Dadheechi
దధీచి
Dadheechi
దధీచి చ్యవన మహర్షి కుమారుడు. చిన్నతనం నుంచీ దధీచి తపస్సు చేస్తుండేవాడు. ఇతని కుమారుడు సారస్వతుడు.
దధీచి ఒకసారి తన బాల్య స్నేహితుడైన క్షుపుడనే రాజుతో యధాలాపంగా వాదన ప్రారంభించి, ఆ వాదనలో బ్రాహ్మణులే గొప్పవారని చెప్పడంతో, క్షుపుడు ఆగ్రహంతో దధీచిని సంహరిస్తాడు. శుక్రాచార్యుడు మృత సంజీవని విద్యలో దధీచిని తిరిగి బ్రతికిస్తాడు. దధీచి శివుడి గురించి తపస్సు చేసి, స్వచ్చంద మరణాన్ని, వజ్రం వంటి శరీరాన్ని, విజయశక్తిని వరాలుగా పొందుతాడు.
కొంతకాలానికి దేవదానవులకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతలు తమ ఆయుధాలను దధీచి వద్ద దాచి, తిరిగి తాము వచ్చినప్పుడు ఆ ఆయుధాలను తిరిగి ఇవ్వమని కోరతాడు.
ఎంతకాకానికీ దేవతలు తిరిగి రాకపోవడంతో, ఆ ఆయుధాలను భద్రంగా దాచే శక్తి తనకు లేడని దధీచి, ఆయుధాలన్నింటినీ మింగేస్తాడు. ఆ ఆయుధాలన్నీ ఆయన శరీరంలో జీర్ణమైపోతాయి.
చాలాకాలం తర్వాత దేవతలు వచ్చి, ఆయుధాల గురించి అడగగా, జరిగింది చెప్పి, తన దేహమే ఆయుధాగారం వలె అయిపోయిందని, అవసరమొచ్చినప్పుడు ప్రాణాలను పరిత్యజించి ఆయుధాలను ఇస్తానని దేవతలకు వాగ్దానం చేసి వారిని పంపేస్తాడు. ఇది జరిగిన కొద్దికాలానికి వృత్రాసురుడు అనే రాక్షసుడు స్వర్గంపై దండెత్తుతాడు.
ఎన్నో వరాలు పొందిన ఆ రాక్షసుకు సాధారణ ఆయుధాల వల్ల మరణించడు. చివరకు ఇంద్రుడు తదితర దేవతలు దధీచి వద్దకు వెళ్ళి. తమకిప్పుడు శక్తివంతమైన ఆయుధాల అవసరమున్నదని చెబుతాడు. వృత్రాసురుడి గురించి తెలుసుకున్న దధీచి, తన వెన్నెముకను ఆయుధంగా తీసుకోవలసిందిగా ఇంద్రుడికి సూచించి, ప్రాణత్యాగం చేస్తాడు.
మిగిలిన దధీచి ఎముకలను ఆయుధాలుగా స్వీకరించిన దేవతలు రాక్షసులతో యుద్ధం చేసి విజయం సాధిస్తారు దధీచి కుమారుడు పిప్పలాదుడు.
hindu sage Dadheechi, maharshi Dadheechi, Dadheechi and sacrifice, Dadheechi in hindu epics, greatness of Dadheechi