అయోద్యలో  రామయ్య ప్రాణప్రతిష్ట..  సమర్పించే  నైవేద్యాలు, విశేషాలు ఇవే..!

 

అయోద్యలో  రామయ్య ప్రాణప్రతిష్ట..  సమర్పించే  నైవేద్యాలు, విశేషాలు ఇవే.!


శ్రీరామ జన్మభూమి  అయోద్యా నగరంలో రామ మందిర నిర్మాణం ఎంతో గొప్పగా జరిగింది. కొత్త ఏడాదిలో మొదటి నెల అయిన జనవరి 22వ తేదీన రామ మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది. ఈ ప్రాణ ప్రతిష్ట రోజున రాముడికి పెట్టే నైవేద్యాల గురించి సమాచారం బయటకు వచ్చింది. ఇవి మాత్రమే కాకుండా ప్రాణ ప్రతిష్ట సమయం, ఇతర విశేషాలు కూడా చర్చనీయాంశంగా మారాయి.  శ్రీరామచంద్ర ప్రభువుకు ఈరోజున ఏఏ నైవైద్యాలు పెడుతున్నారో, అవి ఏఏ ప్రాంతాల నుండి తీసుకవస్తున్నారో.. అక్కడి విశేషాలు ఏంటో తెలుసుకుంటే..

రాముడికి పెట్టే నైవేద్యాలలో ఆయన మాతృభూమి అయిన చత్తీస్ గడ్  నుండ 3వేల క్వింటాళ్ల బియ్యం, నేపాల్ లోని జనక పూర్ నుండి దుస్తులు, పండ్లు, డ్రై ప్రూట్స్ ను అయోధ్యకు తీసుకువస్తున్నారట. అంతేకాకుండా  ఈ పవిత్రోత్సం రోజున శ్రీరాముడికి తమలపాకులను సమర్పిస్తారు. వీటిని బనారస్ నుండి తీసుకువస్తున్నారు.

రామమందిరంలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన సమయం కేవలం 84 సెకెన్లు మాత్రమే. ఇది  జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:29 నిమిషాల 8 సెకెన్లకు నుండి 12:30 నిమిషాల వరకు 84సెకెన్లలో ప్రాణ ప్రతిష్ట పూర్తవుతుంది.

ప్రాణప్రతిష్ట సమయంలో శ్రీరాముడి అత్తారిల్లు అయిన జనక్ పూర్ నుండి డ్రైప్రూట్స్ ను బహుమతులుగా అలంకరించబడిన 1100ప్లేట్ల అక్కడికి చేరనున్నాయి. వీటితో పాటు బోలెడు రకాల తీపిపదార్థాలు, పెరుగు, వెన్న, పండ్లు, బట్టలు కూడా అందజేస్తారు. ఇవన్నీ అత్తారింటి వైప కానుకలు.

ప్రాణప్రతిష్ట సందర్భంగా రామాలయంలో నైవేద్యాలు మాత్రమే కాకుండా ఎనిమిది లోహాలతో తయారుచేసిన గంటను కూడా  ఏర్పాటుచేయనున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద గంటగా చరిత్రలో నిలుస్తుందని చెబుతున్నారు.

రామమందిరాన్ని ప్రారంభించే సమయంలో 108 అడుగుల పొడవైన అరగొత్తులు వెలిగిస్తారు. ఈ అగరొత్తులు ధూపం కర్ర, పంచగవ్య, హవన పదార్థం, ఆవు పేడ మొదలైన పదార్థాలలో తయారు చేయబడుతున్నాయి.

                                                  *నిశ్శబ్ద.