Siva Bhaktudu Pushpadantudu
శివభక్తుడు పుష్పదంతుడు
Siva Bhaktudu Pushpadantudu
పుష్పదంతుడు ఒక రాజు, మహా శివభక్తుడు.
ప్రతిరోజూ కైలాసానికి వెళ్ళి శివుడిని ప్రత్యక్షముగా దర్శించి, పూజించిన తర్వాతే తను భోజనం చేసేవాడు.
ఒకరోజు అతడు కైలాసానికి వెళ్ళిన సమయంలో శివుడు పార్వతికి ఒక రహస్యమైన కథను వివరిస్తున్నాడు.
ఆ కథను చాటు నుంచి పుష్పదంతుడు వింటాడు. తర్వాత ఆ విషయం తెలుసుకున్న శివుడు, పుష్ప దంతుడిని ''పిశాచానివి కమ్మని'' శపిస్తాడు.
అతడే భేతాళుడని ఒక కథనం కాగా, మరో కథనం ప్రకారం పుష్పదంతుడు వరరుచి అనే పేరుతో మనిషిగా జన్మిస్తాడు.
రెండు కథలలోనూ పుష్ప దంతుని శివభక్తుడిగానే వర్ణించారు.