Read more!

Parameshwara Leelavilasam

 

పరమేశ్వరుడి లీలావిలాసం

Parameshwara Leelavilasam

భగవంతుడి గురించి ఎంత విన్నా ఇంకా ఇంకా వినాలని, చదవాలని, తెలుసుకోవాలని అనిపిస్తుంది .ఇది సహజం .సముద్రం లోతులా భగవంతుడు ఒకపట్టాన ఎవరికీ అంతుపట్టడు.ఒకవేళ పట్టాడా మనం మరచిపోయనా, దేవుడు మనల్ని వదలిపెట్టడు.

 

ఇదీ భగవంతుడి చిత్రం! ఎప్పుడు కనికరిస్తాడో తెలిదు .ఎప్పుడు అగ్రహిస్తాడో అంతకన్నా తెలిదు .మంచి చేద్దామని వచ్చిన మన్మధుని మసిచేసి వదలిపెట్టాడు. పరీక్షిద్దామని వరం కోరినవాడిని అనుగ్రహించి ఆపదల్లో చిక్కున్నాడు. అసలు రూపమే లేదంటాడు .ఇది పరమేశ్వరుడి లీలావిలాసం. పరమవిశిష్టమైన, పునీతమైన ఈ భారతదేశంలో ప్రతి అణువు ఎంతో పవిత్రమైనది. అందులోను బదరికావనం అత్యంత పవిత్రమైనది. ఎందుకంటే ఎందరో మునీశ్వరులు ,మహా యోగుల పాదస్పర్సతో పులకించిపోయింది.అందుకే దీనికి ఇంత ప్రాధాన్యత వచ్చింది .

 

ఇటువంటి స్థలంలో మహర్షులు కలసి ఒక గొప్ప యాగాన్ని చేయాలని సంకల్పించారు. మహానుభావులు తలచుకుంటే కాని పని ఉంటుందా? అంతే! తక్షణమే యాగానికి కావలసినవన్నీ సమకూరిపోయాయి .

 

మనం అనుకున్న సంకల్పం మంచిదైతే అది తప్పకుండా సిద్దిస్తుంది. ఒకవేళ నిజంగా అంతటి సంకల్పాన్ని నెరవేర్చే శక్తి మనకు లేకపోయినప్పటికీ ఆ సమయానికి ఆ శక్తిగల వారిద్వారా సహాయం అంది ఆ పని తప్పకుండా నెరవేరి తీరుతుంది .దాన్నే సంకల్పబలం అంటారు. అలా ఈ మహానుభావుల౦తా కలిసి యాగం చేయాలని అనుకున్నదే తడవుగా ఆ ప్రాంతానికి మునులందరిలోకీ శ్రేష్ఠుడయిన సూత మహాముని అక్కడకు వచ్చాడు.

 

సూత మహాముని విచ్చేయడం అంటే యాగానికి శుభ సంకేతంగా భావిస్తారు రుషులంతా .వేదాల్ని విభజన చేసి ,పంచమవేదమైన మహాభారతాన్ని ,ఉపనిషత్తుల్ని మరెన్నో పుణ్యగ్రంధాల్ని లోకానికి అందంచిన అపర నారాయణుడైన వ్యాసమహర్షి శిష్యుడు సూతుడు .అటువంటి మహానుభావుడు ఇక్కడికి రావడంతో తమ జన్మ పావనమైనదిగా భావిస్తారు మునులంతా. మునీశ్వరులంతా కలసి సూతమహామునుకి అతిధి సత్కారాలు ,అర్ఘ్యపాద్యాదులను భక్తీ శ్రద్దలతో సమర్పించి పూజించారు. అందుకు ఎంతగానో సంతోషించిన సూతుడు వారందరిని మన:పూర్వకంగా ఆశీర్వదించాడు .

 

అనంతరం ఋషులు సూతుని పరి పరి విధాలుగా ప్రస్తుతించి, నమస్కరించి ''మేము యాగం చేయాలని సంకల్పించగానే మీరు ప్రత్యక్షం కావడంతో మాకెంతో ఆనందంగా, ధైర్యంగా ఉంది. మీ దయవల్లనే మేము ఇంతవరకు అనేక పురాణాల్ని విని మా శ్రవణాలను,మనస్సును కూడా పునీతం చేసుకున్నాము .ఇదే విధముగా పవిత్రమైన ,మధురమైన మీ వాణితో శివుని గురించి, ఆయన మహత్యాన్ని గురించి వినాలని అనుకుంటున్నాము .ఈ సమయం కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నాము. ఇప్పటికి మీ రాకతో ఆ శుభ ఘడియలు వచ్చినట్లై౦ది . కాబట్టి మాయందు కనికరించి ఆ కధలను మాకు చెప్పి మమ్ము తరింపచేయండి అంటూ ప్రార్దించారు .

 

కాబట్టి ఈ కధలు చదివి కైలాసనాధుని కరుణాకటాక్షాలను పొందాలని ''తెలుగువన్'' మస్పూర్తిగా కోరుకుంటోంది. ఈ పుణ్య కథలు చదివి మీ జన్మ తరింపజేసుకోండి.

 

shiva purana part 1, shiva purana in telugu, shiv purana to download, shiv purana gives salvation