రవిపుష్య యోగం.. 13 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ యోగం గురించి తెలుసా...

 

 

శ్రీరామ నవమి.. ఉగాది పండుగ తర్వాత వచ్చే ఈ పండుగ భారతదేశంలో చాలా గొప్పగా జరుపుకుంటారు. దేశం యావత్తు రామ నవమి రోజు రామ నామ స్మరణతో ఉప్పొంగుతుంది.  అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత రాముడికి మరింత ప్రాధ్యానత,  రాముడి పూజలకు చాలా ఆదరణ పెరిగింది.  అయితే ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామ నవమి కానుంది.  ఈ శ్రీరామ నవమి రోజు ఒక అరుదైన యోగం ఏర్పడుతోంది.  ఇదే రవి పుష్య యోగం.  దాదాపు 13 సంవత్సరాల తర్వాత ఈ యోగం ఏర్పడుతోంది. ఈ రవి పుష్య యోగం ఏమిటి? దీని వల్ల జరిగే మార్పులు ఏంటి తెలుసుకుంటే..

శ్రీరామ నవమి రోజు సూర్యుడు పుష్యమి నక్షత్రం కలయిక ఉంటుంది. అంటే సూర్యుడు పుష్యమి నక్ష్తత్రంలో ఉంటాడు.  జ్యోతిషశాస్ర్తం ప్రకారం ఇది చాలా శుభప్రదమైనది.  ఈ యోగం చాలా అదృష్టంగా పరిగణించబడుతుంది. ఈ రవి పుష్య యోగం మతపరమైన కార్యకలాపాలకు,  పూజలకు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు.

శ్రీరాముడి జన్మదినం రోజు ఈ రవి పుష్య యోగం ఏర్పడటంతో దీనికి మరింత ప్రాధాన్యత పెరగనుంది. ఈ యోగం వల్ల చాలా మందికి మానసిక శాంతి ఏర్పడుతుందని చెబుతున్నారు. రవి పుష్య యోగం వల్ల సూర్యుడు అధిపతిగా ఉన్న రాశులకు అదృష్టం కలసి వస్తుందని చెప్పడంలో సందేహం లేదట.  ఈ యోగం వల్ల స్వచ్చత,  శ్రేయస్సు, ఆనందం,  జీవితంలోనూ కుటుంబంలోనూ శాంతి ఏర్పడతాయట.

                                              *రూపశ్రీ