Benefits of River Bath

 

నదీస్నానం వల్ల ప్రయోజనం ఏమిటి?

Benefits of River Bath

 

ఉదయానే దేహాన్ని శుభ్రం చేసుకోడానికి స్నానం చేస్తాం. నిజానికి శుచితో బాటు నీళ్ళతో దేహాన్ని తడపడంవల్ల లోపల ప్రవహిస్తున్న విద్యుచ్ఛక్తిని బయటకు పంపడం కూడా స్నానపు ప్రధాన ఉద్దేశం. అందుకే పొద్దున్నే స్నానం చేయాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. శరీరం మీద నీళ్ళు పడినప్పుడు, ఆ నీళ్ళు లోపలి విద్యుచ్ఛక్తిని పీల్చుకుంటాయి. ఆ రకంగా లోపలి విద్యుచ్ఛక్తి బయటకు వెళ్తుంది. ఆ ప్రక్రియ మొదలవగానే చురుకుదనం ప్రవేశిస్తుంది.

 

సాధారణంగా ఇంట్లో నిలవ ఉంచుకున్న నీళ్ళతో స్నానం చేస్తాం. కానీ అవకాశం ఉంది నదీస్నానం గనుక చేయగలిగితే పదింతల ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే నదిలో నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది కనుక అవెంతో స్వచ్చమైన నీళ్ళు. పైగా నదులు పుణ్యతీర్థాలు. కనుక నదిలో స్నానం చేయడంవల్ల ఆ ప్రభావం మనపై ఉంటుంది.

 

సాధారణ రోజుల్లో వీలు కాకున్నా పర్వదినాల్లో నదీస్నానం చేయమని ఉపదేశిస్తున్నాయి పూరాణాలు. కార్తీకమాసం మాదిరిగానే ధనుర్మాసంలో కూడా నదీస్నానం చేయడం ఉత్తమం. ఈ కాలంలో ఉదయానే చాలా చలిగా ఉంటుంది. కానీ స్నానానికి ఉపక్రమించనంతవరకూ మాత్రమే చలి ఒణికిస్తుంది. కాసిని నీళ్ళు తలపై పడగానే ఇక చలి పారిపోతుంది. తర్వాత ఎంతసేపు స్నానం చేసినా తనివితీరనట్లు ఉంటుంది.

 

ధనుర్మాసం అంటే అసలే చలికాలం. ఇలా గజగజ ఒణికించే చలిలో ఉదయానే స్నానం ఎందుకు చేయాలి అనే సందేహం కలుగుతుంది. పొద్దున్నే చేస్తే క్రమశిక్షణ వస్తుంది అనేది ఒక కారణం. నిజానికి సిసలైన కారణం ఇంకొకటి ఉంది. మనలో నిరంతరం విద్యుత్తు ప్రవహిస్తూ, విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతూ, బయటకు పోతూ ఉంటుంది. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు శరీరంలో ఉన్న విద్యుచ్ఛక్తి ఎక్కువగా బయటకు పోతుంది. శరీరంలో విద్యుచ్ఛక్తి కొత్తగా తయారౌతూ, బయటకు పోతూ ఉంటేనే మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం. ఈ ప్రక్రియను "electro-magnetic activity” అంటారు.

 

రాత్రి పడుకున్నది మొదలు, ఉదయం నిద్ర లేచేవరకూ విద్యుచ్ఛక్తి బయటకు పోదు. అందుకే పొద్దున్నే మనం చురుగ్గా ఉండం. నీరసంగా, బద్దకంగా ఉంటుంది. అప్పుడు ఏ పనీ చేయకుండా అలాగే పడుకోవడమో, కూర్చోవడమే చేస్తే ఆ సోమరితనం అలాగే కొనసాగుతుంది. అందుకే ఉదయం కాసేపు వ్యాహ్యాళికి వెళ్ళమంటారు. అలా చేయడంవల్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతూ, బయటకు పోతూ ఉత్సాహం చేకూరుతుంది. స్నానపానాదులు పూర్తయ్యాక మరింత ఉల్లాసంగా ఉంటుంది.

 

స్నానం చేసిన తర్వాత ఎంత హాయిగా, ఉత్సాహంగా ఉంటుందో మనందరికీ అనుభవమే. తాజాదనం, సంతోషం మన సొంతమౌతాయి.

 

"ఓం ఆపోహిష్టామ యోభువః

తాన ఊర్జే దధాతన మహేరణాయచక్షసే

యోవశ్శివతమోరసః

తస్య భాజయతేహనః"

 

నదీస్నానం చేస్తూ అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉదకాన్ని తలపై చల్లుకోవాలి. ఇలా మంత్ర సహితంగా ఉదకాన్ని తలపై జల్లుకోడాన్ని బ్రహ్మ స్నానం అంటారు. మన మనసులో నిరంతరం ఏవో ఆలోచనలు సాగుతూనే ఉంటాయి. మంత్రాన్ని స్మరిస్తే మరీ శ్రేష్టం. ఇతర అలజడులన్నీ మాయమై ఒక దివ్యానుభూతి కలుగుతుంది.

 

River bath in Dhanurmasam, hindu tradition river bath, auspicious river bath, divine culture river bath, early morning river bath in dhanurmasa, river bath gives punya