Bharadwaja Maharshi
భరద్వాజ మహర్షి
Bharadwaja Maharshi
దేవగురువు బృహస్పతి కుమారుడు భరద్వాజుడు. అంటే, బృహస్పతికీ, ఆయన వదిన మమతకూ జన్మించిన వాడు భరద్వాజుడు. మహాభారతంలోని కురుపాండవులకు కులగురువైన ద్రోణుని తండ్రి ఇతడు. రామాయణ కాలంలో వనవాసం చేస్తున్న రామునికి భరద్వాజుడు కొంతకాలం ఆశ్రయమిచ్చాడు.
దివోదాసు అనే క్షత్రియుడికి యుద్ధవిద్యలు నేర్పించిన భరద్వాజుడు ధర్మశాస్త్రాల గురించి గ్రంథం రాశాడు. ఆ గ్రంతానికే భరద్వాజ స్మృతి అని పేరు. చాణుక్యుని అర్థశాస్త్రం వలె భరద్వాజ స్మృతిలో అనేక విషయాలున్నాయి.
రాజుకు ఉండవలసిన లక్షణాలను వివరిస్తూ, ''రాజు అన్నవాడు శత్రువుతో మృదువుగా సంభాషించాలి. పంది వలె మూలాన్ని పెకలించాలి. సకల సంపదలు సాధించాలి. మేరువు వలె నిశ్చలంగా ఉండాలి...'' - అంటూ రాజులకు ఉండవలసిన ఒక్కో విశిష్ట గుణం గురించి ఈ స్మృతిలో వివరించాడు భరద్వాజుడు.
భరద్వాజుడు వైమానిక శాస్త్రం కూడా రచించాడు. రైట్ బ్రదర్స్ కంటే ముందెప్పుడో రాసిన వ్వ్ వైమానిక శాస్త్రంలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి.