Shunasshepudu
శునశ్శేపుడు
Shunasshepudu
ఆంధ్రుల చరిత్రకు సంబంధించిన గాథలో శునశ్శేపుని పేరు మనకు కనిపిస్తుంది. శునశ్శేపుడు రుచికుడనే రాజు కుమారుడు. అంబరీషుడనే రాజు రుచికుని వద్దకు వచ్చి, “నీకు లక్ష ఆవులనిస్తాను, నీ కుమారులలో ఒకరిని యజ్ఞ పశువుగా నాకివ్వు” అని కోరతాడు.
దానికి అంగీకరించిన రుచికుడు, తన కుమారులలో శునశ్శేపుడిని యజ్ఞ పశువుగా అంబరీషునికి ఇస్తాడు, అంబరీషుడు శునశ్శేపుడిని తీసుకువెడుతుండగా, శునశ్శేపుని మేనమామ అయిన విశ్వామిత్రుడది చూసి, శునశ్శేపుడిని విడిపించాలనుకుంటాడు. అంబరీషుడి వద్దకు వెళ్ళి, శునశ్శేపుడిని విడవమని కోరగా, నీ కుమారులలో ఎవరినైనా ఇస్తే, శునశ్శేపుడిని విడిచిపెడతానని చెబుతాడు.
అయితే విశ్వామిత్రుని కుమారులలో ఎవరూ యాగపశువుగా వెళ్ళడానికి అంగీకరించకపోవడంతో, విశ్వామిత్రుడు శునశ్శేపునికి ఒక మంత్రాన్ని ఉపదేశించి, ఆ మంత్రాన్ని పఠిస్తే అన్నీ శుభాలే కలుగుతాయని చెప్పి వెళ్ళిపోతాడు. శునశ్శేపుడు ఆ మంత్రాన్ని పఠించగా ఇంద్రుడు వచ్చి అంబరీషునికి యాగఫలాన్నిచ్చి, శునశ్శేపుడిని విడిపిస్తాడు. ఇది శునశ్శేపుని గాథ.