన మనస్సునకు ఉండేది ఒకే ఒక దృష్టిమాత్రమే. 'బోధి', మనసులో పొందాలి. అంతర సత్యాన్వేషణ బాహిరంలో చేయడం వృధా అని వారి భావన. మనస్సును చేరుకొనే మార్గమిది అని నిర్దేశిస్తే, పెడమార్గంలో పడ్డట్టేనని తరువాతి 'చాయోచౌటి సుంగ్టన్' చెప్పాడు.
బోయిజం
కాన్పూసియానిజం బుద్ధిజం వాటి సమన్వయం నిత్య జీవితంలో అమలుగావడమే జెన్ అని డాక్టర్ డైసెడ్లైటారోసుజుకి అంటాడు.
జాపనీయులు కాన్ఫూషియానిజంతో బ్రతికి బుద్ధిజంతో తనువు చాలిస్తారని డాక్టర్ సుజుకి అంటారు. అతని సభలో ఒకరు దాని వివరణ కోరారు. "జీవించడమే మరణించడం" అని వికాసవంతమైన వాస్తవాన్ని నవ్వుల పువ్వుల జల్లుల మధ్య డాక్టర్ సుజుకి వివరణ ఇచ్చారు. అడిగిన వాని మనస్సులో ప్రశాంత ఉషోదయమయింది!
ఇవీ విదేశాలలో కొన్ని ధ్యాన మార్గాలు అందులో ఉన్న అంతరార్థాలు.
◆నిశ్శబ్ద.