శ్రీ సిద్దేశ్వర్ మహాదేవ్ మందిర్ ద్వారక , గుజరాత్
శ్రీ సిద్దేశ్వర్ మహాదేవ్ మందిర్ ద్వారక , గుజరాత్
మనం శివాలయాలు అని అన్నట్లే మేము వెళ్ళిన గుజరాత్ లోని శివాలయాలను సిద్దేస్వర్ మహదేవ్ గా పిలుస్తారని పించింది. మాతృ గయలోనూ సిద్దేస్వర్ ఆలయం స్వయం భూ శివలింగం వుంది. ద్వారక లోనూ సిద్దేస్వర్ మహాదేవ ఆలయం వుంది. నేను వివరించే ఆలయం ద్వారకా పట్టణం లో వున్న సిదేస్వర్ ఆలయం గురించి.శ్రీ సిద్దేశ్వర్ మహాదేవ్ మందిర్ ద్వారకా నగరం గుజరాత్ లో వుంది. ఇక్కడి లింగం స్వయం భూ లింగం ఇది. ద్వారకాదీసుడైన శ్రీ కృష్ణుడిని దర్శించిన అనంతరం పట్టణంలో వున్న ఇతర దర్శనీయ ప్రదేశాలు, ఆలయాలలో శ్రీ సిద్దేస్వర్ మహాదేవ మందిర్ ఒకటి. ఇది చాలా పురాతన మైన ఆలయం. ఆలయ ప్రాంగణంలో అడుగిడగానే పెద్ద బావి, భూతనాథ్ ఆలయం, కనిపిస్తాయి. ఈ బావికి సావిత్రి బావి అని పేరు.
ఇక్కడ లింగానికి అభిషేకాదులు స్వయంగా మనమే చేసుకోవచ్చు. విశాలమైన ప్రాంగణం . ప్రవేశ ద్వారం నుంచి ఆలయానికి వెళ్ళే దారి అంతా సాధువులు కాషాయ వస్త్ర ధారణతో, పొడుగాటి జడలు, ముడులతో హర హర మహా దేవ్ అంటూ వచ్చే వారిని బిక్ష అడుగుతూ కనిపించారు మాకు.
ఈ ఆలయం చుట్టూ కూడా చాలా ఆలయాలున్నాయి. వాటిల్లో మారుతి మందిర్, విగ్రహ పూజ కనిపించని ఇతర పురాతన ఆలయాలు. వున్నాయి.
ఈ ఆలయం దర్శించ టానికి కొద్ది మందే వస్తుంటారు. రష్ వుండదు. టికెట్స్ వుండవు. ప్రశాంత వాతావరణం.
ద్వారకలో ప్రధాన ఆలయం శ్రీకృష్ణ మందిరం. చుట్టు పక్కల కూడా ద్వారకా దీసునికి సంబందినిన ఆలయాలే వున్నాయి. బెట్ ద్వారక, రుక్మిణి మందిర్, మూల ద్వారక, బాలకా తీర్థ్, లక్ష్మి నారాయణ్ టెంపుల్, ఇలా ఎన్నో వున్నాయి.
ద్వారకా పట్టణం లో వున్న సన్ సెట్ పాయింట్, సిద్దేశ్వర్ మహాదేవ మందిర్, భడకేశ్వర్ మందిర్, గీతా మందిర్, లక్ష్మి నారాయణ్ మందిర్, ఇలాటి ఆలయాలు కూడా ప్రసిద్ధి చెందాయి. వీటిని దర్శించే వారు కొద్ది మందే! ద్వారకా పట్టణం నుంచి లోకల్ ఆటోలు నగర దర్శనం 200 రూపాయలతో చూపిస్తారు. బస్ లు వున్నా అవి అన్ని పాయింట్స్ కవర్ చేయవు.
గుజరాత్ లోనే వున్నా సిద్దాపూర్ లోని (మాతృగయ) ఇది.
సిద్దేశ్వర్ మహాదేవ మందిర్ , మాతృ గయ, గుజరాత్ ఈ పురాతన ద్వారకా సిద్దేస్వర్ మహాదేవ ఆలయం గురించిన స్థల వివరాలు ఏమి లభ్యం కాలేదు.
....Mani Kopalle