Akroorudu

 

అక్రూరుడు

Akroorudu

 

అక్రూరుని మనస్తత్వంలో ద్వంద్వ స్వభావము కనపడుతుంది.

మొదట కృష్ణునికి విరోధి వలె కనిపించినప్పటికీ, చివరికి అతడు కృష్ణుడంటే భయభక్తులు ఉన్న వ్యక్తి వలె మారతాడు.

అక్రూరుని గురించిన ప్రస్తావన భారతములో కనపడుతుంది. కంసుడు ధనుర్యాగం పేరుతో శ్రీకృష్ణుని తన నగరానికి ఆహ్వానించడానికి తగిన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నప్పుడు కంసుడు అక్రూరుని ఎంపిక చేసుకుని శ్రీకృష్ణుని తన నగరానికి తీసుకురావలసిందిగా అక్రూరుని రథసారధిగా పంపుతాడు.

అక్రూరుడు కృష్ణుని వద్దకు వెళ్ళి, కంసుని కపటోపాయం గురించి హెచ్చరిస్తాడు.

అతడి హెచ్చరికలతో కృష్ణుడు కంసుని వద్దకు వెళ్ళి, అతని అనుచరులను, చివరికి కంసుడినీ హతమారుస్తాడు.

శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి సత్యభామ వివాహ విషయం మాట్లాడే సందర్భంలో అక్రూరుడి ప్రస్తావన వస్తుంది.

సత్యభామను శతధన్వుడనే రాజుకిచ్చి వివాహం చేస్తానని సత్యభామ తండ్రి అయిన సత్రాజిత్తు ప్రకటిస్తాడు.

చివరకు శ్రీకృష్ణునకిచ్చి వివాహం చేయగా, అక్రూరుడు శతధన్వుడు సత్రాజిత్తుని హతమారుస్తాడు.

ఇది తెలిసిన శ్రీ కృష్ణుడు శతధన్వునిపై దండెత్తి యుద్ధంలో అతడిని సంహరిస్తాడు.

ఆ తర్వాత అక్రూరుడు కృష్ణునికి భయపడి పారిపోగా, కృష్ణుడు అతనికి అభయమిచ్చి, ద్వారకలో ఉండడానికి అనుమతిస్తాడు.