హనుమాన్ జయంతి ఫెస్టివల్ సెలెబ్రేషన్స్

 

ఈరోజు హనుమాన్ జయంతి. దేశం నలుమూలలా హనుమాన్ జయంతి ఫెస్టివల్ సెలెబ్రేషన్స్ జరుగుతాయి. విదేశాల్లో స్థిరపడ్డ హిందువులు తమదైన పద్ధతిలో హనుమాన్ జయంతి ఫెస్టివల్ సెలెబ్రేషన్స్ జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసం పౌర్ణమినాడు హనుమాన్ జయంతి వస్తుంది. హనుమంతుడు, రాముని నమ్మినబంటు.

రామునిమీద ఆంజనేయునికి ఎంత భక్తి అంటే, ఒక సందర్భంలో తన గుండె చీల్చి చూపగా అక్కడ సీతారాములు కొలువై ఉంటారు. మరోసారి హనుమాన్ సీతాదేవిని "నుదుట సిందూరం ఎందుకు పెట్టుకున్నావమ్మా" అని అడుగుతాడు. సీతమ్మ తల్లి "శ్రీరాముని ఆయుష్షు బాగుండాలని" అంటుంది. అంతే, ఆంజనేయస్వామి తన ఒళ్ళంతా సిందూరం పూసుకుంటాడు. అదీ హనుమంతునికి రాముడి మీద గల నిరుపమానమైన భక్తి. హనుమాన్ జయంతి ఫెస్టివల్ హిందువులకు ముఖ్యమైంది.

చింతలు, చిరాకులు, భయాలు, ఆందోళనలు తీర్చే దేవుడు. ఆంజనేయస్వామి బలానికి, శక్తికి ప్రతిరూపం. కొండను కూడా పెకిలించి తీసికెళ్ళగల శక్తిమాన్ వీర హనుమాన్. ఎక్కువమంది చైత్ర పౌర్ణమి రోజును హనుమాన్ జయంతిగా జరుపుతుండగా కొందరు మాత్రం చైత్ర చతుర్దశిని హనుమాన్ జయంతి గా జరుపుతారు. హనుమాన్ జయంతి ఫెస్టివల్ సెలెబ్రేషన్స్ ను పురస్కరించుకుని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. హనుమాన్ చాలీసా మొదలైన హనుమంతుని భక్తి గీతాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

హనుమంతుని కధలు వినిపిస్తారు. పంచముఖ హనుమాన్, పాదరస హనుమాన్ తదితర విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. దేవాలయాల్లో హనుమాన్ ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు ప్రసాదాలు పంచుతారు. అనేక దేవాలయాల్లో ఈరోజు అన్నదానాలు నిర్వహిస్తారు. హనుమాన్ జయంతి ఫెస్టివల్ సెలెబ్రేషన్స్ సందర్భంగా , ఆంజనేయుని ఉంగరాలు, హనుమాన్ లాకెట్లు, హనుమాన్ పిక్చర్స్, ఆంజనేయుని విగ్రహాలు విక్రయిస్తారు. మామూలు రోజుల్లో కంటే, హనుమాన్ జయంతి నాడు ఆంజనేయుని ఉంగరాలు, హనుమాన్ లాకెట్లు, ఆంజనేయుని విగ్రహాలు ఎక్కువగా అమ్ముడుపోతాయి.