వంటగదిలో డస్ట్ బిన్ ఉంచుతున్నారా.. ఈ నిజాలు తెలుసుకోండి
వంటగదిలో డస్ట్ బిన్ ఉంచుతున్నారా.. ఈ నిజాలు తెలుసుకోండి!
డస్ట్ బిన్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇల్లు ఊడవడం నుండి, ఇంట్లో పోగయ్యే అన్ని రకాల చెత్తలను డస్ట్ బిన్ లో వేస్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో చాలా ఇళ్లలో కనిపించేది వంటింట్లో కూడా డస్ట్ బిన్ ఉంచడం. కొందరు డస్ట్ బిన్ ను వంటింట్లో సింక్ కు దగ్గరగా ఉంచుకుంటారు. మరికొందరు కిచెన్ కౌంటర్ కింద ఉండే స్థలంలో డస్ట్ బిన్ ఉంచుకుంటారు. అయితే ఒకప్పుడు ఇంట్లో డస్ట్ బిన్ అంటూ ఉండేది కాదు. ఎప్పటి చెత్త అప్పుడు ఇంటి బయట లేదా వీధిలో ఉన్న చెత్త తొట్టి దగ్గరకువెళ్లి పడేసేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక చిన్న సైజ్ చెత్త తొట్టి వచ్చేసింది. ముఖ్యంగా ఇంట్లో.. వంటింట్లో డస్ట్ బిన్ ఉంచడం వల్ల జరిగేదేంటో అందరూ తప్పక తెలుసుకోవాలి.
హిందూ నమ్మకాల ప్రకారం వంట గదిలో డస్ట్ బిన్ ఉంచుకోకూడదు అంట. వంటింట్లో డస్ట్ ఉండటం అశుభం అని అంటారు. వంటింట్లో డస్ట్ బిన్ ఉంటే అది ఇంట్లో సానుకూల శక్తిని చెదరగొడుతుందట. పైగా ప్రతికూల శక్తిని ఇంట్లో చేరేలా చేస్తుందని అంటున్నారు.
వంటింట్లో డస్ట్ బిన్ ఉంటే ప్రతికూల శక్తి చేరడమే కాకుండా అన్నపూర్ణ దేవి ఆ ఇంటి మీద ఆగ్రహ పడుతుందని అంటున్నారు. దీని వల్ల ఇంట్లో ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. అలాగే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉంటుందట.
వంటింట్లో డస్ట్ బిన్ ఉంచడం ద్వారా ఎలాంటి సమస్యలు రాకూడదనుకుంటే డస్ట్ బిన్ ను వంటింట్లో దక్షిణ దిశలో ఉంచాలట. దక్షిణం లేదా నైరుతి మూలలో ఉంచవచ్చట. దీని వల్ల దేవతలు శాంతిస్తారని అంటున్నారు.
ఇంటికి దక్షిణాన చెత్త బుట్టను ఉంచితే అది ప్రతికూల శక్తిని ఇంట్లో చేరుకోనివ్వకుండా చేస్తుందని, తద్వారా ఇంట్లో, కుటుంబంలో మంచి మార్పు వస్తుందని అంటున్నారు.
ఇంట్లో లేదా వంటింట్లలో చెత్త బుట్టను ఉత్తర దిశలో మాత్రం పొరపాటున కూడా ఉంచకూడదట. ఈ దిశలో చెత్త బుట్టను ఉంచడం వల్ల పేదరికం, దురదృష్టం, ఇంట్లో గొడవలు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చేరడం వంటి సమస్యలకు దారితీస్తుందట.
గమనిక.. పైన పేర్కొన్న అంశాలు, సోషల్ మీడియాలో జ్యోతిష్యులు పేర్కొన్న సమాచారాన్ని అనుసరించి ఇవ్వడం జరిగింది.
*రూపశ్రీ.