Saptarushulu – Atri Maharshi
సప్తఋషులు - అత్రి మహర్షి
Saptarushulu – Atri Maharshi
మన పురాణాలలో సప్తఋషుల ప్రస్తావన అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. ఎవరెవరిని సప్తఋషులు అని పిలుస్తామో మనలో చాలామందికి తెలియదు. అందుకే ఒకసారి ఆ వివరాలెంటో చూద్దాం.
అత్రి, కశ్యప, గౌతమ, జమదగ్ని, భరద్వాజ, వశిష్ట, విశ్వామిత్రులను సప్తఋషులని పిలుస్తారు.
వీరిలో విశ్వామిత్రుడు క్షత్రియుడైనప్పటికీ తపస్సు చేసి బ్రహ్మర్షి అనిపించుకున్నాడు. సప్త ఋషులే కాకుండా అనేకమంది తపస్సంపన్నులైన ఋషులెందరో ఉన్నారు. ముందుగా సప్తఋషుల గురించి తెలుసుకుందాం.
అత్రి మహర్షి
అత్రిమహర్షి బ్రహ్మ మానసపుత్రుడు. ‘సృష్టి’ లో తనకు ఒక సహాయకుడు కావాలని బ్రహ్మ అనుకున్నప్పుడు, ఆయన మనోశక్తితో జన్మించిన వాడు అత్రి. ఆయన భార్య అనసూయ.
అత్రిమహర్షి చేసిన ఘోరమైన తపస్సుకు బ్రహ్మ, మహేశ్వరులు ఒకేసారి ప్రత్యేక్షమయ్యారు. త్రిమూర్తులు తనకు సంతానంగా జన్మించాలని అత్రిమహర్షి కోరుకున్నాడు. అప్పుడు ఆయనకు ముగ్గురూ కుమారులు జన్మించారు.
బ్రహ్మ అంశలో చంద్రుడు, విష్ణుమూర్తి అంశంలో దత్తాత్రేయుడు, శివుడి అంశంలో దూర్వాసుడు జన్మించారు.
అత్రి మహర్షి పేరుతో ఆత్రేయ ధర్మశాస్త్రము ఉంది. తొమ్మిది అధ్యాయాలున్న ఈ శాస్త్రంలో ధర్మానికి సంబంధించిన ఎన్నో విషయాలున్నాయి.
Sage athri, hindu maharshi athri, athri maharshi in hindu epics, atri maharshi in hindu puranas, hindu devotional literature atri maharshi, dharmik literature atri maharshi