Sleeplessness Remedies

 

నిద్ర గురించి పతంజలి యోగశాస్త్రం ఏం చెప్తోంది?!

Sleeplessness Remedies

గాలీనీరూ తిండీతిప్పల్లాగే నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర కరువైతే ముఖం తోటకూర కాదలా వాలిపోతుంది. కళ్ళలో కాంతి కరువౌతుంది. ఉత్సాహం అనేది వెతికి చూసినా కనిపించదు. నిద్రలేమి అలసట, ఆందోళన కలిగించడమే కాకుండా అనేక రోగాలకు కారణమౌతుంది.

 

అయిదేళ్ళ లోపు చిన్నారులకు సుమారుగా 12 గంటల నిద్ర కావాలి. యౌవనంలో, వృద్ధాప్యంలో 9 గంటల నిద్ర అవసరం. ఇక నడివయసు వారికి నాలుగైదు గంటల నిద్ర సరిపోతుంది.

 

ఇంతకీ ఇంత ముఖ్యమైన నిద్ర గురించి పతంజలి యోగశాస్త్రం ఏం చెప్తోందో తెలుసుకుందాం.

 

కలతనిద్రవల్ల అంతగా ప్రయోజనం లేదు. కలతల్లేని ప్రశాంతమైన నిద్ర అవసరం. ఇలాంటి మంచి నిద్రలో కలలు రావు. ఈ నిద్రాస్థితినే గాఢ సుషుప్తి అంటారు. (ఇంగ్లీషులో sound sleep అంటారు) గాఢ నిద్ర గనుక అయితే రోజుకు నాలుగ్గంటలు సరిపోతుందని చెప్పాడు పతంజలి మహర్షి. గాఢ సుషుప్తావస్థలో మానసికంగా, శారీరకంగా సేదతీరతాం. అనేక గంటలపాటు కలత నిద్ర పోయేకంటే గాఢ నిద్ర నాలుగ్గంటలు సరిపోతుందని ఆనాడు పతంజలి మహర్షి చెప్పిన మాటే ఈనాటి డాక్టర్లు, సైంటిస్టులు కూడా చెప్తున్నారు.

 

మానసిక ఒత్తిడి, ఆందోళన, శరీరంలో వచ్చే మార్పులు, దీర్ఘకాలిక వ్యాధులు, వంశపారంపర్యంగా వచ్చే లక్షణాలు - మొదలైన కారణాలతో కొందరికి నిద్ర పట్టదు. నిద్ర పోయినప్పటికీ కొద్దిసేపట్లోనే అర్ధాంతరంగా మెలకువ వచ్చేస్తుంది. ఈ నిద్రలేమి అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది.

 

మన పూరాణాల్లో నిద్రలేమి నుంచి బయటపడటానికి చిట్కాలు కూడా సూచించారు. అవి అందరికీ అందుబాటులో ఉన్నవి, అతి సులభమైనవి.

 

*  రోజులో కనీసం గంటసేపు ధ్యానం చేస్తే నిద్ర పట్టకపోవడం అనే సమస్య తలెత్తదు. ఎక్కువసేపు ధ్యానం చేయలేనివారు కనీసం రాత్రి పవళించే ముందు అయినా కొంతసేపు ధ్యానం చేస్తే నిద్ర పడుతుంది.

 

* సాయంత్రం వేళ లేదా పడుకునేముందు స్నానం చేస్తే హాయిగా నిద్ర పడుతుంది.

 

* మెంతికూరను మెత్తగా నూరి రసం తీసి, అందులో తేనె వేసుకుని తాగితే వెంటనే నిద్రాదేవి ఒడిలో సేదతీరవచ్చు. ఒక నెల రోజులపాటు ఇలా చేస్తే అసలు నిద్రలేమి సమస్య ఉండనే ఉండదు. రోజూ సమయానికి నిద్ర పడుతుంది.

 

* పడుకునేముందు గోరువెచ్చని పాలు ఒక గ్లాసుడు తాగితే వెంటనే నిద్ర వస్తుంది.

 

* వెచ్చని పాలల్లో కొంత తేనె కలుపుకుని తాగితే నిద్ర పడుతుంది. ఆరోగ్యానికి అన్నివిధాలా మంచిది.

 

* శరీరాన్ని కొంతసేపు మర్దనా చేసుకుని తర్వాత నిద్రకు ఉపక్రమిస్తే వెంటనే మగత వస్తుంది. ముఖ్యంగా తల, అరికాళ్ళు, అరచేతులను మర్దనా చేయాలి.

 

insomnia remedies, how to get sound sleep, patanjali describes sleep, sleeplessness remedies, meditation for solid sleep, patanjali remedies for sleeplessness, insomnia remedies in Talapatras