Siva Bhaktudu Siriyaludu
శివభక్తుడు సిరియాళుడు
Siva Bhaktudu Siriyaludu
చిరుతొండడు అనే వైశ్యుడు పేరుమోసిన శివభక్తుడు. ఇతని కుమారుడు సిరియాళుడు. చిరుతొండని భక్తిని పరిక్షించాలనుకుని శివపార్వతులు వృద్ధులుగా మారువేషంలో వచ్చి, చిరుతొండని ఆతిధ్యాన్ని కోరారు.
చిరుతొండడు వారికి ఆతిధ్యాన్నివ్వడానికి అంగీకరించాడు.
అప్పుడు శివపార్వతులు సిరియాళుని వండి తమకు వడ్డించమని కోరారు.
ఆ తర్వాత శివుడు మరో వేషమున సిరియాళుని వద్దకు వెళ్ళి, ‘నీ తండ్రి నిన్ను హతమార్చి,అతిధుల ఆకలి తీర్చబోతున్నాడ”ని చెబుతాడు.
సిరియాళుడు తొణకక, తండ్రి తన మాటమీద నిలబడడమే తనకు ముఖ్యమని చెప్పి, మరణానికి సిద్ధపడతాడు.
చిరుతొండడు సిరియాళుని మాంసంతో భోజనం సిద్దం చేయగా, భోజనానికి కూర్చున్న వృద్ధ దంపతులు కుమారుని పిలవమని కోరతారు.
అప్పుడు చిరుతొండడు “సిరియాళా!” అని పిలవగానే సిరియాళుడు పరుగెత్తుకుంటూ తండ్రి వద్దకు చేరతాడు.
శివపార్వతులు నిజరూపంలో ప్రత్యక్షమై సిరియాళుడు, చిరుతొండడు మహా భక్తులని కొనియాడతారు.