Purple Colour Therapy

 

ఊదారంగుతో చికిత్స

Purple Colour Therapy

 

కలర్ థెరపీ ఈమధ్యే పుట్టింది అనుకుంటారు చాలామంది. కానీ, ఇది సరికాదు. రంగులతో చికిత్స అనేది వేల సంవత్సరాల క్రితమే అంటే మన మహర్షుల కాలంలోనే ఉంది. వర్ణాలతో చేసే చికిత్స శారీరక అనారోగ్యాలను, మానసిక ఆందోళనలను తగ్గిస్తుంది. ప్రతి రంగులో కొన్ని శక్తులు ఉంటాయి. ఆయా గ్రహాలూ, రాశులను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో వర్ణం లాభాలను చేకూరుస్తుంది. ఆయా వర్ణాలు మనసుమీద, మెదడుమీద ప్రభావాన్ని చూపుతాయి. అందుకే తమకు అనుకూలమైన రంగును తెలుసుకుని ఇంట్లో, ఆఫీసులో ఆ రంగు ఎక్కువగా కనిపించేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఊదారంగు చేసే మేలు గురించి తెలుసుకుందాం.

 

ఊదారంగు సహస్రార చక్ర లేదా క్రౌన్ చక్రాను సూచిస్తుంది. పర్పుల్ కలర్ అధికంగా ఉన్నవారు అనవసరమైన ఉద్రేకాలకు లోనవరు. ఎలాంటి పరిస్థితిలోనయినా సమతుల్యంగా వ్యవహరిస్తారు. మానసికంగా పటిష్టంగా ఉండటమే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటారు. ఊదారంగు ఔన్నత్యాన్ని పట్టిచూపుతుంది. ధార్మికత ప్రతిఫలిస్తుంది.

 

ఊదారంగు తేజశ్చక్రం గలవారు లేనిపోని లౌక్యాలను ప్రదర్శించరు. వినయంగా, అమాయకంగా ఉంటారు. నమ్మినవారి కోసం సర్వం సమర్పించడానికి సిద్ధంగా ఉంటారు.

 

పర్పుల్ కలర్ తో మేహవ్యాధులు అరికడతాయి. శ్వాస సంబంధమైన జబ్బులు, పైత్యం, అజీర్ణం, జీర్ణాశయంలో కలిగే ఇతరత్రా ఇబ్బందులు, వేడితో వచ్చే సమస్యలు, పచ్చసెగ, మందాగ్ని, పొడిదగ్గు, కోరింతదగ్గు తగ్గుతాయి. మానసిక వ్యాధులు నయమౌతాయి.

 

నీల వర్ణంతో నయమయ్యే వ్యాధులన్నీ ఊదారంగుతో తగ్గుతాయి. ఇందులో వర్ణ ప్రభావం కొద్దిగా మోతాదు హెచ్చుగా ఉంటుంది కనుక వ్యాధులు మరింత త్వరితంగా నయమౌతాయి.

 

ఊదారంగు వల్ల ప్రయోజనాలను పొందాలంటే కేవలం దుస్తులే కాకుండా పక్క దుప్పట్లు, డోర్ కర్టెన్లు మొదలైనవి ఆ వర్ణంలో ఉండేలా చూసుకోవాలి. స్త్రీలు గాజులు, ఆభరణాల్లో రాళ్ళు ఊదారంగు ఉండేలా చూసుకోవాలి. అలాగే కేవలం ధరించడం వల్లే కాదు, ఈ రంగును చూసినందువల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. టేబుల్ మీద వీలయితే ఊదారంగు పూలు అమర్చిన ఫ్లవర్ వాజ్ ఉంచవచ్చు.

 

Purple color indicates The Crown Chakra, Purple Colour therapy, Decoration with Purple Colour, Purple Therapy for good health, Purple Colour therapy for peace