Read more!

ఆంజనేయుడు శివాంశ సంభూతుడు

 

త్రేతాయుగంలో విష్ణుమూర్తి శ్రీరాముడిగా అవతరించిన సంగతి మనకు తెలుసు. అయితే రామునికి తోడ్పడేందుకు మహాశివుడు ఆంజనేయుడిగా అవతరించిన సంగతి చాలామందికి తెలీదు. అంటే ఆంజనేయుడు శివాంశ సంభూతుడన్నమాట. శ్రీరాముడి అవతారం సమాప్తం అయ్యాక్కూడా హనుమంతుడు మనకోసం ఉన్నాడు.

ఆంజనేయుడు "చిరంజీవుడై" కలియుగం అంతమయ్యేవరకూ మానవకోటిని రక్షించేందుకు దీక్ష పూనాడు. ఆంజనేయుని బలం అనంతం. కొండను సైతం అమాంతం లేపి, ఒక్క చేత్తో తీసికెళ్ళగలడు. ధైర్యానికి మారుపేరు హనుమంతుడు. ఎలాంటి కష్ట సమయంలో అయినా ఆంజనేయుని తలచుకుంటే చాలు మనసు నిబ్బరంగా ఉంటుంది. ఆఖరికి దెయ్యాలు, భూతాలు లాంటి భయాలు, భ్రమలకు గురైనప్పుడు హనుమంతుని నామం తలచుకుంటే సత్వర ఫలితం ఉంటుంది.

ఆంజనేయుని స్మరిస్తే మనకు ఏ చింతలూ, సమస్యలూ ఉండవు. ధైర్యంగా, శాంతంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పఠిస్తే మరింత మంచిది. భోలాశంకరుడి అంశ అయిన ఆంజనేయుడు కూడా పిలిస్తే పలుకుతాడు. ఆపదల్లో ఆదుకుంటాడు. ఎల్లవేళలా తమకు రక్షణగా ఉండాలని, ధైర్యాన్ని సమకూర్చాలని భక్తులు ఆంజనేయుని ఆరాధిస్తారు.