Ashtavakra

 

తండ్రికి కీర్తి తెచ్చిన అష్టావక్రుడు

Ashtavakra

 

ఏకపాదుడనే మహా విద్వాంసుని కుమారుడు అష్టావక్రుడు. 

తల్లి గర్భమునందున్న సమయంలో, శిష్యులకు విద్యనేర్పుతున్న ఏకపాదుడిని చూసి, “ఎందుకు శిష్యులని ఇంత కఠోర శ్రమకు గురిచేస్తావు?” అని ప్రశ్నిస్తాడు. అష్టావక్రుడు.

దీనికి కోపించిన ఏకపాదుడు. “నువ్వు ఎనిమిది వంకరలతో జన్మించు” అని శపిస్తాడు.

ఆ శాప ఫలితంగా ఎనిమిది వంకరలతో జన్మించి అష్టావక్రుడు అయ్యాడు.

ధనసంపాదన కోసం జనకుని వద్దకు వెళ్ళిన ఏకపాదుడు ఎంతకాలానికీ తిరిగి రాకపోవడం చూసిన అష్టావక్రుడు చివరికి తనే జనకుడి సభకు వెళ్ళాడు.

అక్కడ వరుణపుత్రుడను పండితుడు తండ్రిని ఓడించి, తన చెరలో ఉంచుకున్నాడని తెలిసి అతడిని ఓడించి తన తండ్రిని చెర నుండి విడిపించాడు అష్టావక్రుడు.

ఆపైన ఎంతో కాలం ఒక చెరువు మధ్యలో తపస్సు చేశాడు అష్టావక్రుడు.

ఆ సమయంలో ఎందరో అప్సరసలు నృత్యగానాలతో అష్టావక్రుని సంతృప్తి పరచి విష్ణుమూర్తి తమకు భర్త అయ్యేటట్లు వరం పొందారు.

కృష్ణావతారంలో ఈ వరం ఫలిస్తుందని చెప్పిన అష్టావక్రుడు చెరువు నుంచి బయటకు రాగానే అతడి ఆకారాన్ని చూసి అప్సరసలు నవ్వుతారు.

దీనితో ఆగ్రహించిన అష్టావక్రుడు, “కృష్ణుడు మీకు భర్త అయినప్పటికీ అవతార పరిసమాప్తి సమయంలో, ఆయన పరోక్షంలో మీరు అవమానాల పాలవుతారు” అని శపించాడు.

అష్టావక్రుని శాప ప్రభావం వల్లనే ద్వారకా నగరం మునిగిపోయే సమయంలో గోపికలు అనేక అవమానాల పాలయ్యారని చెబుతారు.