Read more!

సర్వం విష్ణుమయం జగత్

 

సర్వం విష్ణుమయం జగత్

ఎవరైతే సమస్త యజ్ఞాలకు విష్ణువే భోక్తయని తెలుసుకోకుండా, ఇతర దేవతలనుద్దేశించి యజ్ఞాలను చేయడంగానీ, దానాదులను ఇవ్వడంగానీ చేస్తారో, వారు ధర్మనాశకులని పద్మపురాణం. సమస్త యజ్ఞ భోక్తారమవిది త్వాచ్యుతం హరిం ఉద్దిశ్య దేవతా ఏవజుహోతి చదాదితిచ సపాషిండేతి విజ్ఞేయః భారతదేశాన్ని యజ్ఞాయ దేశంగా స్మృతులు కొనియాడాయి. ప్రతి గ్రామంలో దేవమందిరాలు, యజ్ఞం, ప్రతి గృహంలో యజ్ఞ సరంభాలు, ప్రతి వ్యక్తిలో ధర్మం ఉన్నదేశం భారతదేశమని భవిష్యపురాణం కీర్తించింది.

గ్రామే గ్రామే స్థితో దేవో గ్రామేగ్రామే స్థితోమఖః
గేహే గేహే స్థితంద్రవ్యం ధర్మశ్చైవ వజనే జనే

జంబూద్వీపంలోనే యజ్ఞస్వరూపుడైన యజ్ఞపురుషుని విష్ణువును యజ్ఞాల ద్వారా అర్చించడం జరిగింది. ఇతర ద్వీపాలలో భిన్నమైన ఉపాసలున్నాయి.. ఈ ద్వీపంలో కూడ భరతర్షం శ్రేష్ఠమైనది.యజ్ఞం వల్లనే ఇది కర్మభూమిగా పిలువబడింది. మిగిలినవి భోగభూములని బ్రహ్మపురాణం.

పురుషైర్యజ్ఞ పురుషో జంబూద్వీపే సదేజ్యతే
యజ్ఞేర్యజ్ఞమయో విష్ణురన్య  ద్వీపేషు చాన్యథా
అత్రాపి భారతం శ్రేష్ఠం జంబూద్వీపే మహామునే
యతోహి కర్మ భూరేషాయతో న్యా భోగభూమయః

కర్మల ద్వారా, కర్మవాసనల, కర్మఫలముల నాశనం కావాలంటే యజ్ఞమే చేయాలి. యజ్ఞాదుల ద్వారా విష్ణువును అర్చించడణి భాగవతం.

కర్మణాకర్మ నిర్హార ఏష సాధు నిరూపితః
యచ్చ్రద్దయా యజేద్ విష్ణుం సర్వయజ్ఞేశ్వరం ముఖైః

యజ్ఞకుండంలో వేసిన ఆహుతులు అగ్ని వాయు సంసర్గం వల్ల వాయుమండలం వరకు వ్యాపిస్తున్నాయి. ఈ యజ్ఞం వల్ల యజమానికి, ప్రజలకు లాభం జరుగుతోంది. పాశ్చాత్యులు వీటి మీద పరిశోధనలు చేసి వాతావరణ కాలుష్యాన్ని పోగొట్టుకోవాలంటే, సకాలంలో వర్షాలు పడాలంటే వీటిని ఆశ్రయించడం ఉత్తమమని వ్రాస్తున్నారు. చెట్టు మొదట్లో నీరు పోస్తే, చెట్టుకు అంతటికీ ఎలా లాభమో, కర్మభూమిలో ఇవి చేస్తే మిగిలిన జగత్తుకంతటికీ అంతే లాభం.

అసలు విష్ణు శబ్దం 'విష్ఞృ' ధాతువు నుండి పుట్టింది. అంటే, వ్యాపించి ఉండేవాడని అర్థం. ఇలా వ్యాపించి ఉండే సమస్త పదార్థాలను విష్ణుపదంతోనే వ్యవహరిస్తుంటారు. జగత్తంతా అణువులతో నిండి ఉందని నేటి శాస్త్రజ్ఞులు అంటున్నారు. అవన్నీ జడములు కావని, చైతన్య స్వరూపాలేనని నిర్ణయించారు. జగత్తంతా అణుమయమని నేటి సైన్సు చెప్పగా మనం విష్ణుమయన్నాం. ఆయనను అణువులలో అణువుగా, మహత్తులలో మహాత్తుగా ఉపనిషత్తులు పేర్కొన్నాయి. నిత్యం పరిభ్రమించే ఆ అణువులను అన్డిపే శక్తిని కొన్ని అణువులను కలిపి, కొన్ని రూపాలుగా మార్చే శక్తిని విష్ణువని అంటున్నాం. ఆ అణువులతో ఆ శక్తిని ఉంచడమే యజ్ఞం. వాటివాటిని ఆయాస్థానాలాలో ఉంచే శక్తియే, యజ్ఞం. ఈ యజ్ఞాన్ని భువనం యొక్క నాభియని, కేంద్రమని వేదం చెప్పింది.